• తాజా వార్తలు
  •  

ట్రూకాలర్ యాప్ ఫోన్‌లను స్లో చేయడాన్ని కంట్రోల్ చేయడం ఎలా..?

స్మార్ట్‌ఫోన్ యూజర్లు అమితంగా ఇష్టపడుతోన్న యాప్‌లలో ‘ట్రూ కాలర్’ యాప్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు.  ఇటీవల ఈ యాప్‌లో ఫ్లాష్ మెసేజింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి సరికొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి. కొత్త ఫీచర్లతో మరింత బల్కీగా తయారైన ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల పనితీరును మందగించేలా చేస్తున్నట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.  మీరు కూడా ఇటువంటి సమస్యనే ఫేస్ చేస్తున్నట్లయితే, ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవటం ద్వారా  ట్రూకాలర్ యాప్ మీ ఫోన్‌లను స్లో చేయడాన్ని కంట్రోల్ చేయవచ్చు.
 ఫ్లాష్ మెసేజింగ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి
 ఫ్లాష్ మెసేజింగ్ ఫీచర్ ద్వారా ట్రూకాలర్ కాంటాక్ట్‌లకు క్విక్ మెసేజ్‌లను సెండ్ చేసుకునే వీలు ఉన్నప్పటికి పనితీరు నెమ్మదించటానికి ఇది కూడా ఓ కారణమవుతోంది. కాబట్టి ఈ ఫ్లాష్ మెసేజింగ్ ఫీచర్‌ను సాధ్యమైనంత వరకు టర్నాఫ్ చేసి ఉంచటం మంచిది. ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేయడానికి ట్రూకాలర్ యాప్‌లోని ‘మోర్’ టాబ్‌లోకి వెళ్లి జనరల్ మెనూను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. జనరల్ మెనూలో కనిపించే ఫ్లాష్ మెసేజింగ్ ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుకోవటం ద్వారా ఈ ఫీచర్ వర్క్ అవటం మానేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఫ్లాష్ మెసేజింగ్ ఫీచర్‌ను టర్నాఫ్ చేసుకోవ‌చ్చు.
లాస్ట్ సీన్ స్టేటస్ అప్‌డేట్స్‌తో తలనొప్పే
మనం కాల్ చేసిన వ్యక్తి  అందుబాటులో ఉన్నారా?,  ఏదైనా కాల్‌లో మాట్లాడుతున్నారా? లేకపోతే రింగర్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచి ఏదైనా పనిలో ఉన్నారా? వంటి లాస్ట్ సీన్  స్టేటస్ అప్‌డేట్‌లను ట్రూకాలర్ అందిస్తోంది. ఈ ఫీచర్ నిరంతరంగా కాంటాక్ట్స్ స్టేటస్‌లను చెక్ చేస్తుండటంతో ఫోన్ పై ఆ ఒత్తిడి పడుతోంది.  ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా  ‘Availability’ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.
విసుగుపుట్టించే నోటిఫికేషన్స్
గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినపుడు ట్రూకాలర్ యాప్ ఓ పాపప్‌‌ను డిస్‌ప్లే చేయటాన్ని ప్రతిసారి మనం చూస్తుంటాం. కాల్ ముగిసిన తరువాత కూడా నోటిఫికేషన్స్  పోన్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అవుతుంటాయి. ఈ ఫ్లోటింగ్ అలర్ట్ ఫీచర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలో  స్టోరేజ్ కొరతకు దారి తీస్తోంది. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ నోటిఫికేషన్ అలర్ట్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.
రిమైండ్ మీ ఆఫ్ మిస్డ్‌ కాల్స్
 ట్రూకాలర్లో ‘రిమైండ్ మీ ఆఫ్ మిస్డ్  కాల్స్’ ఫీచర్ మీ ఫోన్‌కు వచ్చిన మిస్డ్‌ కాల్స్‌కు సంబంధించి గంటగంటకు నోటిఫికేషన్స్ ఇస్తూ విసుగు పుట్టిస్తుంటుంది.  ఈ ప్రభావం ఫోన్ మెమురీ పై పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి నోటిఫికేషన్స్ వద్ద‌నుకుంటే ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోని జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి డిసేబుల్ చేసుకోవ‌చ్చు.
ఆటో సెర్చ్‌తో ఫోన్ పై ఒత్తిడి
 మీ కాంటాక్ట్ లిస్టులో లేని సభ్యుల నెంబర్ లేదా మెసేజ్‌ను మీరు కాపీ చేసుకున్నప్పుడు ఆటోమెటిక్‌గా ట్రూకాలర్ ఆటో సెర్చ్ ఆన్ అయిపోతుంది. ఈ ఫీచర్ రెండు ఎక్స్‌ట్రా బ్యాక్‌గ్రౌండ్ ట్రూకాలర్ యాక్టివిటీలను ఫోన్‌లో రన్ చేయటంతో పెర్ఫామెన్స్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతోంది. యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోని జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి ఆటో సెర్చ్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.

 ట్రూకాలర్ యాప్ వినియోగంలో ఇటువంటి జాగ్రత్తలను పాటించటం వల్ల ఫోన్ పై నియంత్రణ అనేది పూర్తిగా మీ చెప్పుచేతుల్లో ఉంటుంది. ఇదే సమయంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా మీకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే వీలుంటుంది.

జన రంజకమైన వార్తలు