• తాజా వార్తలు

యాంకర్ అవతారం ఎత్తిన రోబో, వరల్డ్ తొలిఏఐ మహిళా న్యూస్ రీడర్‌‌గా రికార్డు 

టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న చైనా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రంగంలోనూ తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకూ రోబో సోఫియా ఒక సంచలనం అనుకుంటుండగా.. చైనా మరో అడుగు ముందుకేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  చైనా అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ మహిళా న్యూస్ రీడర్‌తో వార్తలు చదివించి ఆశ్చర్యపరిచింది. ఏఐ న్యూస్ రీడర్ వచ్చే నెలలో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదవడానికి సిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఏఐ రోబోకు 'జిన్ జియామెంగ్' అని పేరు పెట్టారు. చిన్న హెయిర్‌కట్, పింక్ డ్రెస్ వేసుకొని చెవులకు ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని ఒక నిమిషం పాటు వార్తలు చదివిన వీడియోను జిన్హువా విడుదల చేసింది. మనిషిలాగే హావభావాలు, కదలికలు, భావోద్వేగాల‌ను వ్యక్తీకరిచడం ఈ రోబో పత్యేకత. ఒక ప్రొఫెషనల్‌ న్యూస్‌ యాంకర్‌ వార్తలు ఎలా చదువుతారో అదే విధంగా చదవడం విశేషం. 

అయితే ఈ న్యూస్ యాంకర్ జిన్ చైనీస్ లేదా ఇంగ్లీష్ మాట్లాడుతుందా అనేదానిపై స్పష్టత లేదు. గ‌తేడాది చైనాలో జ‌రిగిన‌ ప్రపంచ ఇంటర్నెట్‌ సదస్సులో ఈ ఏఐ పురుష న్యూస్‌ రీడర్‌ను జిన్హువా ఛానల్‌ ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌ ఎలాంటి అలసట లేకుండా 24 గంటలూ, 365 రోజులూ చైనా, ఆంగ్ల భాషల్లో వార్తలు చదివేలా సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకొన్నట్లు జిన్హువా తెలియజేసింది.
 
ఒక యంత్రం వార్తలు చదివినట్లుగా కాకుండా తెరపై ఒక మనిషే చదువుతున్నట్లు.. ఆయా సంఘటనలకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శించడం, పెదాల కదలిక, అటూ ఇటూ కదలడం ఈ ఏఐ యాంకర్‌ ప్రత్యేకత. ఒక ప్రొఫెషనల్‌ న్యూస్‌ యాంకర్‌ వార్తలు ఎలా చదువుతారో అదే విధంగా చదవడం విశేషం. జిన్హువాతోపాటు సెర్చ్‌ ఇంజన్‌ కంపెనీ సొగోవ్‌ డాట్‌ కామ్‌ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

జన రంజకమైన వార్తలు