• తాజా వార్తలు
  •  

క‌నిపించ‌వు.. కానీ అవ‌స‌రాల‌కు క‌లిసొస్తాయి.. అవే వర్చ్యువల్ కార్డులు

క్రెడిట్‌, డెబిట్ కార్డులు ఇవి వాడ‌ని వాళ్లు క‌నిపించ‌ట్లేదిప్పుడు. ప్ర‌పంచం అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయిన త‌ర్వాత ఏ చిన్న అవ‌స‌రానికైనా వెంటనే కార్డు కోసం వెతుకుతున్నాం.  అంత‌గా ఈ కార్డులు మ‌న జీవితంలో భాగమైపోయాయి. అయితే మ‌న‌కు క్రెడిట్‌, డెబిట్ కార్డులు అంటే ఏమిటో తెలుసు. కానీ మ‌న చేతిలో కార్డులు లేక‌పోయినా కార్డులా అవ‌స‌రం  తీర్చే వ‌ర్చువ‌ల్ కార్డుల గురించి మీకు తెలుసా? ఇప్పుడు న‌డుస్తోంది  ఇదే ట్రెండ్‌! చాలా కంపెనీలు ఇప్పుడు వ‌ర్చువ‌ల్ కార్డుల‌నే ఇష్యూ చేస్తున్నాయి. మ‌రి ఆ వ‌ర్చువ‌ల్ కార్డుల సంగ‌తేంటో చూద్దామా..

పెసేవ్ ప్రిపెయిడ్ బ్యాంక్ యాప్‌
వ‌ర్చువ‌ల్ కార్డుల వ‌రుస‌లోనే వ‌చ్చింది పెసేవ్ ప్రిపెయిడ్ బ్యాంక్ యాప్‌. ఇది ఉచితంగా ఫిజిక‌ల్ కార్డుని అందిస్తోంది. దీనిలో ఎలాంటి డ‌బ్బులు యాడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. డెబిట్‌కార్డును ఉప‌యోగించి మీరు ఏటీఎం నుంచి డ‌బ్బుల‌ను కూడా విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని ఈ పెసేవ్ ప్రిపెయిడ్ కార్డు మీకు క‌ల్పిస్తోంది.

మ‌నీ టాప్ క్రెడిట్‌కార్డు
వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డు జాబితాలో వ‌చ్చిందే మ‌నీ టాప్ క్రెడిట్ కార్డు.  దీని ద్వారా మ‌న‌కు రూ.500 సైన్ అప్ బోన‌స్‌తో పాటు ఉచితంగా క్రెడిట్ కార్డు ల‌భిస్తుంది. రిఫ‌ర్ అండ్ ఎర్న్ ప్రొగ్రామ్ ద్వారా మ‌రింత డ‌బ్బులు సంపాదించే అవ‌కాశం ఉంది.

పేటీఎం రూపే కార్డు
ఎక్కువ‌మంది వాడే ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల‌లో పేటీఎం ఒక‌టి. ఆ యాప్ ఇప్పుడు రూపే కార్డును కూడా ఇస్తుంది. దీని వ‌ల్ల మ‌నం షాపింగ్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోళ్లు చేసుకోవ‌చ్చు.  ఇది మామూలు రూపే కార్డులాగా దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆధార్‌కార్డు, ఫింగ‌ర్‌ప్రింట్ ద్వారా కేవైసీని ఓకే చేసుకుని ఈ కార్డును పొందొచ్చు. అంటే మీరు పేటీఎం బ్యాంకింగ్‌లో భాగంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారు.

బ‌డ్డీ యాప్ మాస్ట‌ర్ కార్డు
ఎస్‌బీఐ బ‌డ్డీ యాప్ ఇది కూడా ఎక్కువ‌మంది ఉప‌యోగించే యాప్‌నే. త‌న ల‌క్ష‌లాది వినియోగ‌దారుల కోసం ఎస్‌బీఐ ఈ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  దీనిలోనే మీరు ఉచితంగా వ‌ర్చువ‌ల్ డెబిట్ కార్డును చూడొచ్చు. వాలెట్ మ‌నీని ఉప‌యోగించుకోవ‌చ్చు. షాపింగ్ అవ‌స‌రాల‌కు వాడుకోవ‌చ్చు. 

పీఎన్‌బీ కిట్టీ యాప్‌
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు (పీఎన్‌బీ) కిట్టీ యాప్ కూడా వ‌ర్చువ‌ల్ కార్డుల కోవ‌కు చెందిందే. ఇది కూడా మీకు ఉచితంగా రూపే కార్డును అందిస్తోంది. కాక‌పోతే మీ మొబైల్ నంబ‌ర్‌ను ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. షాపింగ్‌, ఆన్‌లైన్ ట్రేడింగ్ త‌దిత‌ర అవ‌స‌రాల కోసం ఈ కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. 

ఐసీఐసీఐ పాకెట్స్‌
ఐసీఐసీఐ స‌మ‌ర్పిస్తున్నపాకెట్స్ యాప్‌ను కూడా ఎక్కువ‌మందే వినియోగిస్తున్నారు,. వ‌ర్చువ‌ల్ కార్డుతో న‌డిచే ఈ వాలెట్‌.. మ‌న‌కు సంబంధించిన అన్ని అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. బిల్స్ పే చేయ‌డం, మ‌నీ సెండ్ చేయ‌డం, షాపింగ్ త‌దిత‌ర అవ‌స‌రాల కోసం ఈ  కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనిలో బిల్ పేమెంట్స్‌కు, షాపింగ్‌కు ఎన్నో ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను కూడా ఐసీఐసీఐ అందిస్తోంది.

యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్‌, డిజీ బ్యాంక్ డీబీఎస్ యాప్‌, యూనియ‌న్ బ్యాంకు డిగీ ప‌ర్స్‌, ఫ్రీఛార్జ్ గో మాస్ట‌ర్ కార్డ్ కూడా వ‌ర్చువ‌ల్ కార్డుల కోవ‌కు చెందిన‌వే.