• తాజా వార్తలు

మీ అకౌంట్ రిక‌వ‌రీ పాస్‌వ‌ర్డ్‌లు క‌నుక్కొని స్టోర్ చేయ‌డానికి ప‌క్కా గైడ్ 

ఒక‌ప్పుడు ఫోన్ పోతే దానితోపాటు  కాంటాక్స్ట్ పోయేవి.  కానీ స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చి ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ వ‌చ్చాక మీ ఫోన్ పోతే ఆన్‌లైన్ ఐడెంటిటీ పోయినట్టే. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ల  నుంచి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లాంటి సోష‌ల్ సైట్ల  వ‌ర‌కు అందులోనే యాక్సెస్ చేస్తున్నాం. అవి ఎప్పుడూ ఓపెన్ చేసుంటాయి లేదా ఫింగ‌ర్ ప్రింట్‌తో లేదా ప్యాట్ర‌న్‌తో అన్‌లాక్ చేస్తున్నాం. అంటే ఇంచుమించుగా మ‌న పాస్‌వ‌ర్డ్‌లు మ‌ర్చిపోతున్నాం. అదీకాక ఫోన్ పోతే కొత్త సిమ్ తీసుకుని  మ‌ళ్లీ వేరే ఫోన్‌లో వేసినా మీ పాత అకౌంట్ల‌న్నీ రిట్రైవ్ చేసుకోవాలంటే మీ గూగుల్‌, యాపిల్ లేదా మైక్రోసాఫ్ట అకౌంట్ ను యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి  మీ అకౌంట్ రిక‌వ‌రీ పాస్‌వ‌ర్డ్‌లు క‌నుక్కొని వాటిని స్టోర్ చేయ‌డం ఎలాగో తెలుసుకోండి.  
మైక్రోసాఫ్ట్  
మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ పేజీలోకి వెళ్లి టాప్‌లో ఉన్న సెక్యూరిటీ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.  దానిలో మీరు పాస్‌వ‌ర్డ్‌ను చేంజ్ చేసుకోవ‌చ్చు. అకౌంట్ రికవ‌రీ కోసం ఆల్ట‌ర్నేట్ ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌చ్చు.  అంతేకాదు మీ అకౌంట్ యాక్టివిటీ మీద ఓ క‌న్నేసి ఉంచ‌వ‌చ్చు.  ఆప్ష‌న్స్‌లోకి వెళితే  additional security options లింక్ కూడా క‌నిపిస్తుంది. దానిలో టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ కూడా ఉంది.  ఎస్ఎంఎస్ లేదా  అథెంటికేష‌న్ యాప్‌తో దీన్నిసెట్ చేసుకోవ‌చ్చు. Replace Recovery Code ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి మీ కొత్త రిక‌వ‌రీ కోడ్‌ను సేవ్ చేసుకోవ‌చ్చు. ఇది ఆటోమేటిగ్గా మీ పాత రిక‌వ‌రీ కోడ్‌ను రీప్లేస్ చేస్తుంది. 
 యాపిల్  
మీ యాపిల్ ఐడీ అకౌంట్‌కు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేషన్ అనేబుల్ చేస్తే రిక‌వ‌రీ కోడ్ క్రియేట్ చేసుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తుంది.  ఐవోఎస్ లేదా మ్యాక్ఓఎస్ డివైస్‌ల ద్వారా దీన్నిచాలా ఈజీగా క్రియేట్ చేసుకోవ‌చ్చు. 
ఐవోఎస్‌లో..  
* Settings > లోకి వెళ్లండి.  మీ పేరు gtఎంట‌ర్ చేయండి.  పాస్‌వ‌ర్డ్, సెక్యూరిటీలో యాపిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి. 
* రిక‌వ‌రీ కీని టాప్ చేయండి. 
* స్లైడ్ చేసి రిక‌వ‌రీ కీని ట‌ర్న్ ఆన్ చేయండి. 
* Use Recovery Keyని టాప్ చేసి  మీ డివైస్ పాస్‌కోడ్‌ను ఎంట‌ర్ చేయండి. 
*ఈ రిక‌వ‌రీ కోడ్ను ఎక్క‌డైనా రాసి భ‌ద్రంగా పెట్టుకోండి
* రిక‌వ‌రీ కోడ్‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్‌కు వెళ‌తారు. 
మాక్ ఓఎస్‌తో..  
 System Preferences > లోకి వెళ్లండి, iCloud >లోకి వెళ్లండి అకౌంట్ డిటెయిల్స్‌లోకి ఎంట‌ర‌వ్వండి. మీ యాపిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ టైప్ చేయండి. 
* Securityని క్లిక్ చేయండి 
*  Recovery Key సెక్ష‌న్‌లోకి వెళ్లి  Turn On చేయండి.
*  Use Recovery Keyని క్లిక్ చేయండి
* కంటిన్యూ క్లిక్ చేసి క‌న్ఫ‌ర్మ్ చేయండి.   

గూగుల్ అకౌంట్  
గూగుల్ అకౌంట్ పేజీలోకి వెళ్లి  Sign In  క్లిక్ చేయండి amp ;  Security లోకి వెళ్లి  గూగుల్ సెక్ష‌న్‌లో సైన్ ఇన్ కావాలి. టూ స్టెప్ వెరిఫికేష‌న్ సెలెక్ట్ చేసి మ‌ళ్లీ సైన్ ఇన్ కావాలి.  ఆప్ష‌న్స్‌లో కి వెళ్లి టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను ఎస్ఎంఎస్ లేదా యాప్ ద్వారా క‌న్ఫిగ‌ర్ చేసుకోండి. ఇప్పుడు మీకు బ్యాక‌ప్ కోడ్ క‌నిపిస్తుంది.  గూగుల్ మీకు ప‌ది రివ‌క‌రీ కోడ్‌ల‌ను క్రియేట్ చేసి  ప్రింట్ అవుట్ తీసుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తుంది.  ఇది మీరు ద‌గ్గ‌ర పెట్టుకుంటే అస‌లు కోడ్‌మ‌ర్చిపోయినా వీటిని వాడుకోవ‌చ్చు. 
 ఇలా చేయండి 
* మీ పాస్‌కోడ్‌ను రాసి ఎక్క‌డైనా భద్రంగా స్టోర్ చేసుకోండి.  డిజిట‌ల్‌గా సేవ్ చేసుకోండి లేదా  పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్‌లో స్టోర్ చేసుకోండి. అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన ప‌ని కూడా ఉండ‌దు.  

జన రంజకమైన వార్తలు