• తాజా వార్తలు

ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ వాడేవారికి లైసెన్స్ ఛార్జీలు త‌గ్గించ‌నున్న ప్రభుత్వం? 

గృహావ‌స‌రాల‌కు బ్రాడ్‌బ్యాండ్ వారికి భారం త‌గ్గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోబోతోందని తెలిసింది.  ఇంట్లో ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ వాడేవారికి లైసెన్స్ ఫీజును త‌గ్గించ‌బోతుంద‌ని తెలియ‌వ‌చ్చింది. దీనివల్ల బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ల రెంటల్ త‌గ్గే అవ‌కాశాలున్నాయి. 


ఏడాదికి రూపాయే
సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ముందు ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పోజ‌ల్ ప్ర‌కారం ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ వాడేవారికి లైసెన్స్ ఫీజును ఏడాదికి రూపాయికి త‌గ్గించాలి. ఇది ఇండియాలోని  బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ ఇచ్చే దాదాపు 350 కంపెనీలు  దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు స‌ర్వీస్ కాస్ట్ త‌గ్గుతుంది. 

జియోకు అనుకూలం
ఈ కొత్త ప్ర‌పోజ‌ల్ జియోకు అనుకూలంగా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జియో ఫైబ‌ర్ నెట్ విస్తృతి పెంచుకుంటున్న నేప‌థ్యంలో ఇది ఇండియ‌న్ యూజ‌ర్ల‌కు  ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు