• తాజా వార్తలు

పేటీఎం ఫ‌ర్ బిజినెస్ లాంఛ్ అయింది.. ఉపయోగించుకోవ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

పేటీఎం.. ఈ యాప్ మ‌న దేశంలో ఎంత‌గా విస్త‌రించిందంటే ప‌ల్లెటూళ్ల‌లోకి కూడా చాలా వేగంగా చొచ్చుకుపోయింది.  ముఖ్యంగా డీమానిటైజేష‌న్ త‌ర్వాత పేటీఎం చాలా వేగంగా అంద‌రిలోకి వెళ్లిపోయింది. ఆన్‌లైన్ పేమెంట్ చేయడాన్ని చాలా సుల‌భం చేసేసింది ఈ యాప్‌. అయితే ఈ యాప్ రాను రాను ఇంకా ఇంకా వినియోగ‌దారుల్లో ఆస‌క్తిని రేపుతోంది. దీనికి కార‌ణం ఈ యాప్ కొత్త‌గా ప్ర‌వేపెట్టిన పేటీఎం ఫ‌ర్ బిజినెస్ వ‌ల్లే. ఇటీవ‌లే భార‌త్‌లో లాంఛ్ అయిన ఈ కొత్త యాప్ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని వాడ‌డం ఎలాగో తెలుసుకుందామా?

ఎలా సైన్ అప్ కావాలి?
పేటీఎం ఫ‌ర్ బిజినెస్ యాప్‌లోకి సైన్ అప్ కావ‌డం చాలా సుల‌భం.  ఇప్ప‌టికే పేటీఎం అకౌంట్ ఉన్న వాళ్ల‌కు ఇది మ‌రీ తేలిక‌.  మీ అకౌంట్లోకి లాగిన్ అయిన త‌ర్వాత పాన్ నంబ‌ర్‌, ఆధార్ కార్డు వివ‌రాలు ఇవ్వాలి. ఈ రెండు వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆ త‌ర్వాత మీ బిజినెస్ వివ‌రాలను ఈ యాప్ అడుగుతుంది. దీనిలో జీఎస్‌టీ నంబ‌ర్ కూడా ఉంటుంది. ఆ త‌ర్వాత మీ బ్యాంకు వివ‌రాలు ఇవ్వ‌డంతో ప్రొసెస్ ముగుస్తుంది. మ‌నీ రిసీవ్ చేసుకోవ‌డానికి నెల‌వారీ  లిమిట్ రూ.50 వేలుగా నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత రిక్వెస్ట్ మీద లిమిట్ పెంచుకోవ‌చ్చు.

ట్రాక్‌, యాక్సెప్ట్ పేమెంట్స్‌
పేటీఎం ఫ‌ర్ బిజినెస్ ద్వారా రిజిస్టర్డ్ మ‌ర్చెంట్స్ త‌మ అన్ని సెటిల్‌మెంట్స్ ట్రాక్ చేసుకోవ‌చ్చు. త‌మ‌కు రావాల్సిన డ‌బ్బులు, చెల్లించాల్సిన డ‌బ్బులు,.అప్పులు.. ఆస్తులు ఇలా అన్నివివ‌రాలు ఇందులో ఉంటాయి. డైలీ, వీక్లీ, మంత్లీ బేసిస్‌న వివ‌రాలు కూడా దీనిలో పొందుప‌రిచి ఉంటాయి. దీని వ‌ల్ల మీకు ఏ డ‌బ్బులు ఎలా వెళ్తున్నాయి ఎక్క‌డికి వెళ్తున్నాయ‌నే వివ‌రాలు క్లీయ‌ర్‌గా తెలుస్తాయి. ఏమైనా అనుమానాలు వ‌స్తే తీర్చ‌డానికి 24 గంట‌లు ప‌ని చేసే హెల్ప్ డెస్క్ కూడా అందుబాటులో ఉంటుంది.

క్యూఆర్ కోడ్స్‌, ఇర‌త ఫీచ‌ర్లు
పేటీఎం ఫ‌ర్ బిజినెస్ ప‌ది రీజ‌న‌ల్ భాష‌ల్లో ల‌భిస్తుంది. డిజిట‌ల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయ‌డానికి మ‌ర్చెంట్స్ సైన్ అప్ చేసి క్యూఆర్ కోడ్ ఆప్ష‌న్‌ను వాడుకోవ‌చ్చు. రోజువారీ పేమెంట్స్ కోసం కూడా ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ యాక్సెప్ట్ చేసినందుకు మార్చెంట్స్‌కు వారికి సంబంధించిన బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వేయ‌వు. దీంతో పాటే వాట్స‌ప్‌, హైక్ ప్లాట్‌ఫామ్స్ మాదిరిగానే పేటీఎం ఇన్‌బాక్స్ అనే ఆప్ష‌న్‌ను ఇటీవ‌లే అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థ‌.

జన రంజకమైన వార్తలు