• తాజా వార్తలు

గైడ్‌: వాట్స‌ప్ స్పామ్ మీద యుద్ధం చేయ‌డానికి గైడ్‌

ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ల‌కు వాట్స‌ప్ త‌ప్ప‌క ఉండాల్సిందే. మ‌నం రోజులో ఎక్కువ‌గా ఉప‌యోగించే యాప్ కూడా ఇదే. అయితే ఈ యాప్‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అంతే ఇబ్బందులు కూడా ఉన్నాయి.  అదే స్పామింగ్‌. మ‌న‌కు తెలియ‌కుండానే మెసేజ్‌ల ద్వారా స్పామ్ మ‌న ఫోనోలో చేరిపోతూ ఉంటుంది. దాన్ని ప‌ట్టించుకోక‌పోతే కొన్ని రోజులకు ఫోన్ ఆగిపోవ‌డం లేదా పూర్తిగా పాడైపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మ‌రి వాట్స‌ప్‌లో స్పామ్‌ను తీసేయాలంటే ఏం చేయాలి. దీనికి నాలుగు మార్గాలున్నాయి అవేంటో చూద్దామా..

జంక్ ఫొటో, వీడియో క్లీన‌ర్‌

వాట్స‌ప్‌లో స్పామ్‌ను క్లీన్ చేయ‌డం కోసం స్టాష్ అనే ఆప్ష‌న్ ఉంది. దీనిలో ఉన్న మైరైడ్ ఫీచ‌ర్ వ‌ల్ల మీ ఫొటోల‌లో ఉన్న స్పామ్ క్లీన్ అయిపోతుంది. దీనిలో ఉన్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెంట్ అర్గ‌రిథ‌మ్ వ‌ల్ల అటు ఫొటోలు, ఇటు వీడియోలను ఇది క్లీన్‌గా ఉంచుతుంది. దీని కోసం మీరు ఈ యాప్‌కు మీ స్టోరేజ్‌పై యాక్సెస్ కోసం అన్ని ప‌ర్మిష‌న్లు ఇవ్వాల్సి ఉంటుంది. స్టాష్ ఎప్ప‌టిక‌ప్పుడు మీ డేటాను ప‌రిశీలించి రివ్యూ చేస్తుంది. మీకు అవ‌స‌ర‌మైన డేటా ఉంటే దాన్ని ఉంచుకోవ‌చ్చు. మిగిలిన‌వి డిలీట్ అయిపోతాయి. పొర‌పాటున ఏమైనా ఫైల్స్ డిలీట్ అయిపోతే వాటిని ప‌దిరోజుల లోపు రీస్టోర్ చేసుకోవ‌చ్చు.

సిఫ్ట‌ర్ మ్యాజిక్ క్లీన‌ర్‌

ఆండ్రాయిడ్ వాట్స‌ప్‌లో దూరిపోయిన స్పామ్‌ను క్లీన్ చేయ‌డానికి సిఫ్ట‌ర్ కూడా మంచి టూల్‌. దీన్ని సిఫ్ట‌ర్ మ్యాజిక్ క్లీన‌ర్ పేరుతో పిలుస్తారు.  స్టాష్‌కు ఇది ట్రిమ్ వెర్ష‌న్ అని చెప్పొచ్చు. దీనిలో ఉన్న మిష‌న్ లెర్నింగ్ అల్గ‌రిథ‌మ్స్ వ‌ల్ల మీ ఫోన్‌లో ఉన్న స్పామ్ వెంట‌నే తెలిసిపోతుంది. అంటే ఇది మీ వాట్స‌ప్‌ను పూర్తిగా డ‌యాగ్న‌స్ చేస్తుంది. అంటే వాట్స‌ప్ ఇంట‌ర్‌ఫేస్‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా నెమ్మ‌దిగా స్పామ్‌ను తొల‌గించేస్తుంది.  కేవ‌లం వాట్స‌ప్ మాత్ర‌మే కాదు  హైక్‌, టెలిగ్రామ్‌, వీబ‌ర్‌, లైన్ లాంటి నెట్‌వ‌ర్క్స్‌లోనూ ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

గూగుల్ ఫైల్స్ గో

వాట్స‌ప్‌లో  స్పామ్‌ను క్లీన్ చేయ‌డానికి గూగుల్‌ ఫైల్స్ గో అనే ఆప్ష‌న్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌లో స్పేస్‌ను ఫ్రీ చేయ‌డానికి ఈ యాప్‌ను గూగుల్ ప్ర‌త్యేకించి రూపొందించింది. మీ ఆండ్రాయిడ్‌లో ఉప‌యోగించే అన్ని అప్లికేష‌న్ల‌లోని స్పామ్‌ను తొల‌గించ‌డానికి ఈ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఫైల్స్ గో యాప్‌కు ఒక స్టాండ‌ర్డ్ ఫైల్ మేనేజ‌ర్ కూడా ఉంది. పీర్ టు పీర్ ఫైల్ షేరింగ్ ఆప్ష‌న్ కూడా దీనిలో ఉంది.

ఇన్‌బిల్ట్ టూల్స్‌

ఒప్పో లాంటి ఫోన్ కంపెనీలు ఇన్‌బిల్ట్‌గానే స్పామ్ క్లీన‌ర్ యాప్‌ల‌ను ఇస్తున్నాయి. మెసేజ్‌ల ద్వారా వ‌చ్చే స్పామ్‌ల‌ను ఏరిపారేసే టూల్స్‌ను ఇవి ముందుగానే ఫోన్ల‌లో ఉంచుతున్నాయి. ఫోన్ మెసెంజ‌ర్ యాప్‌ల‌లో ఈ ఫీచ‌ర్లను మ‌నం చూడొచ్చు.

జన రంజకమైన వార్తలు