• తాజా వార్తలు
  •  

మీ సొంత క్రాస్ వర్డ్ పజిల్స్ క్రియేట్ చేయడానికి సింపుల్ గైడ్

ప‌జిల్స్ అంటే ఒక‌ప్పుడు  న్యూస్‌పేప‌ర్స్‌, మ్యాగ‌జైన్స్‌లో మాత్ర‌మే వ‌చ్చేవి. ఆ ప‌జిల్స్ సాల్వ్‌చేయ‌డం కోసం పేప‌ర్‌, మ్యాగ‌జైన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు.  ఇప్పుడు పేప‌ర్స్‌, మ్యాగ‌జైన్స్‌తోపాటు ఇంట‌ర్నెట్‌లోనూ ప‌జిల్స్ హ‌వా న‌డుస్తోంది.  మీకు కావాల్సిన ప‌జిల్స్‌ను మీరే సొంతంగా క్రియేట్‌చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. విండోస్‌లో కూడా ఉచితంగా క్రాస్‌వ‌ర్డ్ మేకర్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పజిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో క్రాస్‌వ‌ర్డ్ పజిల్స్ క్రియేట్ చేయడానికి ఉచిత సాఫ్ట్‌వేర్లు చాలా ఉన్నాయి. వాటిలో 5 బెస్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్లు మీ కోసం..
1. ఫ్రీ క్రాస్‌వ‌ర్డ్  మేకర్  సాఫ్ట్‌వేర్‌ 
క్రాస్‌వ‌ర్డ్  పజిల్ సాల్వ్ చేయడం చాలా క‌ష్టం. కానీ  దీన్ని పూర్తి చేస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్రిక్స్ తెలిస్తే తప్ప ఈ  పజిల్‌ను పూరించడం అంత ఈజీ కాదు.  ఈ ప‌జిల్స్ పూర్తి చేయ‌డానికి  కావాల్సిన అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌తో పజిల్ వర్క్‌షాప్‌లోఒక ఉచిత సాఫ్ట్‌వేర్ ఉంది.  
 10 × 10 నుండి 30 × 30 స్క్వేర్ సైజు గ్రిడ్స్‌తో క్రాస్‌వ‌ర్డ్  పజిల్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. దీనిలో నాలుగు బిల్ట్ ఇన్ వర్డ్స్‌లిస్ట్‌లు ఉన్నాయి. అంతేకాదు ప్రతి వర్క్‌లిస్ట్‌లో జంతువులు, ఆహారాలు వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకమైన థీమ్స్ పదాల చుట్టూ ఉంటాయి. అంతేకాదు మీరు సొంతంగావర్డ్ జాబితాను కూడా ఒక టెక్ట్స్ పైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రతిపదానికి క్లూను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ  సాఫ్ట్‌వేర్‌లో ఆప్టిమ‌ల్ ఫిల్స్ ఫీచ‌ర్ కూడాఉంది. వర్డ్ కౌంట్, లెటర్ కౌంట్ ప్రకారం వాటిని అమర్చుతుంది. క్రాస్‌వ‌ర్డ్‌ను ఒక *.xwd ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఉపయోగించడానికి  సాఫ్ట్‌వేర్‌ను తిరిగి మరలా లోడ్ చేయాలి. క్రాస్‌వ‌ర్డ్  డేటాను ఒక టెక్ట్స్ ఫైల్ గా లేదా HMTL ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు. 
 2.  ఎక్లిప్స్ క్రాస్‌వ‌ర్డ్  
ఇది విండోస్ కోసం ప్రత్యేకంగా రూపొందించి సాఫ్ట్‌వేర్ . మీరు సొంతంగా క్రాస్‌వ‌ర్డ్  పజిల్ క్రియేట్ చేసుకోవడానికి ఇది సులభమైన మార్గం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసినప్పుడు, టెక్ట్స్ ఫైల్ నుంచి లిస్టు లేదా లోడ్ లిస్టును క్రియేట్ చేయమని అడుగుతుంది. వర్క్ లిస్టు లేకపోతే, కొన్ని ఆధారాలతో కొత్త పజిల్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ లిస్టును క్రియేట్ చేసిన తర్వాత వాడుకోవడానికి ఒక టెక్ట్స్ ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు.క్రాస్‌వ‌ర్డ్ పజిల్ క్రియేట్ చేసిన తర్వాత, మీ కంప్యూటర్‌కు *.ecwఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ కోసం గ్రిడ్స్ , పదాలు, క్లూస్ సైజును కూడా తయారుచేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ తో HTMLగా ఇంటరాక్టివ్  చేయడానికి కూడా ఈ పజిల్‌ను  సేవ్ చేయవచ్చు.
3.  క్రాస్‌వ‌ర్డ్ కంపైలర్
ఇది ఒక సాధారణమైన  సాఫ్ట్‌వేర్‌. దీనిలో  10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ప‌దాల‌తో ఇన్‌బిల్ట్ డిక్ష‌న‌రీ ఉంది.కాబట్టి మీరు వర్డ్ లిస్టును ఇంపోర్ట్  చేసుకోవడం కానీ క్రియేట్ చేసుకోవాల్సిన పనిలేదు. వీటితోనే క్రాస్‌వ‌ర్డ్  పజిల్‌ను  తయారుచేసుకోవచ్చు. క్రాస్‌వ‌ర్డ్ కంపైలర్‌తో 11×11 నుండి 17 × 17 గ్రిడ్ సైజులో పజిల్స్ క్రియేట్ చేయవచ్చు.  తర్వాత, క్రాస్ వర్డ్ కంపైలర్ ను మీ పీసీలో Xwd ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. 
 4.  క్రాస్‌వ‌ర్డ్ మేకర్
ఇదొక సాధారణ  సాఫ్ట్‌వేర్‌. దీంతో15 × 15 గ్రిడ్ సైజులో మీకు అనువుగా ఉండేలా క్రాస్‌వ‌ర్డ్ పజిల్‌ను  క్రియేట్ చేయవచ్చు. మీ వర్డ్ లిస్టును బట్టి  మీకు నచ్చినట్లుగా లేఅవుట్ కూడా తయారుచేసుకోవచ్చు. క్రాస్‌వ‌ర్డ్ మేకర్‌తో ఒక పజిల్ చేయడానికి, గ్రిడ్‌పై రైట్ క్లిక్ చేసి దానికిక్లూ నెంబర్ ను కేటాయించండి. తర్వాత డబుల్ క్లిక్ చేసి గ్రిడ్ అమరికను మార్చవచ్చు. లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో కొన్నిక్లూస్ యాడ్ చేయండి. అంతే...పజిల్ ను క్రియేట్ చేసాక, ప్రింట్ కానీ సేవ్ కానీ చేయవచ్చు. 
5. క్రాస్‌వ‌ర్డ్ క్రియేటర్ 2.0.
ఈ సాఫ్ట్‌వేర్‌ చాలా చిన్నది.  యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ  సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌బిల్ట్ డిక్షనరీ కానీ వర్డ్ జాబితా కానీ లేదు. ఒక టెక్ట్స్ నుంచి వర్డ్ లిస్టును లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసిన పదాలతో క్రాస్‌వ‌ర్డ్ పజిల్‌ను క్రియేట్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు