• తాజా వార్తలు
  •  

స్పీచ్ బేస్డ్ ఏఐ కంపెనీలు హైద‌రాబాదీ యాస‌ను ఎందుకు రిక‌గ్నైజ్ చేయ‌డం లేదు?

స్పీచ్ బేస్డ్ టెక్నాల‌జీ కంపెనీలు 2000వ  సంవ‌త్స‌రం నుంచే ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త రెండు మూడేళ్లుగా వీటి ఉప‌యోగం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. యాపిల్‌, గూగుల్ లాంటి టెక్నాల‌జీ దిగ్గ‌జాలు అలెక్సా, సిరి, కోర్టానా  లాంటి స్పీచ్ బేస్డ్  వాయిస్ అసిస్టెంట్ల‌తో ప్ర‌పంచాన్ని కొత్త మ‌లుపులు తిప్పుతున్నాయి. కేవ‌లం మీ వాయిస్ క‌మాండ్‌తో ప‌నంతా చేసిపెట్టే రోబోలు, స్మార్ట్ హోమ్‌లు ఇవ‌న్నీ దీని ప్ర‌భావ‌మే. కానీ ఇంత డెవ‌ల‌ప్ అవుతున్న‌కంపెనీలు రీజ‌న‌ల్ లాంగ్వేజెస్ విష‌యానికి వ‌చ్చేస‌రికి వెన‌క‌బ‌డిపోతున్నాయి. 
ఐదేళ్ల‌లో మ‌రింత విస్తృతం
రీసెర్చ‌ర్ల అంచ‌నా ప్ర‌కారం మ‌రో 5 నుంచి ప‌దేళ్ల‌లో బ్యాంకుల నుంచి మీకొచ్చే కాల్స్ ఏవీ కూడా మ‌నుషులు చేయాల్సిన ప‌రిస్థ‌తి ఉండదు. స్పీచ్ రిక‌గ్నైజ్ చేయ‌గ‌లిగే ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాల‌జీయే అంతా చూసుకుంటుంది.  ఇప్ప‌టికే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థ‌లు దీనిలో చాలా ముంద‌డుగు వేశాయి. స్పీచ్ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్లలో వీటి యాక్యుర‌సీ రేట్ 90%పైగా ఉంది. బ్యాంకింగ్‌, టెలికాం వంటి స‌ర్వీసెస్ సెక్టార్‌లో దీనికి ఇంత ప్రాధాన్యం ఉన్న‌ప్పుడు మ‌న లోక‌ల్ లాంగ్వేజ్‌ను అవి గుర్తించ‌లేక‌పోతే మ‌న మాట విన‌డానికి అక్క‌డ మ‌నుషులు ఉండ‌రు. అప్పుడు స‌మ‌స్య ఎలా సాల్వ్ అవుతుంది? 
భాష‌లు క‌లిసిపోవ‌డ‌మే స‌మ‌స్య‌
 హిందీ, అర‌బిక్‌, ఉర్దూ లాంటి భాష‌ల్లో స్పీచ్‌ను బ‌ట్టి ఏఐ టెక్నాల‌జీ 90 % వ‌ర‌కు క‌రెక్ట్‌గానే అర్ధం చేసుకుంటుంది. కానీ క‌న్న‌డ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అది 78% మాత్ర‌మే.  క‌న్న‌డ లాంగ్వేజ్ మాట్లాడిన‌ప్పుడు కొంత తెలుగు, త‌మిళ్ కూడా క‌లిసిన‌ట్లు ఉంటుంది. దీనితోరిక‌గ్నైజ్‌ చేయ‌లేక‌పోతోంది.  మ‌న హైదరాబాదీ యాసనూ గుర్తించ‌లేక‌పోతోంది. ఇందుకు కార‌ణం హైద‌రాబాద్‌లో మాట్లాడేది హిందీ కాదు.. ఉర్దూ కాదు.. తెలుగు కూడా కాదు. ఈ మూడు భాష‌ల మిశ్ర‌మం.  ఇలాంటి మాండ‌లికంలో  మాట్లాడిన‌ప్పుడు  మ‌న మాట‌ను త‌న ద‌గ్గ‌రున్న ఏ లాంగ్వేజ్‌తో కంపేర్ చేయాలో త‌డ‌బ‌డి గుర్తించ‌లేక‌పోతోంది.   హైద‌రాబాదీ యాస అని పిలుచుకునే ఈ భాష వాస్త‌వానికి ఉర్దూ మాండ‌లికం. 700 ఏళ్ల నాటి నుంచి ఉన్న ఈ భాష తెలుగు, హిందీలాంటి వాటితో మిక్స్ అయి  కొత్త యాస‌గా మారింది. దీన్ని గుర్తించ‌డం ఏఐ టెక్నాల‌జీకి త‌ల‌కు మించిన‌ప‌న‌వుతోంది అని రీసెర్చ‌ర్స్ చెబుతున్నారు. ఇలాంటి మిక్స్‌డ్ భాష‌ల‌న్నింటికీ ఇదే స‌మ‌స్య‌.  వీటిని ఏఐ టెక్నాల‌జీ గుర్తించడంలో తేడా వ‌స్తే అర్ధాలు మారిపోయి స‌మ‌స్య తీర‌క‌పోగా కొత్త స‌మ‌స్య క్రియేట్ అయ్యే ప్ర‌మాద‌ముంది.  కామ‌న్‌మేన్‌తో లింక‌ప్ అయి ఉన్న బ్యాంకింగ్‌, టెలిఫోన్ వంటి సెక్టార్ల‌లో ఇలాంటి రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌ల‌ను, యాస‌ల‌ను, మాండ‌లికాల‌ను కూడా గుర్తించేలా ఏఐ టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేయ‌డ‌మే దీనికి ప‌రిష్కారం. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు