• తాజా వార్తలు

జియోకు పోటీ.. వీఓఎల్టీఈ సేవలను ఈ రోజు లాంచ్ చేస్తున్న ఎయిర్ టెల్

  దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ రోజు ప్రతిష్ఠాత్మక సేవలను లాంఛ్ చేయబోతోంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ(వీవోఎల్టీఈ) సేవలను ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఢిల్లీ ఈ లాంచింగ్ కార్యక్రమం ఉంటుందంటూ ఇప్పటికే మీడియా సంస్థలన్నిటికీ ఆహ్వానాలు పంపించింది. మరోవైపు ఇప్పటికే పలు హ్యాండ్ సెట్లకు ఎయిర్ టెల్ వీవోఎల్టీఈ సపోర్టు అందుతోంది. యాపిల్ ఇండియా సపోర్టు పేజిలోనూ దీని గురించి ఉంది. ఐఫోన్ 6.. ఆ తరువాత మోడళ్లకు ఎయిర్ టెల్ వీఓఎల్టీఈ సపోర్టు ఉంటుందని పేర్కొంది.
    వీఓఎల్టీఈ సేవలపై ఎయిర్ టెల్ కొద్దికాలంగా ముంబయి, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ట్రయల్స్ చేస్తోంది. ఇప్పుడు అధికారికంగా లాంఛ్ చేయబోతోంది. దీనివల్ల బ్యాండ్ల మధ్య మార్పిడి లేకుండా వోయిస్, డాటాలకు మారొచ్చు.
    ప్రస్తుతం దేశంలో ఒక్క రిలయన్స్ జియో మాత్రమే ఈ వీఓఎల్టీఈ సేవలు అందిస్తోంది. మిగతావన్నీ ఎల్టీఈ టెక్నాలజీ మాత్రమే వాడుతుున్నాయి. అంటే... డాటా ట్రాన్సఫర్ కే 4జీ సేవలు వినియోగమవుతున్నట్లు. వీఓఎల్టీఈ ఉంటే వాయిస్ కాల్స్ కూడా 4జీ వేగంతో అందుతాయి. దీనివల్ల కాల్ క్వాలిటీ, కాల్ కనెక్టివిటీ వంటివన్నీ మెరుగుపడతాయి. ఎయిర్ టెల్ ఇప్పుడు దీన్ని లాంచ్ చేయేనుండడంతో జియోకు పోటీ ఎదురుకానుంది. 

జన రంజకమైన వార్తలు