• తాజా వార్తలు
  •  

స్మార్ట్‌ఫోన్ కెమెరాల‌పై ఇన్‌డెప్త్ గైడ్ 

స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ముందు చూస్తున్న‌ది కెమెరానే. ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటే అంత క్లారిటీ, క్వాలిటీ ఇమేజ్ వ‌స్తుంద‌న్న‌ది మ‌నంద‌రి న‌మ్మకం. కానీ ఇమేజ్ క్వాలిటీకి మెగాపిక్సెల్‌తోపాటు చూడాల్సిన‌వి చాలా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.  
సెన్స‌ర్  
స్మార్ట్‌ఫోన్ కెమెరాలో అత్యంత కీల‌క‌మైన కాంపోనెంట్ సెన్స‌ర్‌. లైట్‌ను ఎల‌క్ట్రిక‌ల్ సిగ్న‌ల్స్‌గా అక్క‌డి నుంచి పిక్సెల్స్‌గా మార్చే ఇంపార్టెంట్ రోల్ సెన్స‌ర్‌దే. అందుకే ఇప్ప‌డు స్మార్ట్‌ఫోన్‌కు రియ‌ర్ సైడ్‌లో రెండు సెన్స‌ర్లు పెడుతున్నారు.  అయితే ఇప్పుడు ట్రెండ్‌గా మారిన డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ వ‌ల్ల చిన్న సెన్స‌ర్‌నే ఇస్తున్నారు.  కొన్ని కంపెనీలు ఆర్‌జీబీ, మోనోక్రోమ్ సెన్స‌ర్ల‌ను కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఎటాచ్ చేస్తున్నాయి.  ఫైన‌ల్‌గా చెప్పాలంటే సెన్స‌ర్ క్వాలిటీ,సైజ్ కూడా ఇమేజ్ క్వాలిటీకి చాలా కీల‌కం. 

ఆప‌ర్చ్యూర్ ( Aperture) 
సెన్స‌ర్ లైట్‌ను క‌న్వ‌ర్ట్ చేస్తుంది. అయితే ఎంత లైట్ తీసుకుంద‌నేది కెమెరా ఆప‌ర్చ్యూర్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సెన్స‌ర్ లైట్‌ను తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే హోల్ అన్న‌మాట‌.  దీన్ని f/1.7, f/1.8, f/1.9, f/2.0, f/2.4 ఇలా సైజ్‌ను బ‌ట్టి డిఫైన్ చేస్తారు.  ఇది ఎంత చిన్న‌దైతే అంత బిగ్ ఆప‌ర్చ్చూర్ ఉంటుంది. అంత ఎక్కువ లైటింగ్‌ను తీసుకుంటుంది. అందుకే అత్య‌ధిక శాతం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల లో  f/1.8, f/1.7 ఆప‌ర్చ్యూర్ ఉన్న కెమెరాలే ఉంటాయి.  
లెన్స్ 
ఏ కెమెరాకైనా లెన్సే ప్రాణం. ఇదొక గ్లాస్ పార్ట్‌. దీని ద్వారా లైట్ పాస‌వుతుంది.  ఫోక‌ల్ లెంగ్త్‌ను ఇది డిఫైన్ చేస్తుంది.  అంటే ఫొటో క్వాలిటీని డిసైడ్ చేస్తుంది.  LG G6లో ఒక కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వ‌స్తుంది. ఐఫోన్ 8 ప్ల‌స్‌లో  అయితే 2ఎక్స్ జూమ్‌తో కూడిన టెలిఫోన్ లెన్స్ పెట్టారు. కాబ‌ట్టి ఇమేజ్ అంత క్వాలిటీగా వ‌స్తుంది.  
మెగాపిక్సెల్స్  
ఓవ‌రాల్ ఇమేజ్ క్వాలిటీని నిర్ణ‌యించేవి మెగాపిక్సెల్స్‌. ఇమేజ్‌కు సంబంధించి మోర్ డిటెయిల్స్‌, మోర్ షార్ప్‌నెస్‌, మోర్ లైన్స్‌ను మెగాపిక్సేల్సే తీసుకొస్తాయి. ఒక మెగాపిక్సెల్ అంటే 10 లక్ష‌ల పిక్సెల్స్‌కు స‌మానం. అంటే మెగాపిక్సెల్స్ పెరిగే కొద్దీ మీ ఫోన్ కెమెరా ఇమేజ్‌లో మ‌రింత ఎక్కువ ఇన్ఫ‌ర్మేష‌న్ క్యాప్చ‌ర్ చేయ‌గ‌లుగుతుంది. అంటే డిఫ‌రెంట్ క‌ల‌ర్ వేరియేష‌న్స్‌ను డిఫ‌రెన్షియేట్ చేసి డెప్త్ ఫోటోను ఇస్తుంది.  మొత్తంగా చూస్తే ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉంటే  ఫొటోలో ఎక్కువ డిటెయిల్స్ వ‌స్తాయి. అయితే సెన్స‌ర్‌, లెన్స్ లాంటి ఇత‌ర కాంపోనెంట్స్ బాగుంటేనే క్వాలిటీ పిక్చ‌ర్స్ వ‌స్తాయ‌ని మ‌రిచిపోవ‌ద్దు.  
సాఫ్ట్‌వేర్  
సెన్స‌ర్ లైట్‌ను ఎల‌క్ట్రిక‌ల్ సిగ్న‌ల్స్‌గా మారిస్తే  ఎల‌క్ట్రిక‌ల్ సిగ్న‌ల్స్ పిక్సెల్స్‌గా, పిక్సెల్స్ ఇమేజ్‌గా మారుతుంది. అయితే ఇవ‌న్నీ జ‌రిగి మంచి డిటెయిల్స్‌, మంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌తో, డిఫ‌రెంట్ క‌ల‌ర్ వేరియేష‌న్స్‌తో  క్వాలిటీ ఫోటో రావాలంటే మంచి ఇమేజ్ సిగ్న‌ల్ ప్రాసెస‌ర్ కావాలి.  ఇది ఒక్కో స్మార్ట్‌ఫోన్‌లో ఒక్కోలా ఉంటోంది. కొన్ని కంపెనీలు కాంట్రాస్ట్‌ను పెంచే ప్రాసెస‌ర్‌ను పెడితే, మ‌రికొన్ని ఇమేజ్‌ను రియ‌ల్‌గా ఉంచేలా, ఇంకొన్ని షార్ప్‌నెస్ పెంచేలా, మ‌రికొన్ని ఎక్స్‌పోజ‌ర్స్‌ను హైలైట్ చేసేలా వ‌స్తున్నాయి.   హై కాంట్రాస్ట్ ఉన్న ఫొటోలు మంచి క్వాలిటీతో వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  

విజ్ఞానం బార్ విశేషాలు