• తాజా వార్తలు
  •  

మార్కెట్లో ఉన్న రూ.20 వేల లోపు ఫుల్  హెచ్‌డీ టీవీలు ఇవే!

ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో టీవీ మ‌స్ట్‌. ఒక‌ప్పుడు టీవీ అంటే టీవీ మాత్ర‌మే మాత్ర‌మే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. ఎందుకంటే మ‌నం టీవీని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు మాత్ర‌మే కాదు.  ఇన్ఫ‌ర్మేష‌న్ కోసం కూడా ఈ  టీవీల‌ను ఉప‌యోగిస్తున్నారు. స్మార్ట్‌టీవీలు వ‌చ్చాక టీవీ రంగంలో మార్పులు వ‌చ్చాయి. హెచ్‌డీ డిస్‌ప్లే  ఉన్న టీవీల‌ను కొన‌డానికే వినియోగ‌దారులు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. 

శాంసంగ్ జాయ్ సిరీస్-5
టీవీల విష‌యంలో శాంసంగ్ కంపెనీది ఎప్పుడూ అగ్ర‌స్థాన‌మే. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు కొత్త టెక్నాల‌జీలో టీవీల‌ను  తీసుకురావ‌డంలో  ఈ సంస్థ ముందంజ‌లో ఉంటుంది. ఆ కంపెనీ నుంచి  వ‌చ్చిన శాంసంగ్ జోయ్  సిరీస్‌-5 22ఎఫ్‌5100 కూడా అలాంటిదే.  దీని  ధ‌ర రూ.13,400గా ఉంటుంది.  22 అంగుళాల డిస్‌ప్లే టీవీలో, 2 హెచ్‌డీఎంఐ పోర్టుల‌తో పాటు 2 యూఎస్‌బీ పోర్ట్‌.. క్లీన్ వ్యూ, ఆటో  నోయిజ్ రిమూవ‌ల్ లాంటి ఆప్ష‌న్లు ఈ టీవీ సొంతం.

సోని కేఎల్‌వీ-22పీ402సీ
టీవీల్లో ఎక్కువ శాతం అమ్ముడుపోయేవి సోని కంపెనీ నుంచే.   మంచి వ్యూ కావాలంటే సోని టీవీ తీసుకోవాల‌నే న‌మ్మ‌కం జ‌నాల్లో బాగా స్థిర‌ప‌డిపోయింది.  ఆ కంపెనీ నుంచి వ‌చ్చిన సోని కేఎల్‌వీ-22పీ402సీ కూడా క‌స్ట‌మ‌ర్ల‌ను ఏమాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌దు.  దీనిలో ఉన్న క్లియ‌ర్ రిజ‌ల్యూష‌న్ ఎన్‌హాన్స‌ర్ వ‌ల్ల ఇమేజ్ నోయిజ్ త‌గ్గుతుంది. ఎఫ్ఎం రేడియో, 10 వాట్ స్పీక‌ర్‌, 1  యూఎస్‌బీ, కంపోజిట్ వీడియో ఇన్‌పుట్స్ దీనిలో మిగిలిన ఆప్ష‌న్లు. ఇన్‌పుట్‌, అవుట్ పుట్ కోసం 1 ఆర్ఎఫ్ క‌నెక్ష‌న్ కూడా ఉంది.  దీని ధ‌ర రూ.14,400

ఎల్‌జీ 22ఎల్ఎఫ్‌460ఏ
22 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ టీవీలో 10 వాట్స్ స్పీక‌ర్ ఉంది. దీనిలో ఉన్న ఎకో మోష‌న్ సెన్సార్ వ‌ల్ల ప‌వ‌ర్ కంజ్యూమ్ త‌క్కువ అవుతుంది.  మంచి పిక్చ‌ర్ క్వాలిటీ కోసం ఎక్స్‌డీ ఇంజిన్ ఈ టీవీలో ఉంది. క‌నెక్టివిటీ కోసం 1 హెచ్‌డీఎంఐ పోర్ట్‌,1 యూఎస్‌బీ పోర్టు ఉన్నాయి. దీని ధ‌ర రూ.13,500.

వుయు 32డీ6545 
వుయు నుంచి మ‌రో  టీవీ 32డీ6545. 32 అంగుళాల టీవీలో వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. 16 వాట్స్ స్పీక‌ర్‌, ఏ ప్ల‌స్ గ్రేడ్ ప్యాన‌ల్‌, 178 డిగ్రీల వ్యూయింగ్‌, 60 హెట్జ్ రిఫ్ర‌ష్ రేటు దీనిలో ఆప్ష‌న్లు దీని ధ‌ర 18,990

లాయిడ్ ఎల్‌32ఎఫ్‌హెచ్‌డీ టీవీ
32 అంగుళాల టీవీలో 60 హెట్జ్ రిఫ్ర‌ష్ రేట్‌. 176 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌, 20 వాట్స్ స్పీక‌ర్, 2 హెడీఎంఐ, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. వీటితో పాటు మూడేళ్ల మాన్యుఫాక్చ‌రింగ్ వారెంటీ  అదనం. దీని ధ‌ర రూ.18,600

పాన్‌సోనిక్ 22సీ400డీఎక్స్‌
పాన్‌సోనిక్‌ 22400డీఎక్స్ టీవీ కూడా  అధునాత‌నంగా త‌యారైంది  22 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 100 హెట్జ్ రిఫ్ర‌ష్ రేటు ఉన్న ఈ టీవీలో 30 వాట్స్ స్పీక‌ర్‌, డాట్ నోయిస్ రిడెక్ష‌న్‌, క‌నెక్టివిటీ కోసం 1 పీసీ  అవుట్ పుట్‌, 1 హెచ్‌డీఎంఐ పోర్ట్‌, 1 యూఎస్‌బీ పోర్ట్ ఉన్నాయి దీని ధ‌ర రూ.14,500. 

జన రంజకమైన వార్తలు