• తాజా వార్తలు
  •  

మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా ఇండియా

డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాపై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకుంటున్న శ్ర‌ద్ధ ఇండియాలో ప‌రిపాల‌న తీరునే కాదు ఇండ‌స్ట్రియ‌ల్ సెక్టార్‌ను కూడా మారుస్తోంది. ఒక‌ప్పుడు మొబైల్ ఫోన్ కావాలంటే ఎక్క‌డో చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఇండియా మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా మారింది. దేశీయ కంపెనీల నుంచి టెక్నాల‌జీ జెయింట్ యాపిల్ వ‌ర‌కు ఇండియాలో మాన్యుఫాక్య‌రింగ్ యూనిట్లు పెట్ట‌డానికి క్యూ క‌డుతున్నాయి. డిజిటల్ ఇండియా ఇనీషియేష‌న్‌తో సెల్‌ఫోన్ వాడ‌కం ఇండియాలో భారీగా పెరుగుతుండ‌డంతో ఇక్క‌డి మార్కెట్‌ను అందుకోవ‌డానికి లోక‌ల్‌గానే మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్లు పెట్ట‌డానికి కంపెనీలు వ‌స్తున్నాయి.
యాపిల్ కు వెల్‌కం..
యాపిల్‌.. టెక్నాల‌జీ రంగంలో తిరుగులేని బ్రాండ్‌.. ఆ యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను ఇండియాలో మాన్యుఫాక్చ‌రింగ్ చేయ‌డానికి ఇక్క‌డ యూనిట్ నెలకొల్పాల‌ని యాపిల్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిపై రెండు రోజుల్లో యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ త‌న‌ను క‌ల‌వ‌బోతున్న‌ట్లు సెంట్ర‌ల్ ఐటీ మినిస్ట‌ర్ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ చెప్పారు. మిగ‌తా మొబైల్ కంపెనీల‌కు అవ‌కాశ‌మిచ్చిన‌ట్లే ఇండియాలో త‌యారీకి యాపిల్‌కు కూడా స్వాగ‌తం ప‌లుకుతామ‌న్నారు. ఇండియాలో డిజిట‌ల్ రివ‌ల్యూష‌న్‌ను మేం వ‌దులుకోమ‌ని, దానిలో లీడ‌ర్ కావ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఐటీ మినిస్ట‌ర్ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ చెప్పారు. అందుకు అనుగుణంగా వ‌చ్చే కంపెనీల‌ను స్వాగ‌తిస్తామ‌న్నారు.
త‌యారీ ప్రారంభించిన 72 కంపెనీలు
ఇప్ప‌టికే చాలా పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలు ఇండియాలో సెల్‌ఫోన్ మేకింగ్ యూనిట్లు పెట్ట‌డానికి వ‌చ్చాయి. గ‌త రెండేళ్ల‌లో 72 అంత‌ర్జాతీయ మొబైల్ ఫోన్ కంపెనీలు ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించాయి. వీటిలో 40 కంపెనీలు ఇక్క‌డే ఫోన్ మొత్తం త‌యారు చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు బ్యాట‌రీలు, చిప్‌సెట్లు, వంటి కొన్ని పార్ట్‌ల‌ను మాన్యుఫాక్చ‌ర్ చేస్తున్నాయి. ఇండియా చాలా పెద్ద మార్కెట్ అని, ఇక్క‌డే త‌యారు చేస్తే దేశీయ మార్కెట్లో అమ్ముకోవ‌డంతోపాటు ఇత‌ర దేశాల‌కు కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతో కంపెనీలు త‌మ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి.

జన రంజకమైన వార్తలు