• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో ఓట‌ర్ కార్డ్ అప్లై చేయ‌డం ఎలా? 

ఎల‌క్ష‌న్లు ద‌గ్గ‌ర‌కొచ్చేస్తున్నాయి. ఇండియాలో ఓటేయాలంటే ఓట‌ర్ కార్డ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఇప్ప‌టికీ మీకు ఓట‌ర్ కార్డ్ లేక‌పోతే దాన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్ల‌యి చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఓట‌ర్‌ కార్డ్ అప్ల‌యి చేయ‌డం ఎలా?   దానికి ఏం కావాలో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకోండి.
రెండు ప్రూఫ్స్ ఉండాలి..
ఓట‌ర్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్ల‌యి చేయ‌డానికి వ‌య‌సు నిర్ధారించే (ఏజ్ ప్రూఫ్‌) సర్టిఫికెట్‌, నివాస ధృవ‌ప‌త్రం (రెసిడెన్స్ స‌ర్టిఫికెట్‌) త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.
ఏజ్‌ప్రూఫ్ స‌ర్టిఫికెట్‌గా ప‌నికొచ్చేవి
* పంచాయ‌తీ/  మున్సిపాల్టీ/  కార్పొరేష‌న్ /  రిజిస్ట్రార్ ఆఫ్ బ‌ర్త్స్ అండ్ డెత్స్ ఇష్యూ చేసిన బ‌ర్త్ స‌ర్టిఫికెట్ 
* స్కూల్స్ లేదా ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ ఇష్యూ చేసిన బ‌ర్త్ స‌ర్టిఫికెట్ 
* 10వ త‌ర‌గ‌తి పాస‌యి ఉంటే ఆ మార్క్‌ల లిస్ట్‌, లేదంటే 5, 8వ త‌ర‌గ‌తులు పాస‌యినా ఆ మార్క్‌ల లిస్ట్‌
* పాస్‌పోర్ట్ * డ్రైవింగ్ లైసెన్స్ * ఆధార్ కార్డ్.. వీట‌లో ఏదో ఒకటి మీరు మీ ఏజ్ ప్రూఫ్‌గా చూపించ‌వ‌చ్చు.
రెసిడెన్స్ ప్రూఫ్ స‌ర్టిఫికెట్‌
మీ ఇంటి అడ్ర‌స్‌తో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్‌/  కిసాన్ పాస్‌బుక్ /  పోస్ట్ ఆఫీస్ క‌రెంట్ పాస్‌బుక్ 
* రేష‌న్ కార్డ్ * పాస్‌పోర్ట్ * డ్రైవింగ్ లైసెన్స్ * ఇన్‌కంట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్ * లేటెస్ట్ రెంట్ అగ్రిమెంట్‌
* మీ పేరు లేదా మీ త‌ల్లిదండ్రుల పేరుమీద ఉన్న లేటెస్ట్ వాట‌ర్ /  ఫోన్‌/  ఎలక్ట్రిసిట/ గ‌్యాస్ బిల్లు
* ఇండియ‌న్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి మీకు ఆ అడ్ర‌స్‌కు వ‌చ్చిన ఏదైనా లెట‌ర్ లేదా పోస్ట్ జెరాక్స్‌.. వీటిలో ఏదో ఒక‌టి అడ్ర‌స్ ప్రూఫ్‌గా చూపించ‌వ‌చ్చు. వీటితోపాటు ఓ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. 
ఓట‌ర్ ఐడీ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో అప్ల‌యి చేయ‌డం
* National Voter Services Portal లోకి వెళ్లి Apply online for registration of new voter / due to shifting from ACని క్లిక్ చేయండి. లేదా NVSP Form 6 pageలోకి డైరెక్ట్‌గా వెళ్లండి.
*డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి.
* పేరు, వ‌య‌సు, అడ్ర‌స్, ఫోన్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ వంటి వివ‌రాల‌న్నీ నింపండి
* పైన చెప్పిన డాక్యుమెంట్ల‌లో నుంచి ఏజ్‌ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్‌ల‌కు ఒక్కోటి చొప్పున స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
* మీ ఫొటో కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
* ఇప్పుడు మీ డిటెయిల్స‌న్నీ మ‌రోసారి చెక్ చేసుకుని పేజీ చివ‌రిలో ఉన్న‌Submit బ‌ట‌న్ నొక్కండి.
* ఇప్ప‌డు మీ మెయిల్ ఐడీకి అప్లికేష‌న్ రిసీవ్ చేసుకున్న‌ట్లు మెయిల్ వ‌స్తుంది. దానిలో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే మీ అప్లికేష‌న్ స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు.
* సాధార‌ణంగా నెల రోజుల్లో మీ అప్లికేష‌న్ ప్రాసెస్ అవుతుంది. మీ డాక్యుమెంట్స్, డిటెయిల్స్ క‌రెక్ట్‌గా ఉంటే మీ వోట‌ర్ కార్డ్ ఇష్యూ అవుతుంది. మీ అడ్ర‌స్‌కు కార్డ్ పోస్ట్‌లో వ‌స్తుంది. లేదంటే ఏదైనా నెట్ సెంట‌ర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఎవరైనా అప్ల‌యి చేసుకోవ‌చ్చా?
*  ఈ ఏడాది జ‌న‌వ‌రి 1నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండిన భార‌తీయ పౌరులంద‌రూ ఓట‌ర్ కార్డ్ కోసం అప్ల‌యి చేసుకోవ‌చ్చు. కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌వారు, ఖైదీలు, మ‌రికొన్ని ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఓటేయ‌కుండా నిషేధం విధించ‌బ‌డిన‌వారు మాత్రం దీనికి అన‌ర్హులు.
* ఎన్నారైలు,  ఇత‌ర దేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయ పౌరులు అయితే NVSP websiteలోకి వెళ్లి Form 6Aను ఫిల్ చేయాలి.

జన రంజకమైన వార్తలు