• తాజా వార్తలు

ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్.. ధర 1.6 లక్షలు

ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండు మొదలైంది. పొలిటికల్ ఫోన్లు వస్తున్నాయ్. ఇప్పటికే ఇండియాలో నరేంద్ర మోడీ అభిమానులు ‘నమో’ బ్రాండ్ స్మార్టు ఫోన్లను తీసుకురాగా ఈ ధోరణి ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిత్రంతో ఒక స్పెషల్ ఫోన్ రిలీజ్ చేసింది నోకియా. దానికి మంచి ఆదరణే రావడంతో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా, రష్యాల అధ్యక్షులిద్దరి చిత్రాలతో కొత్త ఫోన్ ఒకటి రిలీజ్ చేసింది. దానిపై ట్రంప్, పుతిన్ చిత్రాలున్నాయి.
  

3310 మోడలే..

జర్మనీలోని హాంబర్గ్‌ లో జీ-20 సమావేశాల సందర్భంగా నోకియా ఈ కొత్త మొబైల్ ను రిలీజ్ చేసింది. నోకియా 3310 మోడల్ ఫోన్ బ్యాక్ కవర్ పై టైటానియం ప్లేట్ ను ఏర్పాటు చేసి అక్కడ ఈ బొమ్మలను ముద్రించి, దానిపై బంగారం పూత పూశారు.

ధర అదిరిపోతోంది..
    అయితే... ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేశారు. దీని ధరను 2,468 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ సుమారు 1.6 లక్షల రూపాయలు వరకు ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు