• తాజా వార్తలు

ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేస్తున్నారా.. దానికివే 4 ఉత్త‌మ మార్గాలు

ఆన్‌లైన్ ద్వారా ఇన్‌కంటాక్స్ ఫైల్ చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ విష‌యం అయిపోయింది. దీని సుల‌భం, సుర‌క్షితం కావ‌డంతో ఎక్కువ‌మంది వినియోగ‌దారులు ఆన్‌లైన్ ద్వారానే టాక్స్ ఫైల్ చేయ‌డానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైల్ చేయాల‌ని అంద‌రికి ఉన్నా చాలామందికి ఎలా ఫైల్ చేయాలో తెలియ‌దు. ఎన్నో సైట్లు దీని కోసం అందుబాటులో ఉన్నా.. కొన్ని మాత్ర‌మే ఉత్త‌మ‌మైన‌వ‌ని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైల్ చేయ‌డానికి అలాంటి నాలుగు ఉత్త‌మ‌మైన టూల్స్ ఏమిటో తెలుసుకుందామా!

టర్బో టాక్స్‌
ఎక్కువ‌మంది టాక్స్ అకౌంటెంట్ల మాట‌ల ప్ర‌కారం ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైల్ చేయ‌డానికి టర్బో టాక్స్ ఆప్ష‌న్‌ను మించింది లేద‌ట‌. ఇది ఉప‌యోగించ‌డానికి సుల‌భంగా ఉండే ఇంట‌ర్‌ఫేస్ కావ‌డ‌మే దీనికి కారణం. ఈ ట‌ర్బోటాక్స్‌ను ఉప‌యోగిస్తున్న‌ప్పుడు ప్ర‌తి స్టెప్‌ను మ‌న‌కు క్షుణ్ణంగా అర్థ‌మ‌య్యేట‌ట్లు వివ‌రిస్తుంది. అంతేకాదు టాక్స్ ఫిలింగ్ ప్రాసెస్‌లో మ‌న‌కు ఎన్నో టిప్స్ ఇస్తుంది. దీని వ‌ల్ల మ‌నం సుల‌భంగా ఎవ‌రి సాయం లేకుండానే టాక్స్‌ను ఫైల్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

క్రెడిట్ క‌ర్మ‌
చాలామంది అకౌంటెంట్ల‌కు క్రెడిట్‌క‌ర్మ అన‌గానే గుర్తొచ్చేది వినియోగ‌దారుల క్రెడిట్ స్కోరు తెలుసుకునే సాధ‌నం అని మాత్ర‌మే. అయితే ఇది టాక్స్‌ ఫైల్ చేయ‌డానికి కూడా ఎఫెక్టివ్‌గా ఉయోగ‌ప‌డుతుంద‌ని తెలియ‌దు. అంతేకాదు ట‌ర్బో టాక్స్ లాంటి సైట్లు టాక్స్ ఫైల్ చేయ‌డానికి ఛార్జీ చేస్తుంటే క్రెడిట్ క‌ర్మ ఉచితంగానే ఈ సేవ‌లు అందిస్తుంది. అంతేకాదు టర్బోటాక్స్‌లో ఎలాంటి స‌దుపాయాలు ఉన్నాయో దీనిలోనూ అవే స‌దుపాయాలు ఉన్నాయి. టాక్స్ ఫైల్ చేసేవాళ్లు క‌చ్చితంగా ప‌రిశీలించాల్సిన టూల్ ఇది.

హెచ్ అండ్ ఆర్ బ్లాక్‌
టాక్స్ ఫైలింగ్ స‌ర్వీసుల కోసం ఇటీవ‌లే బాగా పాపుల‌ర్ అయింది హెచ్ అండ్ ఆర్ బ్లాక్ టూల్‌. డిజిట‌ల్ మార్కెటింగ్ బాగా పెరిగిన త‌ర్వాత ఈ టూల్‌కి కూడా గిరాకీ ఎక్కువైంది. క్రెడిట్‌క‌ర్మ‌లాగే ఇది కూడా అన్ని స‌ర్వీసుల‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ట‌ర్బోటాక్స్ మించిన ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. మీ డ‌బ్లూ-2 ఫొటోను స్నాప్ చేసి ఆటో కంప్లీట్ చేసి.. స్మూత్‌గా మీ ఫైలింగ్ కంప్లీట్ చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

ఐఆర్ఎస్‌
ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేయ‌డానికి ఐఆర్ఎస్ కూడా మంచి ప్ర‌త్యామ్నాయం. ఈ వెబ్‌సైట్ యూజ‌ర్ ఫ్రెండ్లీ మాత్ర‌మే కాదు ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. అయితే దీనిలో కొంత‌మంది మ‌ధ్య‌వ‌ర్తులు ఉండ‌డ‌మే లోటు. దీని వ‌ల్ల మీ ఫిలింగ్ న‌మ్మ‌దగిందా లేదా అనే అనుమానం క‌లుగుతుంది. టాక్స్ ఫైల్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం అనుకునే వారికి ఈ సైట్లు ఎంతో మేలు చేస్తాయి. ఒక‌సారి ప్ర‌య‌త్నించండి మ‌రి.

జన రంజకమైన వార్తలు