• తాజా వార్తలు

రియల్‌మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం 

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన  రియల్‌మి 5 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. అలాగే రియల్‌మి 5 ప్రొ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999గా ఉంది. 

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ పొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. 

రియల్‌మి 5 ఆఫర్లు 
ఈ ఫోన్‌పై జియో తన కస్టమర్లకు రూ.7వేల విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది. అలాగే రూ.750 విలువైన, రూ.20వేల ప్రయోజనాలతో కూడిన పేటీఎం మెంబర్‌షిప్ ఉచితంగా వస్తుంది.

రియల్‌మి 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6.3 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4035 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.


 

జన రంజకమైన వార్తలు