• తాజా వార్తలు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు అంద‌రికి రెడీ..

పేటిఎం.. భార‌త్‌లో ఎక్కువ‌మందికి అందుబాటులో ఉన్న డిజిట‌ల్ వాలెట్‌. ఇప్పుడు పేటీఎం అంటే తెలియ‌ని వాళ్లు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే డిమానిటైజేష‌న్ స‌మయంలో పేటీఎం అంత‌గా జ‌నాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఒక‌ప్పుడు పేటీఎం అంటే ఏమిటి అని అడిగిన జ‌న‌మే ఇప్పుడు ప్ర‌తి షాపులో పేటీఎంను ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌తి మొబైల్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే పేటీఎం ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్‌తో ముందుకొచ్చింది. అది పేటీఎం బ్యాంకు. ఎప్ప‌టినుంచో ఈ విష‌యం గురించి చెబుతున్నా... పూర్తి స్థాయిలో ఇప్పుడే ఆ సంస్థ బ్యాంకును మొద‌లుపెట్టింది.  అయితే మీరు పేటిఎం ద్వారా పేమెంట్స్ చేయాలంటే ఏం చేయాలంటే..

6.0.0 వెర్ష‌న్‌కు మారిపోండి 

ఆండ్రాయిడ్ ఫోన్ ఉప‌యోగిస్తున్న‌ట్ల‌తే వెంట‌నే మీ ఫోన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ 6.0.0 వెర్ష‌న్‌లో మాత్ర‌మే ఈ పేమెంట్స్ బ్యాంకు మీకు అప్‌డేట్ అయింది. ఆండ్రాయిడ్‌తో యాపిల్ యూజ‌ర్ల‌కు కూడా ఐఎస్ఎస్‌లో ఈ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

వెబ్ బ్రౌజ‌ర్‌, ఫిజిక‌ల్ బ్రాంచ్‌ల‌లో దొర‌క‌దు

పేమెంట్స్ బ్యాంక్ అంటే అదేదో నిజంగా బ‌య‌ట ఉండే బ్యాంకు కాదు. ఇదో డిజిట‌ల్ బ్యాంకు. అందుకే ఫిజిక‌ల్ బ్రాంచ్ మీకు దొర‌క‌దు. మీ ఆండ్రాయిడ్ ఫోను కొత్త వెర్ష‌న్‌లో మాత్రమే ఇది మీకు ల‌భ్యం అవుతుంది. అంతేకాదు వెబ్ బ్రౌజ‌ర్‌లో కూడా పేటిఎం పేమెంట్ బ్యాంకు మీకు దొర‌క‌దు.  కాబ‌ట్టి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం మ‌స్ట్‌. అయితే పేటిఎం వాలెట్ వేరు, పేటిఎం  పేమెంట్స్ బ్యాంకు వేర‌నే విష‌యాన్ని అర్థం చేసుకోవాలి.

పేటీఎం పేమెంట్ బ్యాంకు సైన‌ప్ ప్రాసెస్‌

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మీద ట్యాప్ చేయ‌గానే పాస్‌కోడ్ అడుగుతుంది. అంతేకాక ఇందులో ఎంట‌ర్ కాగానే నామిని వివ‌రాలు ఇవ్వాలి. ఆ త‌ర్వాత అడ్రెస్ వివ‌రాలు ఇవ్వాలి.ఆధార్ నంబ‌ర్‌, కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి.  పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సైన్ అప్ ప్రాసెస్ పూర్తి చేసిన త‌ర్వాత మీకో అకౌంట్ నంబ‌ర్ వ‌స్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో మీ ఫోన్ నంబ‌రే అకౌంట్ నంబ‌ర్ కానీ పేటీకెం పేమెంట్స్ బ్యాంకులో  మాత్రం మీ అకౌంట్‌లోకి వెళ్లాలంటే రిజిస్టర్డ్ ఐడీ ద్వారా ఎంట‌ర్ కావాలి.

క‌నీస నిల్వ అక్క‌ర్లేదు

పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మీరు క‌నీస నిల్వ ఉంచాల్సిన అవ‌సరం లేదు. దీనిలో మాగ్జిమం లిమిట్ మాత్రం రూ.1 ల‌క్ష‌. ఏడాదికి రూ.4 శాతం వ‌డ్డీ కూడా ల‌భిస్తుంది. మీరు చేసే ఏ ఎల‌క్ట్రానిక్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ట్రాన్సాక్ష‌న్ ఫీజు ప‌డ‌దు. మీకు ఒక వ‌ర్చువ‌ల్ రూపే కార్డు జారీ  చేస్తారు . మీకు ఇచ్చిన కార్డుతో ఏటీఎం నుంచి డ‌బ్బులు కూడా తీసుకోవ‌చ్చు.  నెల‌కు ఐదుసార్లు డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.

లిమిటేష‌న్లు

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొన్ని ప‌రిమితులు ఉన్నాయి

ఇది లోన్లు ఇవ్వ‌దు

క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయ‌దు

అద‌న‌పు స‌దుపాయాల కోసం వేరే ఆర్థిక సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు