• తాజా వార్తలు

5వేల‌లోపు ధ‌ర‌లో బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం..

ఇండియ‌న్ మార్కెట్‌లో 5వేల లోపు దొరికే మొబైల్ ఫోన్లు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని 4జీ ఎల్‌టీఈ నెట్‌వ‌ర్క‌ణు కూడా స‌పోర్ట్ చేస్తున్నాయి.  వీటిలో బెట‌ర్ స్పెసిఫికేష‌న్స్ ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి.  అలా 5వేల లోపు ధ‌ర‌కే దొరికే నాలుగు మంచి  మొబైల్స్ ఇవీ..

శాంసంగ్ జెడ్‌2      (Samsung Z2)

4,650ల‌కు ల‌భిస్తున్న ఈ ఫోన్ శాంసంగ్ నుంచి వ‌చ్చిన బ‌డ్జెట్ ఫోన్ల‌లో ఒక‌టి. 

* 262 కే క‌ల‌ర్ డెప్త్ తో 4 అంగుళాల WVGA TFT  డిస్‌ప్లే

* 1.5 గిగాహెర్ట్జ్ ప్రాసెస‌ర్‌

* 1 జీబీ ర్యామ్ * 8జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 128 జీబీ)

* డ్యూయ‌ల్ సిమ్ ఫోన్

* 4G LTE నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేస్తుంది కాబ‌ట్టి  జియో సిమ్ కూడా వాడుకోవ‌చ్చు

* టైజ‌న్ ఓఎస్‌

* 5 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా

* 1500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 

మైక్రోమ్యాక్స్ భార‌త్ 2  (Micromax Bharat 2)

దేశీయ సెల్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ నుంచి వ‌చ్చిన ఈ4జీ ఫోన్ ధ‌ర 3,490 మాత్ర‌మే.

* 800 x 480 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో 4  ఇంచెస్‌ డిస్‌ప్లే

* 1.3 గిగాహెర్ట్జ్  స్ప్రెడ్‌ట్ర‌మ్ SC9832 క్వాడ్ కోర్  ప్రాసెస‌ర్‌

* 512 ఎంబీ ర్యామ్ * 4జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 32 జీబీ)

* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌

* 2 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా

* 1300 ఎంఏహెచ్ లిథుయం అయాన్ బ్యాట‌రీ

 

ఇన్‌ఫోక‌స్ ఏ1 ఎం500 (InFocus A1 M500)

ఈ సెగ్మెంట్లో మంచి స్క్రీన్ సైజ్‌, మంచి బ్యాట‌రీ బ్యాక‌ప్‌తో వ‌చ్చిన ఫోన్ ఇది. ధ‌ర 4,499

* 5 ఇంచెస్‌ డిస్‌ప్లే

* 1.2 గిగాహెర్ట్జ్   క్వాడ్ కోర్  ప్రాసెస‌ర్‌

* 1జీబీ బీ ర్యామ్ * 8 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 32 జీబీ)

* * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌

*5 మెగాపిక్సెల్ రియ‌ర్, ఫ్రంట్ కెమెరాలు

* 2,450 ఎంఏహెచ్  బ్యాట‌రీ

 

ఎల్‌వైఎఫ్ ఫ్లేమ్ 8 (LYF Flame 8)

మంచి బ్యాట‌రీ  బ్యాక‌ప్, కెమెరా ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఈ ఫోన్  4,389కి దొరుకుతుంది.  

* 4.5 ఇంచెస్‌ డిస్‌ప్లే విత్ ఏజీసీ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌

* 1.1 గిగాహెర్ట్జ్   క్వాడ్ కోర్  ప్రాసెస‌ర్‌

* 1జీబీ బీ ర్యామ్ * 8 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 128 జీబీ)

*8  మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా విత్ ఆటోఫోక‌స్

* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* 2,000 ఎంఏహెచ్  బ్యాట‌రీ

 

ఇవోమీ ఎంఈ1 ప్ల‌స్‌ (VooMi Me1+)

ర్యామ్‌, ఓఎస్, బ్యాట‌రీ బ్యాక‌ప్‌స్క్రీన్ సైజ్ అన్నింటిలో ఇది మిగిలిన అన్నింటికంటే టాప్‌. ప్రైస్ 4,699.  

* 5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే విత్ 2.5డీ క‌ర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్ 

* 1.1 గిగాహెర్ట్జ్   క్వాడ్ కోర్  ప్రాసెస‌ర్‌

* 2 జీబీ బీ ర్యామ్ * 16 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ (ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 128 జీబీ)

* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ (7.0 నూగ‌ట్ ఓఎస్‌కు అప్‌డేట్ ఇస్తుంది)

* 4జీ ఎల్‌టీఈ క‌నెక్టివిటీ

*8  మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా 

* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* 3,000 ఎంఏహెచ్  బ్యాట‌రీ

 

జన రంజకమైన వార్తలు