• తాజా వార్తలు

షియోమీ నుంచి కొత్త బ్రాండు.. ‘ల్యాన్ మి’

    చైనీస్ బ్రాండ్ షియోమీ మరో పేరుతోనూ స్మార్టు ఫోన్లను లాంఛ్ చేయబోతోంది. చాలాకాలంగా ఈ మాట వినిపిస్తున్నా కూడా ఆ కొత్త బ్రాండు పేరేమిటన్నది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇప్పుడు చైనాకే చెందిన ఓ వెబ్ సైట్ ఆ పేరును వెల్లడించింది. షియోమీ... ల్యాన్ మీ పేరుతోనూ స్మార్టుఫోన్లను తేనుందని తెలిపింది.

ల్యాన్ మీ తొలి ఫోన్ అదే..
'ల్యాన్‌మి' బ్రాండు పేరుతో షియోమి 5ఎక్స్‌ను కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే... ఇంతవరకు ఆన్ లైన్ సేల్స్ నే నమ్ముకున్న షియోమీ ఈ ఫోన్ ను మాత్రం ఆఫ్ లైన్లో ఎక్కువగా విక్రయానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. 
    ల్యాన్ మీ ఫోన్ ధర రూ.20 వేల వరకు ఉండొచ్చని అంచాన. దీన్ని జులై 26న మార్కెట్లో ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు.

ల్యాన్ మీ 5 ఎక్స్ స్పెసిఫికేషన్లు
* 5.5 అంగుళాల స్క్రీన్‌
* క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
* 6జీబీ/4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* 12 ఎంపీ సెన్సార్లతో రెండు రియర్‌ డ్యూయల్‌ కెమెరాలు
* 16ఎంపీ సెల్ఫీ కెమెరా
* ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌  ఓఎస్
 

జన రంజకమైన వార్తలు