• తాజా వార్తలు

 రివ్యూ - షియోమి ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 4.. ఎలా ఉందంటే..

షియోమి.. ఈ చైనా మొబైల్ కంపెనీ ఇండియ‌న్ మార్కెట్‌లో శాంసంగ్‌ను వెనక్కినెట్టి నెంబ‌ర్‌వ‌న్ స్థానానికి చేరింది. కానీ ఒక బ్రాండ్‌గా ఇండియ‌న్ మార్కెట్‌లో ఇంకా నిలదొక్కుకోలేదు. ఆ దిశ‌గా వివిధ ప్రొడ‌క్ట్‌లు అమ్మ‌డానికి సిద్ధ‌మైంది. దీనిలో భాగంగా తొలుత షియోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  తక్కువ ధరకే మంచి ఫీచ‌ర్ల‌తో ఏకంగా 55 అంగుళాల స్క్రీన్‌తో ఎంఐ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ టీవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
డిజైన్ అండ్ డిస్‌ప్లే
షియోమి ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ని చూడ‌గానే దీని డిజైనింగ్‌కే కంపెనీ చాలా ఖ‌ర్చుపెట్టింద‌ని ఈజీగా అర్ధ‌మ‌వుతుంది.  స్లీక్ డిజైన్‌తో  జ‌స్ట్ 4.9 మి.మీ మందంతో కూడిన ఈ టీవీ చూడ‌డానికి చాలా ఆక‌ర్షణీయంగా ఉంది.స్లీక్‌గా, ప‌ల‌చ‌గా టీవీని త‌యారు చేయ‌డం కోసం కేవ‌లం స్క్రీన్ మాత్ర‌మే ఉండేలా చేసుకున్నారు. టీవీకి సంబంధించిన ఇంట‌ర్న‌ల్ స‌ర్క్యూట్ సిస్టం అంతా కింది భాగంలో స్టాండ్ ద‌గ్గ‌రే అమ‌ర్చారు. రెండు మెటాలిక్ ఎల్ షేప్‌తో ఉండే స్టాండ్‌తో ఎలాంటి  స‌ర్ఫేస్ మీద అయినా ఫ‌ర్మ్‌గా నిల‌బ‌డుతుంది.  వాల్‌మౌంట్ కూడా చేసుకోవ‌చ్చు.
* బీజిల్ లెస్ (అంచులు లేని) డిస్‌ప్లే కావ‌డంతో మొత్తం టీవీ అంతా పిక్చ‌ర్ క‌నిపిస్తుంది.  
* శాంసంగ్ త‌యారు చేసిన 10 బిట్ వీఏ పేన‌ల్‌తో కూడిన ఈ టీవీ డిస్‌ప్లే  3840x2160 రిజ‌ల్యూష‌న్‌తో, 4కే రిజ‌ల్యూష‌న్‌తో కూడిన హైక్వాలిటీ పిక్చ‌ర్‌ను ఇస్తుంది. 
* 54.5 అంగుళాల  ఈ టీవీ హెచ్‌డీఆర్ క్యాప‌బులిటీతో సూప‌ర్ కాంట్రాస్ట్‌, క‌ల‌ర్‌తో చూడ‌డానికి మెస్మ‌రైజింగ్ పిక్చ‌ర్ వ్యూను ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఈ స్మార్ట్ టీవీ పిక్చ‌ర్ క్వాలిటీ మిగ‌తా పెద్ద బ్రాండ్ల‌లో ల‌క్ష రూపాయ‌ల టీవీలోగానీ దొర‌క‌దు.
ఫీచ‌ర్లు
* 2 యూఎస్‌బీ పోర్టులు
* 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు 
* ఎథ‌ర్‌నెట్ పోర్ట్ , ఏవీ ఇన్‌పుట్‌
* వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ( ఈ పోర్టుల‌న్నీ టీవీ బ్యాక్ సైడే ఉన్నాయి)
రిమోట్ కంట్రోల్‌, మొబైల్ యాప్‌
రిమోట్ దీనికి మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. గంద‌ర‌గోళం లేకుండా జ‌స్ట్ 11 బ‌ట‌న్స్‌తో రిమోట్ చాలా స్టైలిష్‌గా ఉంది. అంతేకాదు ఇది యూనివ‌ర్స‌ల్ రిమోట్ కావ‌డంతో మీరు డీటీహెచ్ వాడుకునేందుకు మ‌రో రిమోట్‌ను కూడా ద‌గ్గ‌ర పెట్టుకోన‌క్క‌ర్లేకుండా ఈ రిమోట్‌నే వాడుకోవ‌చ్చు.  అంతేకాదు ఈ రిమోట్ టీవీకి బ్లూటూత్‌తో క‌నెక్ట్ అయి ఉంటుంది కాబట్టి టీవీ ఎదురుగా కూర్చునే రిమోట్ ఆప‌రేట్ చేయాల్సిన ప‌ని లేదు. బ్లూటూత్ రేంజ్ ప‌రిధిలో ఎక్క‌డి నుంచైనా రిమోట్‌తో టీవీని ఆప‌రేట్ చేసేయొచ్చు.
* అంతేకాదు ఈ ఎంఐ స్మార్ట్ టీవీ4కోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌ను త‌యారుచేశారు. దీంతో కూడా మీరు టీవీని ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు.
పెర్‌ఫార్మెన్స్‌
 ఈ స్మార్ట్‌ టీవీ 64-బిట్ క్వాడ్ కోర్ చిప్ సెట్‌, 1.8 గిగాహెర్ట్జ్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చింది. 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్ ఉంది. టీవీలో వ‌చ్చే ప్రోగ్రామ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని స్టోర్ చేసుకోవ‌డానికి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
సాఫ్ట్‌వేర్ విష‌యానికి వ‌స్తే షియోమి ఎంఐ టీవీ4 ఆండ్రాయిడ్ 6.0 పాచ్‌వాల్ ఓఎస్‌తో ర‌న్ అవుతుంది.  ర‌క‌ర‌కాల యాప్స్‌ను ఈ టీవీలో వాడుకోవ‌చ్చు. సోనీ లైవ్‌, హంగామా ప్లే, వూట్‌, వూట్ కిడ్స్ వంటి వాటితో టై అప్ కూడా ఉంది.
ప్ర‌తి రూపాయికి న్యాయం
మొత్తంగా చెప్పాలంటే ఈ షియోమి ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 మీరు పెట్టే ప్ర‌తి పైసాకు న్యాయం చేస్తుంది. ఎందుకంటే 55 ఇంచెస్ బీజిల్‌లెస్ డిస్‌ప్లే, స్మార్ట్ టీవీ, హైలీ డిజైన్డ్ రిమోట్ అండ్ యాప్, 4కే రిజ‌ల్యూష‌న్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌న్నీ ఉన్న టీవీ పెద్ద బ్రాండ్ల‌ది కొనాలంటే ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు పెట్టాలి. కాబ‌ట్టి ఈ టీవీ వాల్యూ ఫ‌ర్ మ‌నీ పీస్‌. 

జన రంజకమైన వార్తలు