• తాజా వార్తలు
  •  

మసాలా అని సెర్చి చేస్తే గూగుల్ అమ్మాయిల ఫొటోలు చూపించడానికి కారణం ఏంటి?

గూగుల్ సెర్చ్‌లో సౌత్ ఇండియ‌న్ మ‌సాలా అని టైప్ చేయండి.. వెంట‌నే మ‌న సౌత్‌లో ఉండే హీరోయిన్ల బొమ్మ‌లు స్క్రీన్ మీద ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.  అదే నార్త్ ఇండియ‌న్ మ‌సాలా అని సెర్చ్ చేస్తే చోలేప‌న్నీర్ లాంటి నార్త్ ఇండియ‌న్ మ‌సాలా క‌ర్రీలు క‌నిపిస్తాయి. ఎందుకీ తేడాఅస‌లు మ‌సాలా అని సెర్చ్ చేస్తే హీరోయిన్ల పిక్స్ ఎందుకొస్తున్నాయిఈ డౌట్ మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా?  దీనికి కార‌ణం గూగుల్ కాదట‌. మ‌న యాటిట్యూడ్‌లో ప్రాబ్ల‌మేన‌ని తేలింది.

 

మ‌న ఇండియ‌న్ సొసైటీలో సెక్సువ‌ల్  కంటెంట్ గురించి ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌డ‌మే ఉంది. ఫారిన్ కంట్రీస్‌లో మాదిరిగా మ‌న ద‌గ్గ‌ర సెక్సువ‌ల్ టాపిక్స్‌ను ఓపెన్‌గా చ‌ర్చించుకోలేం. అందుకే లేడీస్ గురించి మాట్లాడేట‌ప్పుడు మ‌సాలాఐట‌మ్ లాంటి ప‌దాలు వాడుతుంటాం.  అదే నార్త్‌లో అయితే మాల్‌సామాన్ లాంటి ప‌దాలు వాడ‌తారు.  మ‌న ద‌గ్గ‌ర ఉండే అడ‌ల్డ్ వెబ్‌సైట్ల‌కు కూడా ఎక్కువ‌గా ఇదే పేరు ఉంటుంది.  అందుకే  సౌత్ ఇండియ‌న్ మ‌సాలా ఫొటోస్ అని సెర్చ్ చేస్తుంటే గూగుల్ ఈ హీరోయిన్ల ఫోటోలులేడీస్ ఫొటోలు చూపిస్తుంది.  అదే నార్త్ ఇండియ‌న్ మసాలా అని టైప్ చేస్తే నార్త్ ఇండియ‌న్ మ‌సాలా ఫొటోలే వ‌స్తాయి. దీనికి కార‌ణం వాళ్లు మాల్‌సామ‌న్ అనే ప‌దాల‌ను లేడీస్‌ను ఉద్దేశించి వాడ‌తారు.

 

ఎందుకిలా?

గూగుల్ ఇమేజ్ సెర్చ్ చాలా స్మార్ట్‌గా ప‌ని చేస్తుంది. ఇది త‌నంత‌ట తానే సెర్చ్ చేసి రిజ‌ల్ట్ ఇస్తుంది. అయితే మిష‌న్ లెర్నింగ్ వచ్చిన నేప‌థ్యంలో ఎక్కువ మంది యూజ‌ర్లు ఏ రక‌మైన సెర్చ్  ఆప్ష‌న్లు ఇస్తుంటే దాన్నే ఫైన‌ల్ చేస్తోంది. అలా మ‌సాలా అంటే హీరోయిన్ల బొమ్మ‌లు చూపిస్తోంది. అదే నార్త్ ఇండియాలో మ‌సాలా అంటే కూర‌లుతినుబండారాల గురించే వస్తోందంటే వాళ్ల అడ ల్ట్ సైట్ల‌లో మాల్‌సామాన్ వంటి మాట‌లు వాడ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు