• తాజా వార్తలు

జీఎస్టీ గురించి తెలియ‌జెప్పే నాలుగు యాప్స్ మీ కోసం..

జీఎస్టీ.. దేశ‌మంతా ఒక‌టే ప‌న్ను విధానం ఉండాల‌న్న ల‌క్ష్యంతో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకొచ్చిన కొత్త  విధానం.  ఇప్ప‌టివ‌ర‌కు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్స్ వేసే వ్యాట్‌, సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వేసే సీఎస్టీ, ఎక్సైజ్ వంటి ప‌న్నుల‌న్నీ పోయి ఒకే ఒక జీఎస్టీ (Goods and Services Tax) మాత్ర‌మే ఉంటుంది.  దీంతో వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు త‌గ్గుతాయని గ‌వ‌ర్న‌మెంట్ చెబుతోంది. లాభ‌, న‌ష్టాల మాట ఎలా ఉన్నా ఈ జీఎస్టీని అర్ధం చేసుకోవ‌డం, దాని గురించి తెలుసుకోవ‌డం చాలా మందికి పెద్ద ప‌జిల్‌గా మారింది. ఈ ప‌రిస్థితుల్లో  జీఎస్టీ గురించి మీకు తెలియ‌జేసే నాలుగు ఆండ్రాయిడ్ యాప్స్ గురించి ఇవీ..

1.జీఎస్టీ రేట్ ఫైండ‌ర్ (GST Rate Finder)

మీరు క‌స్ట‌మ‌ర్ అయి ఉండి ఒక ప్రొడ‌క్ట్ మీద ఎంత జీఎస్టీ ప‌డుతుందో తెలుసుకోవాలంటే ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి పొడ‌క్ట్‌, స‌ర్వీస్‌కు ఎంత జీఎస్టీ ప‌డుతుందో దీనిలో సెర్చ్ చేసి ఈజీగా తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు మాన్యుఫాక్చ‌ర‌ర్ అయితే మీరు తయారుచేయ‌బోయే వ‌స్తువులకు ఎంత వ‌ర‌కు ట్యాక్స్ వేయ‌వ‌చ్చో దీన్ని బ‌ట్టి కాలిక్యులేట్ చేసుకోవ‌చ్చు.  ఇది గ‌వ‌ర్న‌మెంట్ డిజైన్ చేసి రిలీజ్ చేసిన యాప్ కాబ‌ట్టి ఇన్ఫ‌ర్మేష‌న్ ప‌క్కాగా ఉంటుంది.  జీఎస్టీ రేట్ ఫైండ‌ర్ ఫ్రీయాప్‌.. యాడ్స్ కూడా ఉండ‌వు.

2. జీఎస్టీ ఎన్‌రోల్‌మెంట్ యాప్ (GST enrollment  app)

జీఎస్టీ ఎన్‌రోల్‌మెంట్‌ను సుల‌భం చేసే యాప్ ఇది.  ఇప్ప‌టివ‌ర‌కు స్టేట్ వ్యాట్, సెంట్ర‌ల్ వ్యాట్‌, స‌ర్వీస్ ట్యాక్స్ పేయ‌ర్లుగా ఉన్న‌వారు కొత్త జీఎస్టీ రిజైమ్‌లోకి మార‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఈ యాప్ ఆఫ్‌లైన్లోనూ ప‌ని చేస్తుంది. జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ మైగ్రేష‌న్ అప్లికేష‌న్ ను ప్రాసెస్ చేసి  డేటా ఆప్‌లోడ్ ఫైల్‌ను ఆటోమేటిగ్గా క్రియేట్ చేస్తుంది. ఇది కూడా ఫ్రీ యాప్‌. యాడ్స్ లేవు.

3. జీఎస్టీ క‌నెక్ట్ ( GST Connect )

జీఎస్టీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ కావ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా సీఏల‌కు, ట్యాక్స్ ప్రాక్టీష‌న‌ర్ల‌కు ఈ జీఎస్టీ క‌నెక్ట్ బాగా ఉప‌యోగం. జీఎస్టీ యాక్ట్‌, ఐజీఎస్టీ లా, నిపుణులు, సీఏల ఆర్టిక‌ల్స్ వంటివ‌న్నీ యాప్‌లో ఉంటాయి.  జీఎస్టీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోవ‌చ్చు.  ఇది కూడా ఆఫ్‌లైన్లో ప‌నిచేస్తుంది.  యాడ్స్ ఉండ‌వు.

4. జీఎస్టీ కాలిక్యులేట‌ర్ ఇండియా (GST Calculator India)

మీరు బిజినెస్ ప‌ర్స‌న్ అయితే జీఎస్టీ కింద ఒక ప్రొడ‌క్ట్ కు ఎంత ఎమ్మార్పీ ఛార్జ్ చేయ‌వ‌చ్చో  తెలుసుకోవ‌డానికి జీఎస్టీ కాలిక్యులేట‌ర్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  ట్రేడ్ టైప్‌ను సెల‌క్ట్ చేసి, ప్రొడక్ష‌న్ కాస్ట్‌, ప్రాఫిట్ మార్జిన్‌, జీఎస్టీ రేట్స్ అప్ల‌యి చేస్తే ఈ యాప్ మీ ప్రొడ‌క్ట్ ఇన్‌వాయిస్‌కు సంబంధించిన కంప్లీట్ ఎనాల‌సిస్ ఇస్తుంది. మాన్యుఫాక్చ‌ర‌ర్స్‌, హోల్‌సేల‌ర్‌, రిటెయిల‌ర్స్‌కు ఈ యాప్ అవ‌స‌రం. జీఎస్టీ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫోను కూడా ఇస్తుంది. ఎలాంటి యాడ్స్ లేకుండా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. 

GST, Android apps, GST Rate Finder, GST enrollment  app, GST Connect, GST Calculator India,  జీఎస్టీ ఆండ్రాయిడ్ యాప్స్, జీఎస్టీ రేట్‌ఫైండ‌ర్‌, జీఎస్టీ కాలిక్యులేట‌ర్‌, జీఎస్టీ క‌నెక్ట్‌,  

Four android apps.. those are helpful for Master in GST

జన రంజకమైన వార్తలు