• తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ CRDA లో సాంకేతికఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ ( AP CRDA) లో అడిషనల్ డైరెక్టర్ మరియు GIS డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ ల పోస్టుల భర్తీ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని CRDA ప్రకటించింది. వీటికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

1. అడిషనల్ డైరెక్టర్ ( జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ) :-

ఖాళీలు : 1

విద్యార్హత : ఇంజినీరింగ్ లేదా  కంప్యూటర్ అప్లికేషనులలో 5 సంవత్సరాల గ్రాడ్యుయేట్  విద్యను అభ్యసించి ఉండాలి. లేదా రిమోట్ సెన్సింగ్ మరియు GIS ( జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ) లో మాస్టర్ డిగ్రీ ని కలిగి ఉండాలి.

అనుభవం : అర్బన్ అప్లికేషను లలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

2. GIS డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ : -

ఖాళీలు : 1

విద్యార్హతలు : ఇంజినీరింగ్ లేదా  కంప్యూటర్ అప్లికేషను లలో  5 సంవత్సరాల గ్రాడ్యుయేట్       విద్యను  అభ్యసించి ఉండాలి.

అనుభవం : 10 సంవత్సరాలు

అప్లికేషను విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

 ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : ఫిబ్రవరి 18, 2016

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : ఫిబ్రవరి 27, 2016

మరిన్నివివరాలకు http://crda.ap.gov.in/APCRDA/UserInterface/Admin/Careers_View.aspxను సంప్రదించండి. 

 

జన రంజకమైన వార్తలు