• తాజా వార్తలు
  •  

ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కార్డుల‌ను బ్లాక్ చేస్తుందా? 

ఐఆర్‌సీటీసీ అంటే నెట్ యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇండియ‌న్ రైల్వే టికెట్స్ రిజ‌ర్వేష‌న్ సైట్ అయిన ఐఆర్‌సీటీసీ.. అత్యంత రద్దీ ఉన్న సైట్ల‌లో ఉన్న ఒక‌టి. ఈ సైట్‌లో టికెట్స్ బుకింగ్ చేయాలంటే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కార్డులు పనికిరావా?  వీటిని ఐఆర్‌సీటీసీ సైట్ బ్లాక్ చేస్తుందా?  రెండు రోజులుగా నెట్ న్యూస్‌లో వైర‌ల్ అయిన వార్త‌లు చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది. కానీ అలాంటిదేమీ లేద‌ని, ఎలాంటి కార్డుల‌నూ తాము బ్లాక్ చేయ‌లేద‌ని రైల్వే డిపార్ట్‌మెంట్ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేసింది. మాస్ట‌ర్ లేదా వీసా ప‌వ‌ర్డ్ అయిన ఇండియాలోని ఎలాంటి బ్యాంక్ కార్డ్ తో అయినా ఐఆర్‌సీటీసీలో ట్రాన్సాక్ష‌న్స్ చేసుకోవ‌చ్చ‌ని క్లారిటీ ఇచ్చింది. 
ఏం జరిగింది? 
ఇండియ‌న్ బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  కెన‌రా బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు మాత్ర‌మే ఐఆర్‌సీటీసీలో చెల్లుబాట‌వుతాయ‌ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ చూపించిన‌ట్లు న్యూస్ వైర‌ల్ అయింది. అంటే ఇండియాలో అతిపెద్ద ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన ఎస్బీఐ, అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐతోపాటు ఇంకా చాలా బ్యాంకుల కార్డుల‌కు అవ‌కాశం లేద‌న్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.  
అస‌లేమైంది? 
ఆర్‌బీఐ రూల్స్ ప్ర‌కారం మ‌ర్చంట్స్ బ్యాంక్ ఆన్‌లైన్ పేమంట్స్ స‌ర్వీస్‌ను వాడుకుంటే మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ ( MDR) పే చేయాలి. దీన్ని మ‌ర్చంట్ క‌స్ట‌మ‌ర్ నుంచి తీసుకుని బ్యాంక్‌కు పే చేస్తారు. అయితే డీమానిటైజేష‌న్ త‌ర్వాత డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్స‌హించేందుకు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ కొనుగోళ్ల‌పై క‌న్వీనియ‌న్స్ ఫీజ్ 20 రూపాయ‌ల‌ను  ఎత్తేసింది.  త‌మ‌కు క‌న్వీనియ‌న్స్ ఫీజ్ రావ‌డం లేదు కాబట్టి మీకు ఇస్తున్న ఎండీఆర్‌లో కొంత భాగం ఇవ్వండని ఐఆర్‌సీటీసీ బ్యాంకుల‌ను అడుగుతోంది.  అయితే దీన్ని ఎస్‌బీఐ, ఐసీఐసీఐ లాంటివి ఇందుకు నో అంటున్నాయి. ఎందుకంటే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్స్‌లో 35% ఎస్‌బీఐ యూజ‌ర్ల‌వే.  ఈ ప‌రిస్థితుల్లోనే  కార్డులను బ్లాక్ చేస్తుంద‌నే  ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ఎండీఆర్ ఛార్జీల ఇష్యూను రిజాల్వ్ చేసేందుకు ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ ఐఆర్‌సీటీసీతో చ‌ర్చిస్తోంది.  

జన రంజకమైన వార్తలు