• తాజా వార్తలు
  •  

సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో దుష్ప్ర‌చారం.. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ సీరియ‌స్

ఫొటోల‌ను మార్ఫింగ్ చేయ‌డం, ఏపీ సీఎం, మినిస్ట‌ర్ల‌పై కామెంట్లు చేయ‌డానికి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో ఏకంగా పేజీలు క్రియేట్ చేయ‌డం, గ‌వ‌ర్న‌మెంట్‌పైనా విమ‌ర్శ‌లు చేయ‌డం ఇటీవ‌ల బాగా పెరిగిపోయింది. ప్ర‌తిప‌క్ష పార్టీల స‌పోర్ట‌ర్లు ముఖ్య‌గా కొంద‌రు యూత్ దీనిలో ఎంగేజ్ అయి ఉన్నారు. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తున్న ఏ యాక్టివిటీన‌యినా విమ‌ర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్న‌వారు చాలా మందే ఉన్నారు. వీట‌న్నింటినీ కంట్రోల్ చేయడానికి సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఆలోచిస్తోంది. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ ద్వారా గ‌వ‌ర్న‌మెంట్‌పై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది. ఫేస్‌బుక్‌లోని కొన్ని పేజీలు, వెబ్‌సైట్ల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.
కౌన్సిల్‌పైనా కామెంట్లా?
లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను పెద్దల స‌భ‌గా చెబుతారు. అలాంటి కౌన్సిల్‌పైనా బ్యాడ్ కామెంట్ల‌తో ప్రచారం జ‌రుగుతోంద‌ని ఓ మినిస్ట‌ర్‌.. కౌన్సిల్ ఛైర్మ‌న్ చక్రపాణి కి చెప్పారు. సీఎం, మినిస్ట‌ర్లే కాదు ఎమ్మ‌ల్యేలు, ఎమ్మెల్సీలపైనా దుష్ప్ర‌చారాన్ని జ‌రుగుతోంద‌ని.. దీన్ని అరిక‌ట్ట‌డానికి యాక్ష‌న్ తీసుకోవాల‌ని ఇప్పటికే ప్రభుత్వానికి కొంత‌మంది ఎమ్మెల్యేలు కంప్ల‌యింట్ కూడా చేశారు. దీంతో సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో నెగిటివ్ క్యాంపెయిన్‌పై చ‌ట్ట‌ప్ర‌కారం యాక్ష‌న్ తీసుకోవ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. దీనికోసం సైబ‌ర్ లాను ఇంప్లిమెంట్ చేయ‌డంపై లీగ‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ సాయం తీసుకుంటార‌ని చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు