• తాజా వార్తలు
  •  

గైడ్‌: గూగుల్ సెర్చ్ ఆప‌రేట‌ర్స్‌తో మంచి ఉద్యోగాన్ని సంపాదించ‌డానికి గైడ్‌

చ‌దివితే ఉద్యోగం వ‌చ్చేయ‌దు. మంచి ఉద్యోగం కావాలంటే ఆ త‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డాలి. త‌గిన జాబ్ కోసం సెర్చ్ చేయాలి. అయితే ఏదో మామూలుగా సెర్చ్ చేస్తే స‌రిపోదు. మీ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌కు త‌గ్గ‌ట్టుగా  మ‌న జాబ్ సెర్చింగ్ ఉండాలి. దీని కోసం లింక్డ్ ఇన్‌, గ్లాస్‌డోర్ లాంటి సైట్లు ఉన్నాయి. భార‌త్‌లో అయితే నౌక‌రి లాంటి  సైట్లు ఉన్నాయి. అయితే ఇంత టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత మ‌నం స‌రిగా ఉప‌యోగించుకోక‌పోతే దానికి అర్ధం ఉండదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చేసింది గూగుల్ సెర్చ్ ఆప‌రేట‌ర్స్‌. ఉద్యోగాల‌ను సెర్చ్ చేయ‌డానికి మంచి ప్ర‌త్యామ్నాయం.. మ‌రి దీనితో మ‌న‌కు సూట్ అయ్యే ఉద్యోగాల‌ను ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం...

ఏంటి గూగుల్ సెర్చ్ ఆప‌రేట‌ర్స్‌?
గూగుల్ సెర్చ్ గురించి అంద‌రికి తెలుసు. కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే మ‌నం ఏదైనా కావాలంటే సెర్చ్ చేసేది గూగుల్‌లోనే. అయితే గూగుల్ సెర్చ్ ఆప‌రేట‌ర్స్ అనేది ఆ సంస్థ తీసుకొచ్చిన మ‌రో కొత్త ఆప్ష‌న్‌. దీనిలో మీకు కావాల్సిన జాబ్‌ను టైప్ చేస్తే చాలు. లొకేష‌న్‌, సెర్చ్ బిహేవియ‌ర్ హిస్ట‌రీ, మ‌న అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అందుకు త‌గిన జాబ్స్‌ను వెతికి పెట్టం ఈ గూగుల్ సెర్చ్ ఆప‌రేటర్స్ ప్ర‌త్యేక‌త‌.  అయితే మ‌నం సెర్చ్ చేసేది చాలా స్ప‌ష్టంగా ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు రైటింగ్ జాబ్స్ కోసం వెతుకుతుంటే... జ‌స్ట్ రైటింగ్ జాబ్స్ అని టైప్ చేసి వ‌దిలేస్తే స‌రిపోదు. ఎందుకంటే గూగుల్ ఒక మిష‌న్ దానికి స్ప‌ష్ట‌త కావాలి. మ‌న‌కు ప్ర‌త్యేకంగా రైటింగ జాబ్స్ కావాలి అని అడిగితేనే ఆ రిజ‌ల్ట్స్‌ను అది చూపిస్తుంది. 

ఏ గూగుల్ ఆప‌రేట‌ర్స్‌ను మ‌నం వాడాలి!
గూగుల్‌లో మ‌నం జాబ్‌ల‌ను సెర్చ్ చేయ‌డానికి ఎన్నో ప్రత్యేక‌మైన ఆప‌రేటర్స్ ఉన్నాయి. అంటే మ‌నం సెర్చ్ చేసేట‌ప్పుడు ఆ కీ వ‌ర్డ్‌ను కొటేష‌న్స్‌లో పెడితే రిజ‌ల్ట్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ప్ర‌త్యేకించి ఆ జాబ్‌కు సంబంధించిన ఫ‌లితాలే మ‌న‌కు వ‌స్తాయి.

మ‌నం రెండు  ప్ర‌త్యేక విష‌యాల గురించి సెర్చ్ చేస్తున్న‌ప్పుడు ఓఆర్ అక్ష‌రంతో వేరు చేయాలి. అప్పుడు ఈ రెండింటికి సంబంధించిన ఫ‌లితాలు మీకు క‌నిపిస్తాయి. ఉదాహ‌రణ‌కు  మార్కెటింగ్ రైటర్ ఆర్ బిజినెస్ రైట‌ర్ అనే సెర్చ్ చేస్తే మీకు రెండింటికి సంబంధించిన జాబితా వ‌స్తుంది. 

మ‌నం సెర్చ్ చేసే కీ వ‌ర్డ్ మ‌ధ్య మైన‌స్ సైన్ ఉంచ‌డం వ‌ల్ల కూడా  స్పెసిఫిక్ రిజ‌ల్ట్స్ పొందొచ్చు.  ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం బిజినెస్ రైట‌ర్ జాబ్స్‌, టెక్నిక‌ల్ అనే ఆప్ష‌న్‌తో చెక్ చేస్తే బిజినెస్ రైట‌ర్ - టెక్నిక‌ల్ అని సెర్చ్ చేస్తే మీకు అనుకూల‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. 

మ‌న కీవ‌ర్డ్ త‌ర్వాత పారెంథ‌సిస్ ఉప‌యోగిస్తే కూడా భిన్న‌మైన ఫ‌లితాలు పొందొచ్చు. కొన్ని కంపెనీలు భిన్న‌మైన  టాలెంట్స్ ఉన్న ఉద్యోగుల‌ను కోరుకుంటాయి. మ‌నం ఇలాంటి జాబ్స్ కోసం సెర్చ్ చేసేట‌ప్పుడు మార్కెటింగ్ (రైట‌ర్ ఆర్ బ్లాగ‌ర్ ఆర్ కాపీ రైట‌ర్‌) అని పారెంథ‌సిస్ ఉప‌యోగించి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.