ఇప్పటిదాకా మనం బీర్ గ్లాస్ తో కూడిన బాటిల్స్ లోనే చూశాం. ఇకపై వాటికి కాలం చెల్లిపోనుంది. పేపర్ తో కూడిన బీర్ బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్ కంపెనీ పేపర్ బీర్ బాటిల్స్ ప్రవేశపెట్టనుంది. గ్లాస్ బాటిల్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో డెన్మార్క్ కు చెందిన పాపులర్ బీర్ బ్రాండ్, కోపెన్ హ్యాగెన్ ఆధారిత కంపెనీ కార్లెస్ బెర్గ్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా గ్లాస్ బాటిల్స్ స్థానంలో పేపర్ బాటిల్స్ తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. కాగా పర్యావరణానికి ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైన నేపథ్యంలో గ్లాస్ వ్యర్థాలను కూడా బ్యాన్ చేస్తే మంచిదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం రెండు రీసెర్చ్ ప్రొటోటైప్ పేపర్ బాటిల్స్ ను విడుదల చేసింది. కాగా ఇప్పుడుపేపర్ బాటిల్ తయారీపై ‘గ్రీన్ ఫైబర్ బాటిల్’ పేరుతో వర్క్ జరుగుతున్నట్టు కంపెనీ తెలిపింది.
ఈ పేపర్ బీర్ బాటిళ్లు పర్యావరణంలో ఈజీగా కలిసిపోతాయి. అలాగే వీలయినప్పుడు రీసైకిల్ చేసుకోవచ్చుని పాపులర్ బీర్ బ్రాండ్ చెబుతోంది. కార్లెస్ బెర్గ్ బాటిల్ ను వుడ్ ఫైబర్ తో తయారు చేయాలని చూస్తోంది. ఇటీవల కోపెన్ హ్యాగెన్ లో జరిగిన కంపెనీ C40 వరల్డ్ మేయర్స్ సమ్మిట్ లో పేపర్ బాటిల్స్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2015లోనే ఈ ఐడియాను అమలు చేయాలని భావించిన కంపెనీ.. అప్పటినుంచి ప్యాకేజింగ్ నిపుణులు, ఎకడామిక్స్ నిపుణులతో చర్చిస్తోంది.
ఇదిలా ఉంటే ద్రవరూపంలో ఉండే రసాయనాల నిల్వకు వుడ్ కంటైనర్లు గొప్పగా పనిచేయవు. దీనికోసం కంపెనీ రీసెర్చ్ చేస్తోంది. ఇందుకోసం రెండు ప్రొటోటైపులను క్రియేట్ చేసే పనిలో పడింది. రీసైకిల్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) పాలిమర్ ఫిల్మ్‌ను ఉపయోగించి బాటిల్‌కు లోపలి అవరోధాన్ని సృష్టించడం ప్రోటోటైప్‌లలో ఒకటి. మరో ప్రోటోటైపు 100శాతం జీవావరణానికి సంబంధించింది. పాలిథిలిన్ ఫ్యూరోనేట్ (PEF) పాలీమర్ ఫిల్మ్ ఉంటుంది. ఇది అడవి, వ్యవసాయ వ్యర్థాల మాదిరిగా 100 శాతం తిరిగి పునరుత్పత్తి చేసుకునేలా ఉంటుంది. రీసైక్లింగ్ చేసినప్పటికీ కూడా అదనంగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి కాదు. ప్రస్తుతం ఈ రెండు ప్రోటోటైపులు టెస్టింగ్ దశలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది.