• తాజా వార్తలు

ఒకే నెట్‌వ‌ర్క్‌తో ఏ డివైజ్‌తోనైనా ఫైల్స్ షేర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఒకే నెట్‌వ‌ర్క్‌తో ఏ డివైజ్‌తోనైనా ఫైల్స్ షేర్ చేయాలంటే ఎలా? ..దీనికి ఒక ఆప్ష‌న్ ఉంది. అదే డ్రాగ్ అండ్ డ్రాప్‌. ఈ స‌ర్వీసును ప్లోవ‌ర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని సాయంతో పీసీ నుంచి పీసీకి.. ఆండ్రాయిడ్ నుంచి పీసీకి, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు.. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు ఫైల్స్‌ను సులభంగా షేర్ చేసుకోవ‌చ్చు.  అయితే చేయాల్సింద‌ల్లా ఏమింటంటే ఒకే వైఫై లేదా నెట్‌వ‌ర్క్‌తో డివైజ్‌ను క‌నెక్ట్ చేసి ఉంచ‌డం కీల‌కం. అయితే ఈ స‌ర్వీసు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో చూద్దామా..

ఎలాంటి సైన్ అప్ లేకుండా..
ఫైల్ షేరింగ్ సర్వీసులో అన్నిటికంటే కీల‌మైంది ఏంటంటే దీనికి ఎలాంటి సైన్ అప్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. లింక్ జ‌న‌రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. సింపుల్‌గా దీని హోమ్ పేజీ ఓపెన్ చేస్తే మీకు క‌నెక్ట్ అయి ఉండే డివైజ్‌ల‌న్నీ క‌నిపిస్తాయి. షేర్ ఫైల్స్ కూడా మీకు విజుబుల్‌గా క‌నిపిస్తాయి. ఇవి డివైజ్ పేరు చూపించ‌కుండా ఏదైనా జంతువు పేరుతో సేవ్ అయి ఉంటాయి. యునిక్ ఐడింటిఫికేష‌న్ కోసం ఇవి ఇలా సేవ్ చేయ‌బ‌డి ఉంటాయి. మీరు ఎక్క‌డికి ఫైల్స్ పంపాల‌నుకున్నా.. ఆ పేరును ఎంపిక చేసుకుని ఆ ఫైల్స్‌ను డ్రాగ్ చేసి మీకు కావాల్సిన లొకేష‌న్‌లో డ్రాగ్ చేస్తే చాలు. మీరు అప్‌లోడ్ చేసే ఫైల్స్ ఆ స‌ర్వీర్‌లో టెంప‌ర‌రీగా సేవ్ అయి ఉంటాయి. ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ‌గానే అవి ఆటోమెటిక్‌గా రిమూవ్ అయిపోతాయి.

డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే..
1. గూగుల్ క్రోమ్‌లో హోమ్ పేజీ ఓపెన్ చేయాలి. అందులో చివ‌ర ఒక లింక్ క‌న‌బ‌డుతుంది. అది ఓపెన్ చేయ‌గానే స‌ర్వీస్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

2. ఇత‌ర పీసీ లేదా డివైజ్ ఏదైనా స‌ర్వీసు హోమ్ పేజీని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అన్ని డివైజ్‌లు ఒకే వైఫై నెట్‌వ‌ర్క్‌తో ప‌ని చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మీ బ్రౌజ‌ర్‌లో అందుబాటులో ఉన్న డివైజ్‌ల జాబితాను చూసుకోవ‌చ్చు. ప్ర‌తి డివైజ్‌కు జంతువుల పేరు, వాటి ఐకాన్‌తో సేవ్ చేయ‌బ‌డి ఉంటాయి.

3. మీరు ఏ ఫైల్‌ను పంపాల‌నుకుంటున్నారో ఆ ఫైల్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.  వాటిని డ్రాగ్ చేసి ఏదైనా డివైజ్‌లో డ్రాప్ చేయాలి. ఫైల్ ఏ ఫార్మాట్‌లో ఉన్నా మీరు షేర్ చేసుకోవ‌చ్చు. టీఎక్స్‌టీ, పీఎన్‌జీ, ఆడియో వీడియో, ఇఎక్స్ఈ ఇలా ఎక్స్‌టెన్ష‌న్ ఏదైనా ఫ‌ర్వాలేదు. ఒకేసారి ఫైల్స్ పంపాల‌నుకున్నా సెండ్ టు ఆల్ కొట్టేస్తే చాలు. 

జన రంజకమైన వార్తలు