• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ నుంచి టెక్ట్ మెసేజ్‌ల‌ను ప్రింట్ తీసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ డివైజ్‌లో మ‌నం వంద‌ల వేల మెసేజ్‌ల‌ను పంపుతూనే ఉంటాం. లేక‌పోతే మ‌న‌కు వంద‌ల్లో మెసేజ్‌లు రోజూ వ‌స్తూనే ఉంటాయి. వాటిలో కీలక‌మైన‌వి.. అత్యంత విలువైన‌వి కూడా ఉంటాయి. అయితే ఇన్ని వేల మెసేజ్‌ల‌లో మ‌నం కొన్ని విలువైన మెసేజ్‌ల‌ను కూడా కోల్పోతాం. మ‌నం ఫోన్ అమ్మేసేట‌ప్పుడో లేక ఎవ‌రికైనా ఇచ్చేట‌ప్పుడో సింపుల్‌గా ఫ్యాక్ట‌రీ రిసెట్ బ‌ట‌న్ నొక్కేస్తాం. దీని వ‌ల్ల ముఖ్య‌మైన మెసేజ్‌లు కూడా పోతాయి. మ‌రి మ‌న మెసేజ్‌లను కాపాడుకోవాలంటే ఎలా? మ‌న ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మెసేజ్‌ల‌ను ప్రింట్ రూపంలో తీసుకుని దాచుకోవ‌చ్చు. అదెలా చూద్దాం..

ఏం కావాలంటే...
మ‌న ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మెసేజ్‌ల‌ను ప్రింట్‌గా తీసుకోవ‌డానికి మ‌నం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేదు. ఇందుకోసం ఒక పీసీ, ఒక డేటా కేబుల్ ఉంటే చాలు. వీటికి తోడు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది. ఒక్కోసారి మ‌నం అక‌స్మాత్తుగా మ‌న ఆండ్రాయిడ్ ఫోన్లో డేటాను బ్యాక్ అప్ తీసుకోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఈ కిటుకు మీకు బాగా ప‌నికొస్తుంది. మీకు కావాల్సిన ఎస్ఎంఎస్‌ల‌తో పాటు ఇత‌ర డేటాను కూడా మీరు సుల‌భంగా బ్యాక్ అప్ చేసుకుని ప్రింట్ ఔట్ తీసుకోవ‌చ్చు.

ఎలా చేయాలంటే...
1.ముందుగా ఇపుబ్‌సాఫ్ట్ ఆండ్రాయిడ‌వ్ మేనేజ‌ర్ యాప్‌ను మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ఉచితం కాదు. కాక‌పోతే మీరు ట్ర‌య‌ల్ వెర్ష‌న్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు

2. డేటా కేబుల్ ద్వారా మీ పీసీకి ఆండ్రాయిడ్ ఫోన్‌ను క‌నెక్ట్  చేయాలి

3. మీ పీసీలో ఆండ్రాయిడ్ మేనేజ‌ర్ యాప్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

4. మీరు మీ యూఎస్‌బీ డీబ‌గ్గింగ్‌ను అనేబుల్ చేయ‌క‌పోతే డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి అనేబుల్ చేయాలి

5. ఈ యాప్‌లో మీ ఆండ్రాయిడ్ మెసేజ్‌ల ప్రివ్యూ మీరు చూడొచ్చు

6. స్టార్ట్ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయాలి. అంతే మీ మెసేజ్‌లు పీసీలోకి సేవ్ అయిపోతాయి

7. ఆ త‌ర్వాత మీరు ఆ మెసేజ్‌ల‌ను సుల‌భంగా ప్రింట్ ఔట్ తీసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు