• తాజా వార్తలు

సాంకేతిక ఉద్యోగాన్వేషణను సులువు చేస్తున్న 5 యాప్స్

సాంకేతిక ఉద్యోగాన్వేషణను సులువు చేస్తున్న 5 యాప్స్

కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం కావాలి అంటే దరఖాస్తు చేసి నెలల తరబడి ఎదురు చూసేవారు. ఆ తర్వాత ఇంటర్ నెట్ విస్తృతి పెరిగాక ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. మరి ఇప్పుడంతా యాప్ ల హవా నడుస్తుంది కదా! మరి ఈ జాబు దరఖాస్తు కూడా ఏమైనా యాప్ లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీ ఉద్యోగ అన్వేషణను సులభతరం చేసే యాప్ లు అనేకం ఇప్పడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. ఇవి మీ ఉద్యోగ అన్వేషణను ప్రత్యేకించి సాంకేతిక ఉద్యోగ అన్వేషణను సులభతరం చేస్తాయి.

1. Ginger Page

మీరు స్పెల్లింగ్ మరియు గ్రామర్ లలో అంత స్ట్రాంగ్ కాకపోతే ఇది మీకు మంచిగా సహాయపడగలదు. మీ యొక్క రచనా శైలిలో ఇది మార్పును తీసుకువస్తుంది. తద్వారా మీరు  ఉద్యోగానికి దరఖాస్తు చేసే విధానాన్నే మార్చుకుంటారు. మీ సోషల్ మీడియా అప్ డేట్ లలో కూడా మీ భాష శుద్ధం గా ఉండేలా ఇది చేస్తుంది. మీ కమ్యూనికేషన్ ను ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మీ OS కీ బోర్డుకి బదులు జింజర్ కీ బోర్డును మీకు అందిస్తుంది. ఈ జింజర్ కీ బోర్డు తో పాటు మీరు ఈమోజీలను కూడా పొందవచ్చు.

ఇది iOS మరియు గూగుల్ ప్లే లలో లభిస్తుంది.

2. Inigo

వివిధ రకాల కార్డులను తయారు చేయడంలో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు సొంతంగా మీ కంపెనీ కార్డులను ఈ యాప్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన ఆర్ట్ వర్క్ మరియు గ్రాఫిక్స్ సహాయంతో మీ కార్డులను డిజైన్ చేయవచ్చు.

మీకు ఉన్న వివధ నైపుణ్యాలకు సంబంధించి వివిధ రకాల కార్డ్ లను కూడా డిజైన్ చేయడమే కాక వాటిని బ్లూ టూత్ ద్వారా పంపవచ్చు. దీనివలన మీకు వివధ రకాల అవకాశాలు వస్తాయి.

ఇది iOS మరియు గూగుల్ ప్లే లలో లభిస్తుంది.

3. Re Type- Tynography Photo Editor

ఒక సర్వే ప్రకారం రిక్రూటర్ లు సోషల్ మీడియా అకౌంట్ లను ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎవరైనా అభ్యర్థి ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు అతని సోషల్ మీడియా ఎకౌంటులను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా అతని సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా మీ సోషల్ మీడియా ఎకౌంటు ను రిక్రూటర్ లకు ఇది అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఇన్స్టా  గ్రామ్, ట్విట్టర్, పేస్ బుక్ మరియు టంబ్లర్ లాంటి సోషల్ మీడియా ఎకౌంటులను ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, కొటేషన్ లతో నింపి వాటిని షేర్ చేయడం ద్వారా మీ పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని పెంపొందించవచ్చు.

ఇది iOS లో అందుబాటులో ఉంది.

4. Interview prep

దీని యొక్క ఫ్రీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ఇంటర్ పేస్ ఇండెక్స్ కార్డులాగా ఉపయోగపడుతుంది. ఒక వైపు ప్రశ్న మరొక వైపు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే పద్దతులు ఉంటాయి. ఇంటర్ వ్యూ కి వెళ్ళే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలతో ఈ యాప్ ఉంటుంది.

ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇంటర్ వ్యూ కి వెళ్ళే ముందు మంచి ప్రాక్టీసు లభిస్తుంది.

ఇది కూడా iOS లో లభిస్తుంది.

5. Youmail

ఇది ఒక ఆకర్షణీయమైన యాప్. మీ వాయిస్ మెయిల్ ను పక్కన పడేసి వెంటనే ఈ you mail కు మారిపోండి. మీకు ఎవరైనా ఫోన్ చేస్తున్నారని అనుకోండి. మీ నెట్ వర్క్ అందుబాటులో లేదు, అది అతనికి ఎలా తెలుస్తుంది? “మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి” అనే వాయిస్ mail వినిపిస్తుంది కదా! కొన్ని నెట్ వర్క్ లలో అయితే మ్యూజిక్ వినిపిస్తుంది. అయితే ఈ you mail ను ఇంస్టాల్ చేయడం ద్వారా మీరు ఒక మంచి అనుభూతిని మీకు ఫోన్ చేసిన వారికి అందించగలుగుతారు. అదెలా అంటే మీ పేరు రాజా, మీకు హర్ష అనే వ్యక్తి ఫోన్ చేస్తున్నాడని అనుకోండి. అప్పుడు అతనికి మెసేజ్ ఇలా వెళ్తుంది “హలో హర్షా, రాజా ప్రస్తుతం అందుబాటులో లేడు, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి” అంటే కాలర్ యొక్క పేరును తీసుకుని ఇది వారికి ఒక అనుభూతిని ఇవ్వడం ద్వారా మీపై సదభిప్రాయాన్ని కల్పిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు