• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల కోసం బెస్ట్ వీడియో కాలింగ్ యాప్స్

స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించి వీడియో కాల్ లను చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపొయింది. వీడియో కాల్ ల ను ఫోన్ ద్వారా చేసుకునే కంటే వీడియో కాలింగ్ యాప్ ల ద్వారా చేస్తే అద్భుతమైన క్వాలిటీ తో కూడిన కాలింగ్ ను అనుభవించవచ్చు. అలాంటి వీడియో కాలింగ్ యాప్ లలో అత్యుత్తమ మైన వాటిని ఈ రోజు ఆర్టికల్ లో చదువుకుందాం.
స్కైప్
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ వీడియో కాలింగ్ యాప్ లలో ఇది ప్రముఖమైనది. దీనియొక్క డెస్క్ టాప్ వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆదరణ పొందగా ఆండ్రాయిడ్ యాప్ కూడా ఇన్ స్టంట్ మెసేజింగ్ మరియు వాయిస్ చాట్స్ లాంటి ఫీచర్ లను ఇంటిగ్రేట్ చేసి ఆ దిశగా విజయ సాధించింది. ఈ యాప్ కు ఇప్పటివరకూ 300 మిలియన్ల మంది యూజర్ లు ఉన్నారు. అంటే కుటుంబం లో దాదాపు అందరికీ స్కైప్ ఎకౌంటు ఉన్నట్లే కదా!
oo Voo
ఇది ఫేస్ బుక్ తో సైన్ అప్ ద్వారా పని చేస్తుంది. దీనిద్వారా ఒకేసారి 12 మందితో చాటింగ్ చేయవచ్చు. మీరు మీ కాంటాక్ట్ లను ఫేస్ బుక్ తో కూడా లింక్ అప్ చేసుకోవచ్చు. ఇదంతా ఉచితంగానే లభిస్తుంది.
టాంగో
ఇది ఉపయోగించడానికి సులువుగా ఉండే ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది. పాస్ వర్డ్ లాంటి అవసరాలేవీ దీనికి ఉండవు.దీనికి మీరు చేయవలసిందల్లా మీ ఫోన్ నెంబర్ , పేరు మరియు ఈ మెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయడమే. ఇది సంభాషణలను మరింత ఇంటరాక్టివ్ గా మార్చడానికి సరికొత్త మార్గాలను కలిగిఉంది. టీనేజర్ లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
హ్యాంగ్ ఔట్స్
దీనిని ఇంతకుముందు గూగుల్ టాక్ అని పిలిచేవారు. ఇది ప్రస్తుతం గూగుల్ నుండి మరిన్ని ఫీచర్ లను కలుపుకుని వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఇంటర్ నెట్ యూసర్ లలో ఎక్కువ మందికి గూగుల్ ఎకౌంటు ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ ఫోన్ ను వాడేవారు కాబట్టి ఇది చక్కగా సరిపోతుంది. అంటే మీ కాంటాక్ట్స్ లో ఉన వారందరికీ మీరు ఎంచక్కా వీడియో కాలింగ్ ద్వారా పలకరించవచ్చు.
వైబర్
ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ గా ప్రారంభం అయిన ఈ యాప్ ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ వీడియో కాలింగ్ యాప్ లలో ఒకటిగా నిలిచింది. దీనికి కారణం ఇది ఫ్రీ గా టెక్స్ట్ మెసేజింగ్, వాయిస్ కాలింగ్, వీడియో చాటింగ్ లం అందిస్తుంది. అంతేగాక లొకేషన్ ను బట్టి పెద్ద పెద్ద ఫైల్ లను షేర్ చేసుకునే ఆప్షన్ ను కూడా ఇది ఇస్తుంది. ఇది ఒకేసారి 40 మందితో గ్రూప్ కాలింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
వుయ్ చాట్
ఇది చైనా లో బాగా పాపులర్ అయింది. ఇది మొదటగా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ లాగా ప్రారంభం అయింది. ఇది మిగతా వాటితో పోలిస్తే ఈ రంగం లో కొత్త దిగా చెప్పుకోవచ్చు. ప్రపంచం లో ఎక్కడికైనా వీడియో కాలింగ్ ఫ్రీ గా అందిస్తుంది. ఇందులో కూడా గ్రూప్ చాట్ లు మరియు స్టికర్ ల లాంటి ఆప్షన్ లు ఉంటాయి.
లైన్
ఇది ఆసియా లోని టాప్ వీడియో కాలింగ్ యాప్ లలో ఒకటి. సోషల్ నెట్ వర్క్ లో దీనికి 600 మిలియన్ ల యూజర్ లు ఉన్నారు. ఇది కూడా మొదటగా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ లాగే ప్రారంభం అయింది. ఇందులో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు