• తాజా వార్తలు

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎవ‌రెవరు చూశారో తెలుసుకోవాలంటే ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఫేస్‌బుక్‌.. అంద‌రికి బాగా ద‌గ్గ‌రైపోయిన సామాజిక మాధ్య‌మం. ఉద‌యం లేస్తే మ‌న ముఖం చూసుకుంటామో లేదో తెలియ‌దు కానీ ఫేస్‌బుక్ మాత్రం త‌ప్ప‌కుండా చూసుకుంటాం. మ‌న‌కు ఎఫ్‌బీలో పెట్టిన ఫొటో్ల‌కో లేదా పోస్ట్‌ల‌కు ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది? ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేశారు. లైక్‌లు ఎన్ని?..షేర్లు ఎన్ని? ఇవ‌న్నీ తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ స‌ర‌దానే. కానీ చాలా  కొద్దిమంది మాత్ర‌మే ఎఫ్‌బీని స‌రిగా స‌ద్వినియోగం చేసుకుంటారు. కానీ కొంత‌మందికి ఒక అనుమానం ఉంటుంది. మ‌న ప్రొఫైల్‌ను ఎవ‌రు ఎవ‌రు చూస్తున్నారా అని! కానీ ఎఫ్‌బీలో మ‌న‌కు అలా తెలుసుకునే అవ‌కాశం లేదు. అయితే ప్రొఫైల్ ఎవ‌రు చూశారో తెలుసుకునే అవ‌కాశం ఉందా అదెలాగంటారా?

బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ ద్వారా..
ఫేస్‌బుక్ ఫ్రొఫైల్ వ్యూస్‌ను తెలుసుకోవ‌డం బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్స‌న్ ద్వారా సాధ్య‌మే. కానీ ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. హ్యాక‌ర్లు  మ‌న‌కు తెలియ‌కుండానే ఇన్ఫ‌ర్మేష‌న్ రాబ‌ట్టి మ‌న‌ల్ని డ‌బ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. చాలామందికి త‌మ ప్రొఫైల్ విజిట్స్ తెలుసుకోవాల‌ని..ఎవ‌రు మ‌న ప్రొఫైల్ చూశారో వివ‌రాలు రాబ‌ట్టాల‌నే కుతూహలం ఉంటుంది. కానీ మ‌నం ఈ  ధ్యాస‌లో ప‌డి మ‌న‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీఇచ్చేస్తాం.  దాదాపు 3 వేల రివ్యూలు ఉన్న సైట్ల‌ను  కూడా న‌మ్మ‌లేం. ఎందుకంటే వీటిలోనూ ఫేక్ ఉంటాయి. కానీ వీటిలో అస‌లైన రివ్యూలను ప‌రిశీలిస్తే విష‌యం అర్థ‌మ‌వుతుంది. 

డౌన్‌లోడ్ చేస్తే తీసేయండి..
ఇప్ప‌టికే ఫేస్‌బుక్ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ డౌన్‌లోడ్ చేస్తే వెంట‌నే దాన్ని డిలీట్  చేయ‌డం మంచిది. లేక‌పోతే హ్యాక‌ర్ల‌కు ఇదో అడ్డాగా మారిపోయే ప్ర‌మాదం ఉంది. బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌తో పాటు యాప్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే. అందుకే దీన్ని డౌన్‌లోడ్ చేసినా వెంట‌నే అన్ ఇన్‌స్టాల్ చేయాలి. మీకు ఏదైనా హెల్ప్ అవ‌స‌రం అయితే రిమూవింగ్ థ‌ర్డ్ పార్టీ  యాప్స్‌, ఎక్స్‌టెన్ష‌న్స్ గైడ్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఈ గైడ్ ద్వారా ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఈ ఎక్స్‌టెన్ష‌న్‌, యాప్‌ల‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు. అలా కాద‌ని ముందుకెళితే మీ డేటాకే ప్ర‌మాదం. ఇన్షియ‌ల్ చాట్ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది కూడా ఫేక్‌నే. దీనిలో ప‌డినా కూడా మోసానికి గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.                     

జన రంజకమైన వార్తలు