• తాజా వార్తలు

ఆన్ లైన్ లో 10 ఉచిత ఫ్యాక్స్ సర్వీస్ లు మీకోసం

ఆన్ లైన్ లో ఉన్న ఉచిత ఫ్యాక్స్ సర్వీస్ లు ఏమిటి? వీటి వాడకం ఎలా ఉంటుంది? తదితర విషయాలు ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. క్రింద ఇస్తున్న ఫ్యాక్స్ సర్వీస్ లను ఉపయోగించి కేవలం ఒక ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవడం ద్వారా అతి సులభంగా ఫ్యాక్స్ లను పంపించవచ్చు. వీటిలో చాలావరకూ యు ఎస్ మరియు కెనడా కు బాగా ఉపయోగపడతాయి. మిగతావి దాదాపు అన్ని దేశాలకూ ఫ్యాక్స్ పంపడానికి ఉపయోగపడతాయి.
ఇంతకీ ఫ్యాక్స్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు?
ఈ ప్రశ్న సాధారణంగా అందరికీ వచ్చేదే. ఎందుకంటే ఫ్యాక్స్ అనేది ఇప్పుడు దాదాపు అవుట్ డేటెడ్ అయిపొయింది.ఇప్పుడంతా ఈ మెయిల్ ల హవానే నడుస్తుంది. అయితే కొన్ని దేశాలలో ఇప్పటికీ ఫ్యాక్స్ ను ఒక ఫాషన్ గా ఉపయోగిస్తున్నారు. జపాన్ లాంటి దేశాల్లో ఈ మెయిల్ కు బదులు ఫ్యాక్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ ఫ్యాక్స్ ఎలా పంపుతారో మీకు అవగాహన ఉంది కదా! దీనికి ఒక ఫ్యాక్స్ మెషిన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఫ్యాక్స్ సర్వీస్ లకు ఏ రకమైన మెషిన్ అవసరం లేదు. కేవలం ఆన్ లైన్ ద్వారా మీరు ఫ్యాక్స్ ను పంపించవచ్చు.
1. హలో ఫ్యాక్స్
ఇది మీకు ఐదు ఫ్రీ ఫ్యాక్స్ ల వరకూ అవకాశాన్ని ఇస్తుంది. దీనిద్వారా మీరు pdf, ఇమేజెస్, డాక్స్ లాంటి వివిధ రకాల ఫార్మాట్ లలో ఫ్యాక్స్ ను పంపవచ్చు.
2. గాట్ ఫ్రీ ఫ్యాక్స్
ఇందులో కొన్ని అదనపు ఫార్మాట్ లలో కూడా ఫ్యాక్స్ పంపవచ్చు. ఇది స్కైప్ తో పూర్తిగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది చాల సెక్యూర్ గా ఉంటుంది. ఇందులో మీరు మీ ఫ్యాక్స్ ను ఐదు రోజుల వరకూ స్టోర్ చేసుకోవచ్చు.
3. పాం ఫ్యాక్స్
ఇందులో కూడా అనేక రకాల ఫార్మాట్ లను ఉపయోగించవచ్చు. ఇది మాక్, విండోస్, లినక్స్ ఇలా అన్నింటిలోనూ పనిచేస్తుంది.
4. మై ఫ్యాక్స్
ఇది యూజర్ లకు నెలకు 100 ఉచిత ఫ్యాక్స్ లను పంపడానికి మరియు 200 స్వీకరించడానికి అనుమతి నిస్తుంది. 5. పాప్ ఫ్యాక్స్
దీనికి మీరు ఒక సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. నెల రోజులు ఉచిత సర్వీస్ లను అందిస్తుంది. దీనిద్వారా ఒకేసారి అనేక మందికి ఫ్యాక్స్ ను పంపవచ్చు.
6. రింగ్ సెంట్రల్ ఫ్యాక్స్
దీనిద్వారా యూజర్ లు నెలకు 150 ఉచిత ఫ్యాక్స్ లను పంపవచ్చు.ఎలాంటి ఫ్యాక్స్ మెషిన్ ద్వారా అయినా మెసేజ్ లను స్వీకరించవచ్చు.
7. నెక్స్ టివా ఫ్యాక్స్
హై వాల్యూం ఫ్యాక్స్ లను పంపేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది నెలకు 500 ఉచిత ఫ్యాక్స్ లను అందిస్తుంది. ఇది అనేక రకాల ఫీచర్ లను అందిస్తుంది.
8. ట్రస్ట్ ఫ్యాక్స్
ఇది 24/7 తన ఫ్యాక్స్ సర్వీస్ ల ను అందిస్తుంది. ఇది ఎలాంటి మెసేజ్ లనైనా 30 రోజుల వరకూ స్టోర్ చేసుకుంటుంది.
9. ఈ ఫ్యాక్స్
ఇది నెలకు 150 ఇన్ కమింగ్ మరియు 150 అవుట్ గోయింగ్ ఫ్యాక్స్ లను అందిస్తుంది.
10. సెండ్ 2 ఫ్యాక్స్
ఇది కూడా దాదాపు అన్ని ఫార్మాట్ లను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది నెలకు 100 ఉచిత ఫ్యాక్స్ మెసేజ్ లను అందిస్తుంది.

జన రంజకమైన వార్తలు