• తాజా వార్తలు

జియో ఫైబ‌ర్ యూజ‌ర్ల‌కు.. జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ


రిల‌య‌న్స్ బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ జియో ఫైబ‌ర్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌.  కంపెనీ సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగిస్తున్న  వారికి జీ 5 ప్రీమియం  మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది.  

జీ5 మెంబ‌ర్‌షిప్‌తో ఏం పొంద‌వ‌చ్చు? 
* మొత్తం 12 భాషల్లో జీ 5 అందుబాటులో ఉంది. 

* 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్  

* 4,500కి పైగా సినిమాలు, 120 వెబ్‌సిరీస్‌లు 

*100 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ప్రీమియం కంటెంట్ ఉన్న లైబ్ర‌రీకి జీ5 ప్రీమియం  మెంబ‌ర్ షిప్‌తో యాక్సెస్ ల‌భిస్తుంది.  

ఈ ప్లాన్స్ వాడేవారికి మాత్ర‌మే
జియో ఫైబ‌ర్ సిల్వర్ ప్లాన్ 3 నెల‌ల రీఛార్జి చేయించుకునేవారికి ఈ జీ5 ప్రీమియం మెంబ‌ర్‌షిప్ ఉచితంగా ల‌భిస్తుంది. అలాగే సిల్వ‌ర్ కంటే పై ప్లాన్స్ అంటే గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినం ప్లాన్స్‌లో కూడా ఈ జీ5  ప్రీమియం  మెంబ‌ర్‌షిప్ ఫ్రీ.  

* అయితే కొత్త యూజ‌ర్ల‌కు సిల్వ‌ర్ ప్లాన్ మంత్లీ ప్లాన్‌లో కూడా ఈ జీ5 ప్రీమియం మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా ఇస్తుంది. అయితే మొద‌టి మూడు నెల‌ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. 

జన రంజకమైన వార్తలు