• తాజా వార్తలు

వాట్స‌ప్ పేమెంట్స్ రిస్క్ అని పేటీఎం అన‌డం వెనుక ప‌చ్చి నిజాలు!

ఇప్పుడు న‌డుస్తోంది డిజిట‌ల్ యుగం. అంతా డిజిట‌ల్ లావాదేవీలే. ముఖ్యంగా డీమానిటైజేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత భార‌త్‌లో డిజిట‌ల్ లావాదేవీలు గ‌ణ‌నీయంగా పెరిగిపోయాయి. సామాన్యులు కూడా పేటీఎం లాంటి వాటిని అల‌వోక‌గా వాడేస్తున్నారు.  పేటీఎం బాట‌లో చాలా డిజిట‌ల్ వాలెట్స్ రంగప్ర‌వేశం చేశాయి. అదే కోవ‌కు చెందిందే వాట్స‌ప్ పేమెంట్స్‌. అయితే వాట్స‌ప్ పేమెంట్ సెక్యూర్ కాద‌ని చెబుతోంది పేటీఎం. ఆ సంస్థ అలా చెప్ప‌డం  వెనుక కొన్ని ప‌చ్చి నిజాలున్నాయి.. అవేంటంటే..

ఎంత‌వ‌ర‌కు నిజం..
భార‌త్‌లో పాపుల‌ర్ అయిన డిజిట‌ల్ వాలెట్ పేటీఎం. దాని బాట‌లోనే వ‌చ్చింది వాట్స‌ప్. భార‌త్‌లో త‌న‌కున్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన వాట్స‌ప్ తాజాగా నెల క్రిత‌మే ఈ స‌ర్వీసును ప‌రిచ‌యం చేసింది. యూపీఐ బేస్డ్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే పేటీఎం మాదిరిగానే పేమెంట్స్ చేయ‌డం.. పేమెంట్స్ రిసీవ్ చేసుకోవ‌డం దీని ప్ర‌ధాన ఉప‌యోగాలు. వాట్స‌ప్ విదేశీ కంపెనీ అని.. ఫేస్‌బుక్ అండ‌ర్‌లో న‌డుస్తోంద‌ని ఇలాంటి కంపెనీ నుంచి పేమెంట్స్ చెల్లించ‌డం, తీసుకోవ‌డం అంత సెక్యూర్ కాద‌ని పేటీఎం ఏకంగా ఒక ప్ర‌క‌ట‌నే విడుద‌ల చేసింది. వా్ట్స‌ప్ తమ‌కు పోటీగా నిలుస్తుంద‌నే ఈ విష‌యాన్ని చెప్ప‌ట్లేద‌ని ప్ర‌జ‌ల‌ను శ్రేయ‌స్సు దృష్ట్యానే ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ట్లు కూడా చెప్పింది. 

సెక్యూరిటీ ఎక్క‌డ‌?
వాట్స‌ప్‌లో పేమెంట్స్‌కు పుల్ సెక్యూరిటీ ఉంద‌ని.. అప‌రిచితులు ఎవ‌రూ వెంట‌నే పేటీఎంను మిస్ యూజ్ చేసే అవ‌కాశాలు త‌క్కువ‌ని అదే వాట్స‌ప్ పేమెంట్స్‌లో ఈ అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని ఆ సంస్థ తెలిపింది. ఎన్‌పీసీఐతోనే ఇక్క‌డ ఇబ్బంది త‌లెత్తుంద‌ని చెప్పింది. మిగిలిన యాప్‌ల‌ను పెట్టిన‌ట్లుగా వాట్స‌ప్‌కు ఎన్‌పీసీఐ నిబంధ‌న‌లు పెట్ట‌ట్లేద‌ని దీని వ‌ల్ల మ‌నం ఒక‌సారి లాగిన్ అయిన త‌ర్వాత దాన్ని లాగౌట్ చేయ‌క‌పోతే ఇబ్బందుల్లో ప‌డ‌తామ‌ని తెలిపింది. అంటే ఒక‌సారి అకౌంట్లోకి లాగిన్ అయిన త‌ర్వాత ఒక‌వేళ లాగౌట్ చేయ‌డం మ‌ర్చిపోతే మిస్ యూజ్ కాకుండా ఆటోమెటిక్ లాగౌట్ ఉండాలి. పేటీఎంలో ఇలాంటి ఫీచ‌రే ఉంది. ఎన్‌పీసీఐ నిబంధ‌నల్లో ఇదొక‌టి. కానీ వాట్స‌ప్ పేమెంట్స్‌కు ఇది వ‌ర్తించ‌ట్లేదు. లాగిన్ అయిన త‌ర్వాత కూడా ఆ అకౌంట్ అలాగే కొన‌సాగే అవ‌కాశాలున్నాయి.

స‌ర్టిఫికేష‌న్‌, ఆడిట్‌
నిజానికి ప్ర‌తి పేమెంట్ యాప్‌కు ఎన్‌పీసీఐ అనుమ‌తి ఉండాలి. స‌ర్టిఫై చేయాలి. ప్ర‌తి యాప్‌కు నాలుగు నుంచి ఆరు వారాల ఆడిట్ ప్రాసెస్ జ‌ర‌గాలి.ఆ త‌ర్వాతగాని స‌ర్టిఫికేష‌న్ ఉండదు. కానీ వాట్స‌ప్ పేమెంట్స్ యాప్‌కు ఇలాంటి నిబంధ‌న‌లేవీ వ‌ర్తించ‌ట్లేదు. పేటీఎం యూజర్.. వాట్స‌ప్ యూజ‌ర్‌కు డ‌బ్బులు పంపే అవ‌కాశ‌మే లేదు. ఈ విష‌యంపై దృష్టి పెట్టాల‌ని పేటీఎం కోరుతోంది. ఎందుకంటే వాట్స‌ప్ ఇంటిగ్రేష‌న్‌, దాని సెక్యూరిటీ వేరు. ఇక్క‌డే పేటీఎంకు దెబ్బ త‌గ‌లుతుంది. ఆ సంస్థ భ‌య‌మ‌ల్లా త‌మ వ్యాపారానికి ఎక్క‌డ వాట్స‌ప్ దెబ్బ కొడుతుందా అని అనిపిస్తుంది. 

జన రంజకమైన వార్తలు