• తాజా వార్తలు

త్వ‌ర‌లో రోబోల‌ను ఉప‌యోగించ‌నున్న హైద‌రాబాద్ పోలీసులు

రోబోట్స్ వాడ‌కం... ఇది ప్ర‌పంచంలో ఎప్పుడో ప్రారంభం అయిపోయినా.. మ‌న దేశంలో మాత్రం ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉంది. కొన్నిసాంకేతిక క‌ళాశాల‌ల్లో టెస్టింగ్ నిమిత్తం మాత్ర‌మే వీటిని ఉప‌యోగిస్తున్నారు. అయితే మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే మ‌న అవ‌స‌రాల కోస‌మే మ‌ర మ‌నుషుల‌ను వాడితే మీకు ఎలా అనిపిస్తుంది! అయితే ఇదోదో వార్త మాత్ర‌మే కాదు త్వ‌ర‌లో నిజం కాబోతోంది. హైద‌రాబాద్ పోలీసులు త‌మ ప‌నుల కోసం రోబోట్ల‌ను ఉప‌యోగించే కాలం ఇంకెంతో దూరంలో లేదు. త్వ‌ర‌లోనే  రోబోట్ల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించేందుకు హైద‌రాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

హెచ్‌-బోట్స్ సాయంతో..
రోబోట్స్‌తో ప‌ని చేయించుకోవ‌డం నిజంగా ఒక పెద్ద క‌లే.  ముఖ్యంగా తెలుగు స్టేట్స్‌లో ఇదో విచిత్ర‌మే. కానీ దీన్ని త్వ‌ర‌లోనే నిజం చేయ‌బోతున్నారు తెలంగాణ పోలీసులు. హైద‌రాబాద్‌కు చెందిన రోబోటిక్స్ స్టార్ట‌ప్ హెచ్-బోట్స్ రోబోటిక్స్ ఈ ప్ర‌క్రియ‌కు ఆద్యం పోస్తోంది.  2017 ఏడాది చివ‌రికి హైద‌రాబాద్ పోలీస్ స్టేష‌న్ల‌లో రోబోట్ల‌ను వాడ‌టానికి ఆ సంస్థ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ ఒక ప్ర‌భుత్వ సంస్థ‌లో మ‌ర మ‌నుషుల‌ను ఉపయోగించ‌బోతుండ‌డం భార‌త్‌లోనే ఇదే తొలిసారి.  వీటి వ‌ల్ల పోలీసుల‌కు ప‌ని ఒత్తిడి త‌గ్గి వారు వారు మరింత ఫోక‌స్డ్‌గా విధులు నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

కంప్లైంట్లు తీసుకోవ‌డం...బాంబులు గుర్తించ‌డం
రోబోలు చేసే ప‌నుల‌ను మ‌నుషులు కూడా చేయ‌లేరు. ఇది నిజం. ఎందుకంటే మ‌నుషుల కంటే ఎన్నో వంద‌ల రెట్ల మేథ‌స్సును మనం రోబోల‌కు ఫీడ్ చేయ‌చ్చు. మ‌న‌కంటే ఎంతో వేగంగా ఆలోచించి, వేగంగా ప‌ని చేసేలా చేయ‌చ్చు. ర‌జ‌నీకాంత్ రోబో సినిమాలో ఇదంతా చూశాం కూడా. పోలీసుల‌కు కూడా రోబోలు అలాగే ఉప‌యోగ‌ప‌డనున్నాయి. సెంట్రీలుగా వ‌ర్క్ చేయ‌డానికి, మ‌నుషుల్ని గుర్తు ప‌ట్ట‌డానికి, కంప్లైంట్లు తీసుకోవ‌డానికి, బాంబులు ఉన్న ప్ర‌దేశాల‌ను గుర్తించ‌డానికి రోబోలు గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

ఖ‌ర్చు రూ.70 నుంచి 80 వేలు
రోబోల‌తో ప‌ని చేయించుకోవ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యమే కాదు ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యం కూడా.  ఒక్కో రోబో ధ‌ర రూ.70 వేల నుంచి 80 వేల దాకా ఉంటుంది. ఇంకా అడ్వాన్స‌డ్ రోబోల ధ‌ర‌లు రూ.ల‌క్ష‌ల్లో ఉంటాయి. అయితే ఖ‌ర్చుకు తాము వెన‌కాడ‌బోమ‌ని రోబోల‌తో ప‌ని చేయించుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. హెచ్‌-బాట్స్ త‌యారు చేస్తున్న రోబోలు కేవ‌లం పోలీసుల‌కు మాత్ర‌మే కాదు వ్య‌వ‌సాయానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. పొలాల‌కు నీళ్లు పెట్ట‌డం, ఎరువులు చల్ల‌డం, క‌లుపు తీయ‌డం లాంటి ప‌నులు కూడా  అవి అల‌వోక‌గా చేసేస్తాయి. 

జన రంజకమైన వార్తలు