• తాజా వార్తలు

ఈ కామర్స్ కంపెనీలు కాంపస్ సెలెక్షన్స్ తగ్గిస్తున్నాయా?...

త సంవత్సరం దేశం లోని టాప్ బిజినెస్ స్కూల్ ల లోని విద్యార్థులను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ లాంటి కంపెనీలు అత్యధిక వేతనాలు ఇచ్చి మరీ ఉద్యోగాల లోనికి తీసుకున్నాయి. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి పునరావృతం అయ్యే సూచనలేమీ కనబడడం లేదు. ప్రస్తుతం దేశం లోని టాప్ బిజినెస్ స్కూల్ లలో రిక్రూట్ మెంట్ ట్రెండ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ మరియు స్నాప్ డీల్ రెండూ కలిసి గత సంవత్సరం దేశం లోని టాప్ బిజినెస్ స్కూల్ లకు చెందిన సుమారు 400 మంది గ్రాడ్యుయేట్ లను తమ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. కానీ ఈ సంవత్సరం అతి కొద్ది మొత్తం లో మాత్రమే రిక్రూట్ చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ట్రెండ్ దేశం లోని ఏ ఒక్క బిజినెస్ స్కూల్ కో పరిమితం కాలేదు. అన్నింటిలోనూ దాదాపు గా ఇదే పరిస్థితి ఉంది.

భారత దేశం లో ప్రముఖ బిజినెస్ స్కూల్ అయిన SP జైన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ , గుర్ గావ్ , IIFT మరియు IMI ఢిల్లీ లలో ఇప్పటికే ఫైనల్ ప్లేస్ మెంట్ లు పూర్తి అయ్యాయి. కానీ గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం ఈ కామర్సు కంపెనీల యొక్క  ప్లేస్ మెంట్ లలో 40 నుండీ 75 శాతం వరకూ తగ్గుదల కనిపించింది. IIM లలో మొదటి మూడు స్థానాలలో ఉన్న అహ్మదాబాద్, బెంగళూరు, మరియు కోల్ కతా IIM లలో కూడా పరిస్థితి ఇలాగె కనిపిస్తుంది. వీటిలో ఇంకా క్యాంపస్ సెలక్షన్ లు ప్రారంభం కానప్పటికీ ముందస్తు సూచనలు ఏమంత ఆశా జనకంగా లేవు. ఎందుకంటే దాదాపుగా విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్లేస్ మెంట్ ల జాడే కన్పించడం లేదు. ఉదాహరణకు IIM కోల్ కతా కు ఇప్పటి వరకూ ఒక్క ఈ కామర్స్ కంపెనీ కూడా రాలేదు. IIM కోజికోడ్ లో గత వారమే ప్లేస్ మెంట్ లు జరిగినప్పటికీ వాటిలో 33% తగ్గుదల కనిపించింది. కేవలం స్నాప్ డీల్ మరియు ఫ్లిప్ కార్ట్ లు మాత్రమే కాదు, మరో ఈ కామర్స్ దిగ్గజమైన అమజాన్ కూడా ఇదే బాటలో పయనిస్తుంది.

మరి ఈ రిక్రూట్  మెంట్ లలో వ్యత్యాసాలు దేనికి సంకేతమో వేచి చూడాలి.

 

జన రంజకమైన వార్తలు