• తాజా వార్తలు

ఇక గూగుల్ పేతోనూ ఫాస్టాగ్ తీసుకోవ‌చ్చు.. ఎలాగో చెప్పే గైడ్ మీకోసం

జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి మీ వాహ‌నానికి ఫాస్టాగ్ లేకుండా హైవే  ఎక్కితే టోల్‌గేట్లో డ‌బుల్ అమౌంట్ క‌ట్టాలి. అందుకే ఈ రెండు మూడు రోజుల్లో ఫాస్టాగ్ తీసేసుకోవ‌డం బెట‌ర్‌. మామూలుగా ఫాస్ట్‌టాగ్ తీసుకోవ‌డానికి ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్లతో టై అప్ ఉంది. అయితే గూగుల్ పే ద్వారా ఫాస్టాగ్ తీసుకోవ‌డానికి లేదు. కావాలంటే త‌ర్వాత గూగుల్ పేతో రీఛార్జి చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఫాస్టాట్ తీసుకోవ‌డానికి కూడా గూగుల్ పే వాడుకోవ‌చ్చు. 


గూగుల్ పే ద్వారా ఫాస్టాగ్ కొనుక్కోవ‌డం ఎలా? 
* మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. 
* బిజినెస్ సెక్ష‌న్‌లో ICICI Bank FASTagను క్లిక్ చేయండి. 
 *  Buy new FASTag ఆప్ష‌న్‌ను టాప్ చేయండి.
* ఇప్పుడు మీ పాన్ కార్డ్ వివ‌రాలు, వెహిక‌ల్ రిజిస్ట్రేష‌న్ కాపీ, వాహ‌నం నంబ‌ర్‌, అడ్ర‌స్ లాంటి వివ‌రాల‌న్నీ ఎంట‌ర్ చేయాలి. 
* మీ మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి వెరిఫై చేసుకోండి.  
*  పొసీడ్ పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ సెక్ష‌న్‌కు వెళ్లండి.  
* పేమెంట్ పూర్తి చేయ‌గానే మీ ఫాస్టాగ్ ఆర్డ‌ర్ పూర్త‌వుతుంది. అది మీ అడ్ర‌స్‌కు డెలివ‌రీ అవుతుంది. అంతే దాన్ని కారుకు అంటించుకోండి. టోల్ గేట్ ద‌గ్గ‌ర ఆగ‌కుండా ర‌య్యిన దూసుకుపోండి.

జన రంజకమైన వార్తలు