• తాజా వార్తలు

ఈ లేటెస్టు స్కిల్స్ ఉంటే ఐటీ సెక్టార్లో మీరు కింగే..

అప్ డేట్... టెక్నాలజీ రంగంలో ఈ పదానికి చాలా వేల్యూ ఉంది. సాఫ్ట్ వేర్ లు, యాప్ లు, ఓఎస్ లు ఒకటేమిటి అన్నిటికీ అప్ డేట్ వెర్షన్లు వస్తూనే ఉంటుంటాయి. టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీని ఉపయోగించే మనిషే కూడా అప్ డేట్ కావాల్సిందే. ఇక ఐటీ ఉద్యోగం కోరుకునేవారు... ఆల్రెడీ ఆ ఉద్యోగంలో ఉన్నవారు కూడా అఫ్ డేట్ కావాల్సిందే. దీంతో ఐటీ విద్యార్థులు రెగ్యులర్‌ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటే టెక్నికల్‌ కోర్సుల వైపు తమ దృష్టిని సారిస్తున్నారు. అయితే ఈ రంగంలో నెలకొన్న పోటీతత్వం, మారుతున్న పరిస్థితులతో సంస్థలు ఆశిస్తున్న నైపుణ్యాలు త్వరగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఎలాంటి అప్ డేటెడ్ స్కిల్స్ ఐటీ రంగానికి అవసరమో పలు సర్వేలు అంచనా వేశాయి.

బిగ్‌ డేటా
డిగ్‌ డేటా ఎనలిస్టులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. బిగ్‌ డేటా ఎనలిస్టులును అపాయింట్‌ చేసుకునేందుకు 38 శాతం సంస్థలు పోటీపడుతున్నాయట.
బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌
బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేందుకు 34 శాతం సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
హెల్ప్‌డెస్క్‌ / టెక్నికల్‌ సపోర్ట్‌
సుమారు 30 శాతం సంస్థలు హెల్ప్‌డెస్క్‌ / టెక్నికల్‌ సపోర్ట్‌ నాలెడ్జ్‌ ఉన్నవారిని తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.
డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌
డేటాబేస్‌ స్కిల్స్‌ ఉన్న ఐటీ ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకునేందు కు 25 శాతం సంస్థలు ఇంట్రస్ట్‌గా ఉన్నాయి.
క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌
టెక్నాలజీ.. డేటా అంతా క్లౌడ్‌ అండ్‌ సాస్‌లోనే నిక్షిప్తం చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఈ టెక్నాలజీ తెలిసిన నిపుణులను సంస్థలోకి తీసుకునేందుకు 24 శాతం ఐటీ కంపెనీలు చాలా ఆస క్తిగా ఉన్నట్లు సర్వే ల్లో తేలింది.
ఐటీ ఆర్కిటెక్చర్‌
ప్రస్తుతం 42 శాతం ఐటీ కంపెనీలు ఐటీ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాలు కలిగిని వ్యక్తులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తాజా సర్వేల్లో తేలింది.
ప్రోగ్రామింగ్‌ అండ్‌ అప్లికేషన్‌ డెవలెప్‌మెంట్‌
దాదాపు 40 శాతం కంపెనీలు ఉద్యోగార్థుల్లో ఈ స్కిల్‌ ఉందో? లేదోనని పరిశీలిస్తున్నాయి. ఈ ఫ్లాట్‌పామ్‌మీద పట్టున్నవారికి మంచి వేతనాలతో ఉద్యోగాలను ఆఫర్‌ చేస్తున్నాయట.
ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
ప్రాజెక్ట్‌ లీడ్‌ చేయడంతోపాటు.. మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ కలిగిన సిబ్బందిని నియమించుకునేందుకు 39 శాతం సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి.

జన రంజకమైన వార్తలు