• తాజా వార్తలు

లో లైటింగ్‌లోనూ మంచి ఫొటోల కోసం..  నైట్ మోడ్ ఆప్ష‌న్ తీసుకురానున్న వాట్సాప్  

 

వాట్సాప్ దూకుడు పెంచింది. ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొన్న‌ప్ప‌టి నుంచి వాట్సాప్‌లో ర‌క‌ర‌కాల ఫీచ‌ర్ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 120 కోట్ల యూజ‌ర్ బేస్ క‌లిగిన ఈ మెసేజింగ్ యాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతోంది.  వాయిస్ కాలింగ్‌, వీడియో కాలింగ్ ఆప్ష‌న్ల‌తో వాట్సాప్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది.  స్నాప్‌చాట్ స్టోరీస్ ఫీచ‌ర్ ఇన్‌స్పిరేష‌న్‌తో స్టేట‌స్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇదీ స‌క్సెస్ అయింది.  ఎలాంటి ఫైల్‌న‌యినా సెండ్ చేసుకునే ఆప్ష‌న్ ను తీసుకొచ్చింది. ఇక లేటెస్ట్ ఫీచ‌ర్ .. లో లైటింగ్‌లోనూ ఫొటోలు తీసుకునే నైట్ మోడ్‌.. త్వ‌రలో యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రాబోతోంది.  


నైట్ మోడ్ ఎలా ప‌నిచేస్తుంది? 
వాట్సాప్‌లో కెమెరా ఆప్ష‌న్‌కు ఈ కొత్త నైట్ మోడ్ ఫీచ‌ర్ త్వ‌ర‌లో రాబోతుంది.  లోలైట్ కండిష‌న్ల‌లో ముఖ్యంగా రాత్రి స‌మ‌యంలో ఫొటోలు తీసుకునేటప్పుడు ఈ మోడ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆటోఫోకస్ ఫీచ‌ర్‌తో ఫొటోను బ్రైట్‌గా చూపిస్తుంద‌ని తెలుస్తోంది. దీనికోసం వాట్సాప్ కెమెరా లో ఫ్రంట్‌, రియ‌ర్ కెమెరా ఆప్ష‌న్ల  మాదిరిగానే zoom in/out,  turn on/off LED flash అనే రెండు ఆప్ష‌న్లు కూడా   ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.  ఎల్ఈడీ ఫ్లాష్ ఆన్ చేస్తే ఫొటో లో లైటింగ్‌లో కూడా బ్రైట్‌గా వ‌స్తుంది.   నైట్ మోడ్‌లో వాట్సాప్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ (స్క్రీన్ లుక్‌) బ్లాక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. దీనివ‌ల్ల యూజ‌ర్ కంటిపై స్ట్రెయిన్ త‌గ్గుతుంది. వీడియో కాలింగ్ యాప్‌లో ఈ నైట్‌మోడ్ ఫెసిలిటీ వ‌స్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
 ఎప్పుడు.. ఎవరికి? 
ఐవోఎస్ యూజ‌ర్ల‌కు ఫ‌స్ట్ ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెస్తారు. అంటే యాపిల్ ఐ ఫోన్ల‌లో ముందు ఈ ఫీచ‌ర్ వ‌స్తుంది. త‌ర్వాత ద‌శ‌లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా ఇస్తారు. రాబోయే బీటీ అప్‌డేట్‌లో నైట్‌మోడ్ ను ఇంట్ర‌డ్యూస్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

 

జన రంజకమైన వార్తలు