• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఓరియో.. అర్జెంటుగా కావాలా? అయితే ఇలా చేయండి

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రిలీజ‌యింది. అయితే ఇది అన్ని ఫోన్ల‌కూ అప్పుడే రావ‌డం క‌ష్టం. గూగుల్ సొంత ఫోన్లు పిక్సెల్‌, నెక్సస్ మోడ‌ల్ ఫోన్ల‌కు రావాల‌న్నా కూడా చాలా టైమే ప‌ట్టేలా క‌నిపిస్తుంది. అయితే మీ ద‌గ్గ‌ర పిక్సెల్‌, నెక్స‌స్ ఫోన్లు ఉంటే ఆండ్రాయిడ్ ఓ.. ఓఎస్‌ను వెంట‌నే పొందే మార్గ‌ముంది. అదేంటో చూడండి.. 

ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ 
ఆండ్రాయిడ్ బీటా పేజ్ ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాలి.  వెంట‌నే మీకో వెబ్‌పేజీ  ఓపెన్ అవుతుంది. బీటా ప్రోగ్రాం ఏమిటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. 
*    Enroll deviceని క్లిక్ చేస్తే  లిస్ట్ వ‌స్తుంది. దానిలో చూసి  మీ డివైస్ ఎలిజ‌బులా కాదా అన్న‌ది చూసుకోవ‌చ్చు.  
* దీనిలో రిజిస్ట‌ర్ చేసుకుంటే  మీ ఫోన్‌కు over-the-air update notification వ‌స్తుంది. ఇదే మీకు ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది.  
* ఆండ్రాయిడ్ ఓరియో బ‌దులు ఆండ్రాయిడ్ ఓ అని  నోటిఫికేష‌న్ వ‌స్తే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోకండి.  ఎందుకంటే అది ఓరియో ఫైన‌ల్ వెర్ష‌న్ కాదు. 
* మీకు నోటిఫికేష‌న్ రాక‌పోతే అన్ ఎన్‌రోల్ చేసి రీ ఎన్‌రోల్ చేసుకోవ‌చ్చు. 
* అయితే బేటా వెర్ష‌న్‌లో కొన్ని బ‌గ్స్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది కాబ‌ట్టి స్టేబుల్ వెర్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డ‌మే బెట‌ర‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు.  

ఏ ఫోన్ల‌కు ప‌ని చేస్తుంది? 
Pixel
Pixel XL
Pixel C
Nexus 6P
Nexus 5X
Nexus Player
 

జన రంజకమైన వార్తలు