• తాజా వార్తలు

రివ్యూ: అన్ని కంపెనీల 1 జీబీ డేటా ప్లాన్ల‌లో బెస్ట్ ఏది?

ఇప్పుడు ఎక్కువ‌మంది వాడుతున్న టెలికాం ప్లాన్ల‌లో 1 జీబీ కూడా ఒక‌టి. ఫోన్ల మీద ఎక్కువ ఖ‌ర్చు చేయ‌డం ఇష్టం లేనివాళ్లు.. అవ‌స‌రం త‌క్కువ‌గా ఉన్న‌వాళ్ల‌కు ఈ ప్లాన్లు బాగా సూట్ అవుతాయి. ఇలాంటి వారి కోసం టెలికాం బ‌డా కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా ఎన్నో ప్లాన్ల‌ను సిద్ధం చేశాయి.. వాటిలో ముఖ్య‌మైన‌వి ఏంటో తెలుసుకుందామా..

జియో 149 ప్లాన్‌
జియోలో ఇది బేసిక్ ప్లాన్‌.  దీని వ్యాలిడిటీ 28 రోజులు. రోజుకు 1 జీబీ హై స్పీడ్ డేటాతో ఇది ప‌ని చేస్తుంది. అలాగే రూ.199 ప్లాన్ ద్వారా మొత్తం 28 రోజుల‌కు 28 జీబీ పొందొచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా చేసుకోవ‌చ్చు. ఇక జియో టు జియో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆప్ష‌న్ ఎలాగో ఉంది. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 1000 మినిట్స్ వ‌ర‌కు ఉచితంగా మాట్లాడుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ఛార్జీలు వ‌ర్తిస్తాయి. 

ఎయిర్‌టెల్ 219 ప్లాన్‌
జియో మాదిరిగానే ఇది కూడా రోజుకు 1 జీబీ డేటా ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. 219 ప్లాన్‌లో మీకు వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవ‌చ్చు. ఆన్ నెట్, ఆఫ్ నెట్ నంబ‌ర్ల‌కు ఈ స‌దుపాయం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా చేసుకునేక అవ‌కాశం దీనిలో ఉంది. కాల్స్ చేసుకోవ‌డానికి ఎలాంటి ఎఫ్‌యూపీ లేదు.

వొడాఫోన్ ఐడియా 199 ప్లాన్‌
వొడాఫోన్ ఐడియా అందిస్తున్న రూ.199 ప్లాన్‌లో 21 రోజుల కాల వ్య‌వ‌ధిలో రోజుకు 1 జీబీ చొప్పున డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆప్ష‌న్ ఉంది. ఇది ఆన్ నెట్ ఆఫ్ నెట్ రెండింటికి వ‌ర్తిస్తుంది. ఎలాంటి ఎఫ్‌యూపీ లేదు. ఇక 100 ఎస్ఎంఎస్‌లు చేసుకునే స‌దుపాయం కూడా ఈ ప్లాన్ క‌ల్పిస్తుంది. 

వొడాఫోన్ ఐడియా 149 ప్లాన్‌
ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1జీబీ డేటా ల‌భిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మీకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ఆన్ నెట్‌, ఆఫ్ నెట్ ద్వారా మీరు కాల్స్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి ఎఫ్‌యూపీ లేదు. 100 ఎస్ఎంఎస్‌లు చేసుకునే స‌దుపాయాన్ని ఈ ప్లాన్ ఇస్తుంది. 

జన రంజకమైన వార్తలు