• తాజా వార్తలు
  •  

మొత్తానికి గూగుల్ అడ్వాన్సడ్ ప్రొటెక్ష‌న్‌ ఇలా తీసుకొచ్చింది

రోజుకు కొన్ని కోట్ల మంది వినియోగించే సైట్ల‌లో గూగుల్ ఒక‌టి. మ‌న‌కు ఏది కావాల‌న్నా వెంట‌నే  గూగుల్ ఓపెన్ చేస్తాం. అయితే మ‌నం  ఎక్క‌డెక్క‌డో గూగుల్‌ను బ్రౌజ్ చేస్తాం.  అయితే ఇలా బ్రౌజ్  చేసేట‌ప్పుడు మ‌న డివైజ్‌ల‌లోకి వైర‌స్‌లు ఎంట‌ర్ కావ‌డం కామ‌న్‌. ఈ వైర‌స్‌లు రాకుండా ఉండ‌డం కోసం ఈ దిగ్గ‌జ సెర్చ్ ఇంజ‌న్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. దీనిలో  భాగంగానే ఆ సంస్థ  అడ్వాన్స్డ్  ప్రొటెక్ష‌న్‌ను తీసుకొచ్చింది.  మ‌రి అదెంటో చూద్దాం..

వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ‌గా
గూగూల్ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన అడ్వాన్డ్స్ ప్రొటెక్ష‌న్ వ‌ల్ల ఫిషింగ్‌, యాక్సిడెంట‌ల్ షేరింగ్ లాంటి వాటి నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చు. అంతేకాదు ఎవ‌రైనా  మ‌న అకౌంట్‌ను  హ్యాక్ చేసిన‌ప్పుడు డేటాను సంర‌క్షించుకోవ‌చ్చు. ఈ అడ్వాన్స్డ్ ప్రొటెక్ష‌న్లో భాగంగా సెక్యూరిటీ కీస్  అనే ఆప్ష‌న్‌ను గూగుల్ ఏర్పాటు చేసింది. అంటే యూఎస్‌బీ లేదా ఏదైనా వైర్‌లెస్ డివైజ్‌ల ద్వారా అకౌంట్ల‌ను సైన్ ఇన్ చేసుకోవ‌చ్చు. టూ స్టెప్ వెరిఫికేష‌న్ ద్వారా ఇక‌పై సైన్ ఇన్ ఉంటుంది. దీని వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌లు అకౌంట్లోకి ఎంట‌ర్ కాకుండా ఉంటాయి. క్రోమ్ బ్రౌజ‌ర్ ఉప‌యోగించినా.. గూగుల్ యాప్స్ వాడినా  గూగుల్ ఈ సెక్యూరిటీ కీస్‌ను త‌ప్ప‌క యూజ్ చేయాల‌ని గూగుల్ చెబుతోంది. ఇలా చేస్తేనే వారి డివైజ్‌కు  అద‌నపు ర‌క్ష‌ణ పెరుగుతుంద‌ని ఆ సంస్థ మాట‌.

అకౌంట్ రిక‌వ‌రీకి కూడా
మీరు పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోతే... లేదా ఒక  అకౌంట్ చాలా కాలం వాడ‌డం మానేస్తే  క‌చ్చితంగా అకౌంట్ రిక‌వ‌రీ చేసుకోవాల్సి వ‌స్తుంది. మ‌ళ్లీ కొత్త పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకోమ‌ని గూగుల్  సూచిస్తుంది. మీరు మళ్లీ అకౌంట్‌ను యాక్సెస్ చేయాలంటే కొన్ని స్టెప్స్ దాటాల్సి ఉంటుంది. దీని కోసం ప్ర‌త్యేకంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అంతేకాదు  అడ్వాన్స్డ్ ప్రొటెక్ష‌న్ ఫీచ‌ర్ వ‌ల్ల కొన్ని యాప్‌లు జీమెయిల్‌, గూగుల్  డ్రైవ్‌ల‌తో లిమిటెడ్ యాక్సిస్ ఉంటుంది.  దీని వ‌ల్ల మ‌న‌కు  ఆన్‌లైన్ అటాక్‌ల నుంచి చాలా వ‌ర‌కు ర‌క్ష‌ణ  క‌లుగుతుంది. ఎందుకంటే రామ్స‌మ్‌వేర్ లాంటి వైర‌స్‌లు మెయిల్ ద్వారానే సిస్ట‌మ్‌లోకి ఎంట‌ర్ అవుతున్నాయి కాబ‌ట్టి. 

జన రంజకమైన వార్తలు