• తాజా వార్తలు

ఆసుస్, యాపిల్ ఫోన్ల ధరలు ఎంతెంత తగ్గాయంటే..

 

    జీఎస్టీ రాకతో పలు ఫోన్ల ధరలు పెరుగుతాయి... కొన్ని కంపెనీలవి తగ్గుతాయన్న సంగతి తెలిసిందే. పూర్తిగా విదేశాల్లోనే తయారై దిగుమతి అయ్యే ఫోన్ల ధరలు తగ్గుతాయి. దేశీయంగా తయారయ్యేవి... ఇక్కడ అసెంబ్లింగ్ చేసేవి పెరుగుతాయి. ఈ క్రమంలో పూర్తిగా ఫారిన్ మేన్యుఫ్యాక్చర్డ్ మొబైల్స్ కొన్నిటి ధరలు తగ్గాయి. ఆయా కంపెనీలు కూడా వాటి ధరలను తగ్గించి వినియోగదారులకు ప్రయోజనాలు అందిస్తున్నాయి. 
        ఈ క్రమంలో తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఆసుస్‌ పలు మోడళ్ల ధరలను తగ్గించింది. కొన్ని మోడళ్లపై రూ.3000 వరకూ తగ్గింపును ప్రకటించింది. 
* ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 3 (జెడ్‌ఈ552కెఎల్‌) ధర రూ.19,999 ఉండగా, తాజాగా రూ.16,999కి తగ్గింది. గతేడాది ఆగస్టు విడుదలైన ఈ ఫోన్‌ రూ.27,999 నుంచి తగ్గుతూ వచ్చింది. 5.5 అంగుళాల తాకేతెర, 4జీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మెమొరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.
* ఆసుస్‌ జెన్‌ ఫోన్‌3(జెడ్‌ఈ520కెల్‌) ధర సైతం రూ.17,999 నుంచి 15,999కి తగ్గింది. 5.2 అంగుళాల తాకేతెర, 3జీబీ ర్యామ్‌, 32జీబీ అంతర్గత మెమొరీ, 2650 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది.
* ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ 3 మ్యాక్‌(జెడ్‌సీ553కెఎల్‌) ప్రారంభ ధర రూ.17,999 ఉండగా, ఇప్పుడు రూ. 14,999కి దిగి వచ్చింది. 5.5 అంగుళాల తాకే తెర, 3జీబీ ర్యామ్‌, 16మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా, 8మెగా పిక్సెల్‌ ముందు కెమేరా దీని ప్రత్యేతకలు.

యాపిల్ కూడా తగ్గించింది..
యాపిల్ కూడా తన స్మార్టు డివైస్ ల ధరలను 7.5 శాతం తగ్గించింది. భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, వాచ్‌లపై రిటైల్ ధరలకు ఈ తగ్గింపు వర్తింపజేసింది. మ్యాక్‌లైన్ కంప్యూటర్ల ధరలను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. 
* ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ అసలు ధర రూ.27,200 కాగా ప్రస్తుతం రూ.26 వేలకే అందిస్తోంది. 
* ఇదే ఫోన్ 128 జీబీ అసలు ధర రూ.37,200 కాగా తగ్గింపు తర్వాత రూ.35వేలుగా సంస్థ పేర్కొంది. 
* ఐ ఫోన్ సిక్స్ ఎస్ 32 జీబీ వేరియంట్ అసలు ధర రూ.50 వేలు కాగా తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.46,900కే అందిస్తోంది. 
* ఇదే ఫోన్ 128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.60 వేలు కాగా, ప్రస్తుతం రూ.55,900కే విక్రయించనుంది.
 

జన రంజకమైన వార్తలు