• తాజా వార్తలు
  •  

మ‌న వైఫై ఎందుకు స్లో అవుతుంది?..దాన్ని స‌రిదిద్ద‌డం ఎలా?

ఈ సాంకేతిక యుగంలో దాదాపు ప్ర‌తి ఇంట్లో వైఫై ఉంటుంది. మ‌న  చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా..క‌చ్చితంగా వైఫై ఉండాల్సిందే. అయితే  ఎంతో ఉప‌యోగ‌ప‌డే వైఫై.. ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతుంది. వేగం త‌గ్గిపోయి.. మ‌ధ్య లో  ఆగిపోతూ  చాలా విసిగిస్తుంది. అయితే  దీనికి కార‌ణాలు అన్వేషించ‌కుండా వెధ‌వ వైఫై అని తిట్టుకుంటూ ఉంటాం. మ‌రి మన వైఫై స్లో కావ‌డానికి కార‌ణాలు ఏమిటి?.. వాటిని  ఎలా ప‌రిష్క‌రించుకోవాలో చూద్దామా..

రోట‌ర్‌ను ఉంచే  స్థానం
మ‌న ఇంట్లో వైఫై రోట‌ర్‌ను ఉంచే స్థాన‌మే ఇంట‌ర్నెట్  స్లో, స్పీడ్‌కు రీజ‌న్ అవుతుంది. అందుకే స‌రైన స్థ‌లంలో  రోట‌ర్‌ను ఉంచ‌డం కీల‌కం. ఎక్కువ‌మంది  ఇంట్లో ఏమూలో రోట‌ర్‌ను ఫిక్స్ చేస్తారు. కానీ అలా కాకుండా ఇంటికి వీలైనంత మ‌ధ్య‌లో రోట‌ర్ పెడితే  అన్ని రూమ్స్‌కు వైఫై త‌రంగాలు వెళ‌తాయి. షెల్ఫ్‌లోనూ లేదా కిటికీలోనూ పెట్ట‌కుండా నేల  మీద  ఉంచితే   బెట‌ర్‌.  

కాంక్రీట్‌, మెట‌ల్‌కు దూరంగా.. 
కాంక్రీట్‌, మెట‌ల్ అబ్జెక్టుల వ‌ల్ల  వైఫై సిగ్న‌ల్స్‌కు  అడ్డు త‌గిలే అవ‌కాశాలు ఉంటాయి. అందుకే వీలైంతగా ఈ రెండు మెట‌ల్స్‌ను వైఫైకి అడ్డుప‌డ‌కుండా చూసుకోవాలి. అంటే రోట‌ర్ వైర్ల‌కు ఈ మెట‌ల్స్‌ను దూరంగా ఉంచాలి.   కాంక్రీట్ ఎక్కువ‌గా ఉండే బేస్మెంట్ ఏరియాలో రోట‌ర్‌ను ఉంచ‌కుండా చూసుకోవాలి. 

రోట‌ర్‌కు మ‌ధ్య దూరం
రోట‌ర్‌కు గదులకు మ‌ధ్య దూరం వైఫై మీద  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎక్క‌డో హాల్‌లో ఒక మూల  రోట‌ర్ ఉంచితే అది ఇంటి మొత్తానికి స‌రిగా సిగ్న‌ల్స్ పంపించక‌పోవ‌చ్చు.  అందుకే మీ డివైజ్‌ల‌కు దగ్గ‌ర్లో ఉండేలా రోట‌ర్ ఫిక్స్ చేసుకోవాలి.  వైఫై  360 కోణంలో  త‌రంగాలు పంపేలా  జాగ్ర‌త్త వహించాలి.   

  మైక్రో వేవ్ ఒవెన్స్

  మైక్రో వేవ్ ఒవెన్స్ కూడా మ‌న వైఫైకి అడ్డు త‌గులుతాయని ఊహించ‌గ‌ల‌మా? .. కానీ ఇది నిజం.  మైక్రో వేవ్ ఓవెన్స్  విడుద‌ల చేసే  త‌రంగాలు  వైఫై నెట్‌వ‌ర్క్‌కు అడ్డుప‌డ‌తాయి.  తాజా  రోట‌ర్స్‌కు ఇబ్బంది లేదు కానీ పాత రోట‌ర్స్ వాడేవాళ్ల‌కు ఈ ఇబ్బంది తెలుస్తుంది. దీనికి కారణం మైక్రో వేవ్  ఓవెన్స్‌ను 2.45   గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీతో  ఆప‌రేట్ చేస్తారు.  ఇదే ఒక్కోసారి వైఫై త‌రంగాల‌ను అడ్డుకుంటుంది.  బ్లూటూత్ తోనూఇదే ఇబ్బంది ఎదురు అవుతుంది. దీని ఫ్రీకెన్సీ వైఫై త‌రంగాల‌ను డామినేట్ చేసే  అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే రోట‌ర్‌కు ద‌గ్గ‌ర్లో  ఈ  డివైజ్‌ల వాడ‌కాన్ని నిరోధించాలి.  ఎలక్ర్టో మ్యాగ్న‌టిక్ ఫీల్డ్ సాయంతో ప‌నిచేసే క్రిస్ట‌మ‌స్ లైట్లు కూడా వైఫై త‌రంగాల‌ను అడ్డుకునే అవ‌కాశాలు ఉన్నాయి.                                                             

జన రంజకమైన వార్తలు