• తాజా వార్తలు

జియో టవర్ ఇన్ స్టాలేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పించుకోవడం ఎలా?

 

దేశీయ టెలికాం రంగం లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో రానున్న 6 నెలల్లో దేశ వ్యాప్తంగా 45,000 ల టవర్ లను ఏర్పాటుచేయనుంది. ఈ ప్రక్రియ లో భాగంగా ఈ రిలయన్స్ జియో యొక్క టవర్ లను తమ స్థలాలో ఏర్పాటు చేయడానికి అంగీకరించే వారికోసం దరఖాస్తు లను ఆహ్వానిస్తుంది. మీ దగ్గర ఖాళీ స్థలాలు లేదా నిరుపయోగంగా ఉన్న స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు వెంటనే దీనికి అప్లై చేయవచ్చు. రిలయన్స్ మీకు అద్దె చెల్లిస్తుంది.

 

జియో టవర్ ఇన్ స్టలేషన్ కు అప్లై చేయడం ఎలా?

గత కొద్ది నెలల నుండీ రిలయన్స్ జియో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. సాధారణ వినియోగదారులు అందరూ రిలయన్స్ యొక్క కళ్ళు చెదిరే ఆఫర్ లు చూసి సహజం గానే దానివైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పటికే 50 మిలియన్ లు దాటిన జియో వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనితో రిలయన్స్ యొక్క నెట్ వర్క్ పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి నెట్ వర్క్ యొక్క స్పీడ్ లో గణనీయమైన తగ్గుదల ఏర్పడింది.  చాలా చోట్ల వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యం లో దేశ వ్యాప్తంగా 45, 000 ల టవర్ లను ఏర్పాటు చేయాలని రిలయన్స్ నిర్ణయించింది.

మీ దగ్గర నిరుపయోగంగా ఉన్న స్థలo కానీ భవనం కానీ  ఏదైనా ఉంటే రిలయన్స్ యొక్క టవర్ ను అక్కడ ఇన్ స్టాల్ చేయించడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. మొదటగా మీరు దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలి? ఎంత డబ్బు వస్తుంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ వ్యాసం లో ఇవ్వడం జరిగింది.

1. మొదటగా మీరు http://www.industowers.com/landowners.php  విజిట్ చేయాలి.

2. మొబైల్ టవర్ ఇన్ స్టలేషన్ కు రిక్వెస్ట్ ను సబ్మిట్ చేయాలి.

3. టవర్ రిక్వైర్ మెంట్ వివరాలను పూర్తీ చేయాలి.

4. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను మరియు మీ ప్రాపర్టీ వివరాలను రివ్యూ చేస్తారు.

5. ఆ తర్వాత మీకు ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీకు తెలియజేస్తారు.

6. మీ ల్యాండ్ ను మరియు మిమ్మల్ని పరిశీలించడానికి మీ దగ్గరకు వస్తారు.

7. అవన్నీ పరిశీలించిన తర్వాత మీ ప్రాపర్టీ వారికీ నచ్చినట్లయితే మీ రిక్వెస్ట్ ను అప్రూవ్ చేస్తారు.

 

దీనికి జీతం లేదా అద్దె ఎలా ఉంటుంది?

మీ భవనాన్ని లేదా స్థలాన్ని జియో టవర్ ఇన్ స్టలేషన్ కు అప్రూవ్ చేసినట్లయితే ప్రతిఫలంగా కొంత డబ్బును మీకు అద్దె గా కానీ లేదా శాలరీ గా కానీ జియో చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇది నెలకు రూ 20,000 – 30,000 ల వరకూ ఉంటుంది.  నగర ప్రాంతాలలో అయితే రూ 35,000- 50,000 ల వరకూ ఉంటుంది.

 

ఇది ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది?

దాదాపు దేశం లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జియో తన టవర్ లను ఇన్ స్టాల్ చేయనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్,  పూణే, విజయవాడ, చండీగఢ్, జైపూర్, జోద్ పుర, కోట, లక్నో, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వడోదర, లూధియానా, భోపాల్, ఇండోర్, భువనేశ్వర్ .... మొదలైన నగరాలలో ఇవి అందుబాటులోనికి రానున్నాయి.

 

అప్లై చేయడానికి ఏమేమి కావాలి?

రిలయన్స్ యొక్క టవర్ ఇన్ స్టలేషన్ కు అప్లై చేయాలి అంటే మీరు కొన్ని డాక్యుమెంట్ లను  సబ్మిట్ చేయాలి. అవి

1. మీ ల్యాండ్ పేపర్ ల యొక్క జిరాక్స్ కాపీ

2. ల్యాండ్ ఓనర్ యొక్క వాలిడ్ ID

3. స్థల యజమాని నుండి నిరభ్యంతర పత్రం

4. ఆ ప్రాంత పాలనా సంస్థ నుండి NOC

5. రీసెంట్ ల్యాండ్ సర్వే రిపోర్ట్

చూశారుగా , మీ దగ్గర నిరుపయోగం గా ఉన్న స్థలం కానీ భవనం కానీ ఉంటే, మీకు దీనిపై ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. దీనికి సంబంధించి ఏవైనా లేటెస్ట్ అప్ డేట్ లు ఉంటే ఎప్పటికప్పుడు మా వెబ్ సైట్ లో ప్రచురించడం జరుగుతుంది.

 

జన రంజకమైన వార్తలు