షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి నోట్ స్మార్ట్‌ఫోన్లు ఎట్టకేలకు బీజింగ్‌లో లాంచ్ అయ్యాయి. అలాగే అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌టీవీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్‌మి నోట్ 8 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ పేరుతో బడ్జెట్ ధరల్లో అద్భుత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటితోపాటు రెడ్‌మి టీవీని, నోట్‌బుక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
ధరలు
రెడ్‌మినోట్ 8 ప్రొ 6జీబీ/64జీబీ ధర రూ.14,000గా ఉంది. అలాగే 6జీబీ/128జీబీ ధర రూ.16,000గా ఉంది. 8జీబీ/128జీబీ ధర రూ.18,000గా ఉంది ఈ ఫోన్ల అమ్మకాలు సెప్టెంబరు 3 నుంచి ప్రారంభం కానున్నాయి.
రెడ్‌మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.10,000గా ఉంది. 6జీబీ/64జీబీ ధర రూ.12,000, 6జీబీ/128జీబీ ధర రూ.14,000గా ఉన్నాయి. వీటి అమ్మకాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
రెడ్‌మి నోట్ 8 ఫీచర్లు
6.39 అంగుళాల డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్,ఆండ్రాయిడ్ 9 పై, క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 సాక్, 4 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్,13 ఎంపీ సెల్ఫీ కెమెరా,48+ 8 + 2 +2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు
6.53 అంగుళాల డిస్‌ప్లే,1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్,మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ జీ90టీ,ఆండ్రాయిడ్ 9 పై,6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,20 ఎంపీ సెల్ఫీ కెమెరా,64+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా,4500ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్‌మి స్మార్ట్‌టీవీ
70 అంగుళాల భారీ స్క్రీన్‌తో వచ్చిన మొట్టమొదటి రెడ్‌మి టీవీ ఇది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను నడుపుతుంది. అల్ట్రా థిన్ బెజెల్స్, క్వాడ్ కోర్ సాక్, హెచ్‌డిఆర్ సపోర్ట్, 2జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్, డాల్బీ, డీటీఎస్ ఆడియో, 4.2 బ్లూటూత్, వాయిస్ రిమోట్ తదితర ఫీచర్లు జోడించింది. దీని ధర సుమారుగా రూ. 38 వేలుగా ఉండవచ్చని అంచనా. చైనా మార్కెట్లో ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇండియా సహా, గ్లోబల్ మార్కెట్లలో వీటి లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.