• తాజా వార్తలు

సైబర్ సెక్యూరిటీపై ఎపి ప్రభుత్వం తో చైనా కంపెనీ ఒప్పందం

రాష్ట్ర అభివృద్ది లోనూ , రాష్ట్ర ప్రభుత్వ పథకాలలోనూ సాంకేతిక పరిజ్ఞానం పోషిస్తున్న పాత్ర అద్వితీయమైనది. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క సేవలను నిరంతరాయం గా పొందాలంటే సైబర్ సెక్యూరిటీ పై కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఐటి సంబందిత నేరాలు విపరీతంగా పెరిగిపోయిన ఉదంతాలను మనం ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము. ప్రభుత్వ వెబ్ సైట్ లకు హ్యాకర్ లనుండీ తీవ్ర వాడ సంస్థలనుండీ ముప్పు ఉన్న నేపథ్యం లో పటిష్ట మైన సైబర్ సెక్యూరిటీ వలన కలిగే ప్రయోజనాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే పసిగట్టింది. సైబర్ సెక్యూరిటీ ని పటిష్టంగా ఉంచడం లో అనేక చర్యలు తీసుకుంటున్న ఎపి ప్రభుత్వం తాజగా ఒక చారిత్రత్మక ఒప్పందానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది.

ఐటి సంబందిత రంగమ లో అగ్రగాములలో ఒకటిగా కొనసాగుతున్న హ్యులేట్ ప్యాకర్డ్ సంస్థ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు.ఈకంపేనే వైస్ ప్రెసిడెంట్ అయిన రోజేరియో రిజో తో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా పలంటీర్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సైబర్ సెక్యూరిటీ కి సంబందించిన అమ్సల్ పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ పూర్తీ సహాయ సహకారాలు అందించడానికి సంసిద్దతను వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేగాక రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్న విషయాన్ని ఆ కంపెనీ యొకా హెడ్ దీవ గ్లేజర్ కి ముఖ్యమంత్రి వివరించారు.

ఈ ఒప్పందం కనుక అమలు అయితే సైబర్ సెక్యూరిటీ విషయం లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక అడుగు ముందుకు వేసినట్లే!