• తాజా వార్తలు

10 వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి?

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కాంపిటీష‌న్ బాగా పెరిగిపోయింది.  అందులోనూ ఇండియాలో ఎక్కువ మంది 10వేల లోపు ధ‌ర‌లోనే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ‌గా కొంటున్నారు.  ఫోన్ త‌యారీ కంపెనీలు ఎంట్రీ లెవెల్ మార్కెట్‌గా చెప్పుకునే ఈ ప్రైస్ రేంజ్‌లో కోట్లాది మంది ఫోన్లు కొంటున్నారు.  దీంతో ఈ విభాగంలో పోటీ బాగా పెరిగిపోయింది. అందుకే కంపెనీలు పోటీప‌డి ఒక‌ప్పుడు 30, 40 వేల రూపాయ‌ల ఫోన్ల‌లో వ‌చ్చే ఫీచ‌ర్ల‌ను ఇప్పుడు 10వేల రూపాయ‌ల ఫోన్లోనే అందిస్తున్నాయి. ముఖ్యంగా షియోమి, రియ‌ల్‌మీ లాంటి కంపెనీలు వ‌చ్చాక ఈ రేస్ మరీ వేగం పుంజుకుంది. ఈ ప‌రిస్థితుల్లో 10వేల లోపు ధ‌ర‌లో మ‌న‌కు దొరుకుతున్న బెస్ట్ ఫోన్లేమిటో ఓ చూపు చూద్దాం ప‌దండి.. 

రెడ్‌మీ నోట్‌7 ఎస్‌
10వేల రూపాయ‌ల ప్రైస్ రేంజ్ ఉన్న ఫోన్ల విభాగాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లిన ఫోన్ ఇది.  48 మెగాపిక్సెల్ కెమెరా దీనిలో హైలెట్‌
డిస్‌ప్లే:  6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ నాచ్డ్ డిస్‌ప్లే
ర్యామ్‌: 3జీబీ/4జీబీ
స్టోరేజ్‌: 32 జీబీ/ 64 జీబీ
కెమెరా: 48 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 5 ఎంపీ సెకండరీ డెప్త్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్‌
ప్రాసెస‌ర్‌: స‌్నాప్‌డ్రాగ‌న్ 660
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై (ఎంఐయూఐ 10)

రియ‌ల్‌మీ 3
 ఒప్పో స‌బ్సిడ‌రీ కంపెనీ రియ‌ల్‌మీ ఇప్పుడు ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది.  ఈ కంపెనీ నుంచి వ‌చ్చిన రియ‌ల్‌మీ 3 ఇప్పుడు టాప్ సేల్స్‌లో ఉంది. నాచ్డ్ వైడ్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీ దీనికి ప్ల‌స్‌పాయింట్లు
డిస్‌ప్లే:  6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ నాచ్డ్ డిస్‌ప్లే
కెమెరా:  13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు,  13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,230 ఎంఏహెచ్‌
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ70 చిప్ 
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
ధ‌ర‌: 8వేలు

రియ‌ల్‌మీ సీ2 
డిస్‌ప్లే:  హెచ్డీ ప్ల‌స్ వాట‌ర్ నాచ్డ్ డిస్‌ప్లే
ర్యామ్‌: 2జీబీ/3జీబీ
స్టోరేజ్‌: 16 జీబీ/ 32 జీబీ
కెమెరా: 48 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 5 ఎంపీ సెకండరీ డెప్త్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్‌
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ22 చిప్‌సెట్‌ 
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
ధ‌ర‌: 5,999

రెడ్‌మీ 7 ఎ 
డిస్‌ప్లే:  5.45 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ర్యామ్‌: 2జీబీ 
స్టోరేజ్‌: 16 జీబీ/ 32 జీబీ
కెమెరా: 12 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్‌
బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్  (ఫాస్ట్ ఛార్జింగ్)
ప్రాసెస‌ర్‌: స‌్నాప్‌డ్రాగ‌న్ 439
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై (ఎంఐయూఐ 10)
ధ‌ర‌: 5,799

రియ‌ల్‌మీ 5
10 వేల‌లోపు ధ‌ర‌లో అత్యంత ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్న ఫోన్ల‌లో ఇది ఒక‌టి. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీ,  క్వాడ్ కెమెరా దీనిలో హైలెట్స్ 
డిస్‌ప్లే:  6.5 అంగుల‌ళా ఫుల్ హెచ్డీ ప్ల‌స్  నాచ్డ్ డిస్‌ప్లే
ర్యామ్‌: 3జీబీ/4జీబీ
స్టోరేజ్‌: 32 జీబీ/ 64 జీబీ/ 128 జీబీ
కెమెరా: 12 మెగాపిక్సెల్  ప్రైమ‌రీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్ లెన్స్‌,  2, 4 మెగాపిక్సెల్స్‌తో మాక్రో అండ్ డెప్త్ సెన్స‌ర్లు,   13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్‌
ప్రాసెస‌ర్‌: స‌్నాప్‌డ్రాగ‌న్ 665
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
ధ‌ర‌: 9,999

రియ‌ల్‌మీ 3 ఐ
డిస్‌ప్లే:  6.22 అంగుళా హెచ్డీ ప్ల‌స్  డిస్‌ప్లే
ర్యామ్‌: 3జీబీ/ 4జీబీ 
స్టోరేజ్‌: 32 జీబీ/ 64 జీబీ 
కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,230 ఎంఏహెచ్‌
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ670 ఎస్‌వోసీ
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
ధ‌ర‌: 8,395

రియ‌ల్‌మీ 3 ప్రో 
డిస్‌ప్లే:  6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ వాట‌ర్ డ్రాప్ నాచ్డ్ డిస్‌ప్లే
ర్యామ్‌: 4జీబీ
స్టోరేజ్‌: 64 జీబీ
కెమెరా:  వ‌న్‌ప్ల‌స్ 6టీ ఫోన్‌లో ఉండే సోనీ ఐఎంఎక్స్ 519 సెన్స‌ర్‌తో16 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 5 ఎంపీ సెకండరీ డెప్త్ కెమెరా, 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,045 ఎంఏహెచ్ (వూక్ చార్జ‌ర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌)
ప్రాసెస‌ర్‌:  స్నాప్‌డ్రాగ‌న్ 710 
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
ధ‌ర‌: 9,999

శాంసంగ్ గెలాక్సీ ఎం20
డిస్‌ప్లే:  6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ర్యామ్‌: 3జీబీ/ 4జీబీ
స్టోరేజ్‌: 32 జీబీ/ 64 జీబీ
కెమెరా:  13 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్ (15 వాట్స్ ఫాస్ట్ ఛార్జ‌ర్‌)
ప్రాసెస‌ర్‌: ఎక్సినోస్ 7904 
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్‌
ధ‌ర‌: 9,999

షియోమి రెడ్‌మీ నోట్ 7
2019లో 10వేల లోపు ధ‌ర‌లో అత్య‌ధికంగా అమ్ముడైన ఫోన్ల‌లో షియోమి రెడ్‌మీ నోట్ 7 కూడా ఒక‌టి.
డిస్‌ప్లే:  6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డాట్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ముందు వెనుక కూడా
ర్యామ్‌: 3జీబీ/ 4జీబీ
స్టోరేజ్‌: 32 జీబీ/ 64 జీబీ
కెమెరా:  12 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 2 ఎంపీ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్ 
ప్రాసెస‌ర్‌: స‌్నాప్‌డ్రాగ‌న్ 660 ఎస్‌వోసీ
ధ‌ర‌: 9,999
 

జన రంజకమైన వార్తలు